filmybuzz

View

నితిన్, రానా, బెల్లంకొండ శ్రీనివాస్... ఫైనల్ విన్నర్ ఎవరో తెలుసా?

Friday,August11th,2017, 10:39 AM

శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి. విడుదలవుతున్న సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందనే ఆసక్తి. ఆ రోజంతా విడుదలైన సినిమాల గురించిన ముచ్చట్లు మాట్లాడుకుంటూ సరదాగా గడిపేస్తారు ప్లబిక్ ఆడియన్స్. చిత్ర పరిశ్రమకు చెందిన వారైతే, ఏ సినిమా ఎలా ఉంది.. బాక్సాపీస్ వద్ద వసూళ్లు కురిపించే సినిమా ఏదీ... నెటిజన్ల మనసులను గెల్చుకున్న సినిమా ఏదీ... ఏ సినిమాకి ఎంత రేటింగ్ సోషల్ మీడియాలో వచ్చిందనే కబుర్లుతో గడిపేస్తారు. స్టార్ హీరో సినిమా అయితే ముందు రోజు జరిగే ప్రీమియర్స్ టాక్ తోనే సందడి ఆరంభమవుతుంది. అదే చిన్న సినిమాలు అయితే ఫస్ట్ షో అయిపోయిన తర్వాత వచ్చే టాక్ ని బట్టి ఆ సినిమాల రన్ ఎలా ఉంటుందో అంచనాలు ఆరంభమవుతాయి. ఇక ఈ రోజు (11.8.2017) ముగ్గురు కుర్ర హీరోలు రంగంలోకి దిగారు. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'జయ జానకి నాయక', రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి', నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ నిర్మించిన 'లై' చిత్రాలు విడుదలయ్యాయి.


మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ బోయపాటి తన మార్క్ ని ఏ మాత్రం మిస్ అవ్వకుండా బెల్లంకొండ శ్రీనివాస్ తో తెరకెక్కించిన 'జయ జానకి నాయక' విడుదలైన అన్నిసెంటర్స్ లోనూ పాజిటివ్ టాక్ తో పాటు వసూళ్ల పరంగా కూడా విజృంభిస్తోందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. లవ్ స్టోరీకి, కమర్షియల్ హంగులను జోడించి... సెంటిమెంట్ ని దట్టించి ఓ అప్ కమింగ్ హీరోని బలంగా మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యేలా చేసాడు బోయపాటి.


పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రానా దగ్గుబాటి హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. సాధారణ వడ్డీ వ్యాపారి సి.యం సీటు మీద కన్నేసి, అడ్డం వచ్చిన వారిని తొక్కుకుంటూ, తన తెలివితేటలతో ఎంతోమందిని బురిడీ కొట్టించి ఫైనల్ గా పబ్లిక్ తమ నేతను ఎన్నుకునేటప్పుడు చూడాల్సిన క్వాలీటీస్, ఎలాంటివారు దేశాన్ని పరిపాలించాలని చెప్పిన వైనం సూపర్బ్. కొన్నిసీన్స్ ఇల్లాజికల్ గా అనిపించవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు తెరకెక్కించిన విధానం బాగుంది. అయితే ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో కూడా తన మార్క్ లవ్ స్టోరీని భార్య, భర్తలైన రానా, కాజల్ పాత్రలతో నడిపించాడు డైరెక్టర్. ఈ ఇద్దరి మధ్య చక్కటి కెమిస్ట్రీ కుదిరింది. సెటైరికల్ డైలాగులు, పంచ్ లు ఈ సినిమాకి ప్రధాన బలం. జోగేంద్రగా రానా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అద్భుతం. మొత్తం మీద అన్ని వర్గాల ఆడియన్స్ ని ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కొంత విరామం తర్వాత తేజ చేసిన ఈ సినిమా.. 'తేజ ఈజ్ బ్యాక్' అని అందరూ అనుకునేలా చేస్తోంది. వసూళ్ల పరంగా కూడా ఢోకా లేదని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.


లవర్ బోయ్ నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిప స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లై'. ఈ సినిమాకి ప్రధాన బలం స్టోరీ, స్ర్కీన్ ప్లే. లవ్, ఇంటిలీజెన్స్, శత్రుత్వం... ఈ మూడు పాయింట్స్ ని ప్రధానంగా తీసుకుని డైరెక్టర్ చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అయ్యింది. విడుదలైన అన్ని ఏరియాల నుంచి మంచి రిపోర్ట్ వస్తున్నాయి. 'అ ఆ' తర్వాత నితిన్ ఖాతాలో మరో హిట్ పడింది.


మొత్తం మీద విడుదలైన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడం సినీ ప్రియులను సంతోషపెడుతోంది. రెండో శని, ఆదివారంతో పాటు ఆగస్ట్ 14న కృష్ణాష్ణమి, 15న స్వాతంత్ర దినోత్సవం సెలవులు కలిసి వస్తాయి కాబట్టి ఈ హాలీడేస్ ని ఈ సినిమాలు క్యాష్ చేసుకోబోతున్నాయి. సో.. ఈ రోజు రంగంలోకి దిగిన హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ విన్నర్లే. కాసుల వర్షంతో ఈ వారం బాక్సాఫీస్ కళకళలాడి పోతుందని ట్రేడ్ వర్గాలు వేస్తున్న అంచనాలను ఈ సినిమాలు అందుకుంటాయని ఆశిద్దాం.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !