View

గ్రాండ్ గా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Sunday,March12th,2023, 02:00 PM

'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి ఘన విజయాల తర్వాత యువ కథానాయకుడు నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో హ్యాట్రిక్ ఫిల్మ్ గా వస్తున్న 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'పై భారీ అంచనాలు ఉన్నాయి. 'కార్తికేయ-2', 'ధమాకా' వంటి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ను ఘనంగా నిర్వహించారు. యువ హీరో అడివి శేష్, నిర్మాతలు అశ్వినీదత్, సునీల్ నారంగ్, రవి శంకర్, దామోదర ప్రసాద్, కోన వెంకట్, దర్శకులు బాబీ కొల్లి, మారుతి, నందిని రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. చిత్ర బృందం, అతిరథమహారధుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.


నాయకానాయికల స్వచ్ఛమైన, సహజమైన ప్రేమ ప్రయాణంతో రూపొందిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. "రికార్డు అవుతుందా?.. యాక్షనా?..", "యాక్షన్" అంటూ నాయకానాయికల వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. కాలేజ్ సమయంలో బస్ లో వెళ్తూ అనుపమగా కథానాయిక, సంజయ్ గా కథానాయకుడు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం చూడొచ్చు. ఆ పరిచయం నుంచి వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. ముఖ్యంగా కొన్నేళ్ళ తర్వాత "హాయ్.. నువ్వేంటి ఇక్కడ" అంటూ పెద్దగా పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల్లా మాట్లాడుకోవడం చూస్తుంటే.. అసలు వారి మధ్య ఏం జరిగిందనే ఉత్కంఠ కలుగుతోంది. ట్రైలర్ లోని సన్నివేశాలు, సంభాషణలు చాలా సహజంగా.. ఇది మన మధ్య జరుగుతున్న కథ అనే భావన కలిగించేలా ఉన్నాయి. ఇక నాయకానాయికల మధ్యలోకి శ్రీనివాస్ అవసరాల పాత్ర రావడం, ఆయన రాకతో కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను ముగించారు. ట్రైలర్ లో సునీల్ కుమార్ నామా కెమెరా పనితనం, కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఫ్రేమ్ సహజంగా, అందంగా ఉండగా.. కళ్యాణి మాలిక్ తన సంగీతంతో మరింత అందం తీసుకొచ్చారు. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల-కళ్యాణి మాలిక్ త్రయం ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమనిపిస్తోంది.


ప్రీ రిలీజ్ వేడుకలో యువ హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. "ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు నా గూఢచారి ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు.. గూఢచారి సేవియర్స్ కూడా. నాకు ఎంతో ఇష్టమైన వారు ఇక్కడ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఇళయరాజా గారి పాటలు పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎంత బాగుంటుందో.. ఈ ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. దానికి మూల కారణం శ్రీనివాస్ గారి దర్శకత్వం, కళ్యాణి మాలిక్ గారి సంగీతం. ఈ కాంబినేషన్ ఎంతో ఇష్టం. కల్యాణ వైభోగమే సినిమాలో నాగశౌర్య, మాళవిక జోడి ఆకట్టుకుంది. మరోసారి అదే మాయ చేస్తారు అనిపిస్తుంది. మార్చి 17న ఈ సినిమాని తప్పకుండా థియేటర్ లో చూడండి" అన్నారు.


ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. "వచ్చే వారం విడుదలవుతోన్న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. నేను చూసిన రచయితల్లో, దర్శకుల్లో ఎంతో గొప్ప మనిషి శ్రీనివాస్ అవసరాల. వైజయంతి సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్, నిరంజన్ గారు కలిసి ఒక కొత్త బ్యానర్ ప్రారంభించి ఈ సినిమా నిర్మించాలి అనుకున్నాము. కానీ కొత్త బ్యానర్ ప్రారంభం ఆలస్యం కావడం వల్ల ఇంత మంచి సినిమాను నిర్మించే అదృష్టం నా మిత్రులకు దక్కింది. కళ్యాణ్ మాలిక్ సహా టీమ్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను" అన్నారు.


చిత్ర దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. "ఈ సినిమా స్క్రిప్ట్ దశ నుంచి నాతో ఉన్న విద్యాసాగర్ గారికి థాంక్స్. వివేక్ గారు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు. విశ్వప్రసాద్ గారు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. నా సినీ ప్రయాణంలో నాతో కొన్ని పేర్లు ముడి పడ్డాయి. అందులో మొదటగా చెప్పాల్సిన మనిషి కళ్యాణి మాలిక్ గారు. నా సినిమాకి సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. భాస్కరభట్ల గారు, లక్ష్మీభూపాల గారు అద్భుతమైన పాటలు రాశారు. భాస్కరభట్ల పదాల బావి. ఊహలుగుసగుసలాడే సినిమా నుంచి సాగుతున్న ఎడిటర్ కిరణ్ గారితో ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాకి ఎమోషన్ పండించగల నటి కావాలి. ఈ కథ చెప్పినప్పుడు మాళవిక స్పందన చూసే పూర్తి నమ్మకం వచ్చేసింది. రచయితగా, దర్శకుడిగా నాకు మంచి పేరు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం నాగశౌర్య. తను అద్భుతమైన నటుడు. అతని నటన కోసం సెట్ కి ఉత్సాహంగా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. 1960 నాటి నాకిష్టమైన పాటను ఇందులో రీమిక్స్ చేశాము. ఆ పాటను ఆలపించిన నా మొదటి దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. సునీల్ నామా గారు ఈ కథను సరిగ్గా అర్థం చేసుకొని సినిమాకి అవసరమైన సినిమాటోగ్రఫీని అందించారు. అలాగే నా టీమ్ అందరికీ థాంక్స్" అన్నారు.


చిత్ర కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ.. "ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన వారంతా నాకు కుటుంబసభ్యులు లాంటి వారు. వారి ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనేది మనం తరచూ ఉపయోగించే మాట. ఈ సినిమా విడుదలయాక ఫలానా శౌర్య, ఫలానా శ్రీనివాస్, ఫలానా మాళవిక అంటారు. ఊహలుగుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద సినిమాలను మర్చిపోతారు. ఈ సినిమా మాకు కేరాఫ్ గా నిలుస్తుంది. శ్రీనివాస్ డైరెక్షన్, డైలాగ్స్ అంటే చాలామందికి ఇష్టం. ఆయన డైరెక్షన్ లో నన్ను చూడటం చాలా చాలా ఇష్టం. ఆ నమ్మకంతో చెబుతున్నాడు ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. నాలుగు సంవత్సరాలుగా టీమ్ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ఆరోగ్యం సహకరించకపోయినా శ్రీనివాస్ గారు ఎప్పుడూ స్క్రిప్ట్ మీద పని చేస్తూనే ఉంటారు. ఆయన హిట్ గురించి, ఫ్లాప్ గురించి మాట్లాడరు.. ఎప్పుడూ స్క్రిప్ట్ గురించే మాట్లాడతారు. కళ్యాణి మాలిక్ గారు ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం. విశ్వప్రసాద్ చాలా మంచి ప్రొడ్యూసర్. వరుసగా మంచి సినిమాలు చేస్తున్నారు. నిర్మాతగా పరిచయమవుతున్న దాసరి పద్మ గారికి స్వాగతం. వివేక్ గారు ఎప్పుడూ మంచి సపోర్ట్ ఇస్తారు. కొంతమంది అందమైన అమ్మాయిలు నటిస్తారు.. కానీ నటిస్తున్నప్పుడు అందంగా కనిపించడం చాలా కష్టం.. అది మాళవికలో ఉంది. నాకు ఎంతో ఇష్టమైన నటి మాళవిక. మేమిద్దరం పెద్ద హిట్ కొట్టబోతున్నాం. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టేస్తుంది అని చెప్పను కానీ.. ఈ సినిమాతో మీ మనస్సులో మేము కుర్చీలు వేసుకొని కూర్చుంటాము. దీని తర్వాత 10 15 ఫ్లాప్ లు తీసినా మమ్మల్ని క్షమిస్తారు. అంత మంచి సినిమా ఇది" అన్నారు.


చిత్ర నాయిక మాళవిక నాయర్ మాట్లాడుతూ.. "శౌర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. కళ్యాణ వైభోగమే సినిమాతో మా ప్రయాణం మొదలైంది. నాకు మంచి స్నేహితుడు, నటుడిగా ఎంతో గౌరవిస్తాను. శౌర్యతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. శ్రీనివాస్ గారికి సాహిత్యం మీద ఎంతో పట్టుంది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఆప్తులైన కళ్యాణి మాలిక్ గారు, లక్ష్మీభూపాల్ గారు ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. మా నిర్మాతలు వివేక్ గారికి, పద్మజ గారికి ధన్యవాదాలు" అన్నారు.


చిత్ర నిర్మాత దాసరి పద్మజ మాట్లాడుతూ.. "ఇంతమంచి సినిమాలో భాగమయ్యే అవకాశమిచ్చిన విశ్వ ప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతఙ్ఞతలు. శ్రీనివాస్ గారి, నాగశౌర్య గారి సినిమాలు ఎంతో బాగుంటాయి. ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. మాళవిక పక్కింటి అమ్మాయిలా సహజంగా ఉంటుంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అన్నారు.


చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నాకు నచ్చిన కొన్ని అంశాలు ఉన్నాయి. నాగశౌర్య-మాళవిక జోడి నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశం చూసినప్పుడు ఇంతకంటే గొప్పగా ఎవరైనా నటించగలరా అనిపించింది. తన మూడో సినిమాకి కూడా నాకు అవకాశమిచ్చిన శ్రీనివాస్ గారికి థాంక్స్. గత రెండు సినిమాల్లాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకముంది. సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్న నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్, పద్మజ గారికి ధన్యవాదాలు" అన్నారు.


రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ.. "ఇక్కడికి రావడం ఒక ఫ్యామిలీ ఈవెంట్ కి వచ్చినట్లు ఉంది. అవసరాల శ్రీనివాస్, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, దాసరి ప్రసాద్ గారు, పద్మ గారు అందరూ నాకు మంచి స్నేహితులు. ప్రసాద్ గారు, పద్మ గారు నిన్నుకోరి షూటింగ్ సమయంలో అమెరికాలో మాకు ఎంతో సహాయం చేశారు. ఈ సినిమాతో వాళ్ళు నిర్మాతలుగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. నాగశౌర్య చాలా సహజమైన నటుడు. సరైన పాత్ర పడితే అద్భుతం చేస్తాడు. కళ్యాణి మాలిక్ గారి పాటలు హాయిగా, అద్భుతంగా ఉంటాయి. నేను చింతకాయలరవి సినిమా చేస్తున్న సమయంలో సురేష్ బాబు గారు నాకు శ్రీనివాస్ ని పరిచయం చేశారు. ఆ సినిమాకి శ్రీనివాస్ కొన్ని సన్నివేశాలు కూడా రాశారు. అప్పటినుంచి ఆ బంధం అలా కొనసాగుతుంది. ఈ చిత్రం అందరికీ మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను" అన్నారు.


దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. "నేను ఈ వేడుకకు రావడానికి ప్రధాన కారణం నిర్మాతలు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు. మన సంతోషాన్ని పంచుకోవడానికి ఇండస్ట్రీలో ఎందరో ఉంటారు. కానీ మన కష్టాన్ని పంచుకునే వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు. వారిలో వివేక్ గారు ముందు వరుసలో ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంచి చేస్తున్నారు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు. నాగశౌర్య గారి కుటుంబానికి సినిమానే ప్రపంచం. శౌర్య మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ముందుకు వెళ్తున్నాడు. ఆయన కటౌట్ కి, కంటెంట్ కి సరైన మాస్ సినిమా పడితే మరోస్థాయికి వెళ్తాడు. శ్రీనివాస్ గారి ఊహలుగుసగుసలాడే సినిమా నాకు చాలా ఇష్టం. ఈ సినిమా దానిని మించిన క్లాసిక్ అవుతుందని నమ్ముతున్నాను. మాళవిక గారు కళ్ళతోనే భావాలు పలికించగల నటి. కళ్యాణి మాలిక్ గారు ఎన్నో క్లాసిక్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాకి మంచి సంగీతం అందించారని అందరూ ప్రశంసిస్తున్నారు" అన్నారు.


దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. "దర్శకులు శ్రీనివాస్ సినిమాలలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టైటిల్ తోనే మంచి మార్కులు కొట్టేశారు అనిపిస్తుంది. నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రైలర్ చూస్తుంటూనే ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అర్థమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ కలిసి ఎంతో ఇష్టంతో ఈ సినిమా చేశారు. ఇది చాలా మంచి సినిమా. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే చూడండి. ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది" అన్నారు.


దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. "పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా హోమ్ బ్యానర్ లాంటిది. ఈ సినిమాలో భాగమైన వారంతా నాకు అంత్యంత ఆప్తులు. నాగశౌర్య, మాళవిక జంటగా నేను కల్యాణవైభోగమే సినిమా చేశాను. కానీ ఈ ట్రైలర్ చూశాక వీళ్ళతో ఇలాంటి లవ్ స్టోరీ చేయలేకపోయానే అనిపించింది. శ్రీనివాస్ అవసరాల కథలు, సంభాషణలు చాలా బాగుంటాయి. కళ్యాణి మాలిక్ గారి సంగీతం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. మా శౌర్య మంచి మనసున్న అబ్బాయి. శౌర్య, మాళవిక ఎంతో ప్రతిభ ఉన్న నటులు. శ్రీనివాస్ లాంటి దర్శకుడికి ఇలాంటి నటులు దొరికితే ఇది ఖచ్చితంగా క్లాసిక్ అవుతుంది" అన్నారు.


సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. నిర్మాతలు ప్రసన్న కుమార్, ఎస్.కె.ఎన్, గీత రచయితలు భాస్కరభట్ల, లక్ష్మీభూపాల్, గాయకుడూ ఆభాస్ జోషి, ఎడిటర్ కిరణ్, నటీనటులు అశోక్ కుమార్, మేఘ చౌదరి, అర్జున్ ప్రసాద్, సౌమ్య, హరిణి, అభిషేక్, శ్రీవిద్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్


నిర్మాతలు - టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,దర్శకుడు - - శ్రీనివాస్ అవసరాల
సహ నిర్మాత - వివేక్ కూచిభొట్ల
డీవోపీ - సునీల్ కుమార్ నామ
సంగీతం - కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
లిరిక్స్ - భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
ఎడిటర్ - కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్ - అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ - సునీల్ షా, రాజా సుబ్రమణియన్
కొరియోగ్రాఫర్స్ – రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్ - శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్ - అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్ - హర్ష చల్లపల్లి
పీఆర్ఓ - లక్ష్మీవేణుగోపాల్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !