View

జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ రోజునే మహానటి.. సీన్ రిపీట్!

Wednesday,May09th,2018, 10:41 AM

సరిగ్గా 28 యేళ్ల క్రితం ఇదే రోజు (9.5.2018) మెగాస్టార్ చిరంజీవి, అతిలోకసుందరి శ్రీదేవి నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' విడుదలయ్యింది. భారీ వర్షం. ఆడియన్స్ థియేటర్స్ కి రాలేదు. ఈ సినిమా రిజల్ట్ ఏంటో తెలీక ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్, డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు టెన్షన్ పడుతున్న సమయంలో వర్షం తగ్గుముఖం పట్టడం, థియేటర్స్ కి ఆడియన్స్ రావడం జరిగింది. షో పూర్తయ్యేసరికి... సినిమా చాలా బాగుంది... బ్లాక్ బస్టర్ హిట్ టాక్ బయటికి వచ్చింది. ఆ రిజల్ట్ నిర్మాత అశ్వనీదత్ ని ఆనందంలో ముంచెత్తింది. సరిగ్గా 28 యేళ్ల తర్వాత అంతే ఆనందాన్ని ఈ రోజు (9.5.2018) అశ్వనీదత్ అనుభవిస్తుంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజు అశ్వనీదత్ బ్యానర్ వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన 'మహానటి' ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. మహానటి సావిత్రి జీవితాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుంచి యునానిమస్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతే కాదు... ఈ ప్రతిష్టాత్మక సినిమాని నిర్మించినందుకు నిర్మాత అశ్వనీదత్, వారి కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ లను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన అశ్వనీదత్ అల్లుడు, ప్రియాంక దత్ భర్త నాగఅశ్విన్ ని మెచ్చుకోని వారుండరు. ఆ రకంగా 28 యేళ్ల క్రితం 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తో పొందిన ఆనందాన్ని మళ్లీ ఈ రోజు అశ్వనీదత్ కుటుంబం అనుభవిస్తోంది. ఈ విషయాన్ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... 'మహానటి' చిత్రం యూనిట్ ని అభినందించారు.


''సావిత్రి గారి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమా వైజయంతి మూవీస్ కి ధన్యవాదాలు . @KeerthyOfficial పాత్ర లో జీవించింది. శివాజీ గణేశన్ గా @dulQuer నటన అద్భుతం. నాగ అశ్విన్ మరియు చిత్ర యూనిట్ కి నా అభినందనలు.


మా దత్తు గారికి ఆరోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికి మర్చిపోలేదు. అదే రోజు న నేడు మహానటి విడుదలయింది. ఆరోజున జగదేక వీరుడు అతిలోకసుందరి నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు మహానటి నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి.


28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం... చాలా పెద్ద సినిమా తీసాము అనే ఆనందం, ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు...


ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు... మరుసటి రోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది'' అని ట్వీట్ చేసారు రాఘవేంద్రరావు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !