మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రంగస్థలం' చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర చేస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటుంది... జగపతిబాబు చేస్తున్న పాత్ర నెగటివ్ షేడ్ తో కూడుకున్నదా లేక పాజిటివ్ పాత్ర అనే విషయం తెలియలేదు. అయితే 'రంగస్థలం' చిత్రంలోని తన పాత్ర గురించి జగపతిబాబు రివీల్ చేసాడు.
'రంగస్థలం' చిత్రంలో జగపతిబాబు గ్రామ పంచాయితీ హెడ్ గా నటిస్తున్నాడట. సినిమా బాగా వస్తోందని, రాంచరణ్ కంప్లీట్ గా కొత్త అవతారంలో కనిపిస్తాడని కూడా జగపతిబాబు చెప్పాడు. ఈ చిత్రంలో రాంచరణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది.