సెల్ ఫోన్ షాపు నడుపుకుంటున్న తండ్రి జైరాజ్, కొడుకు బెనిక్స్ లను లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల కస్టడీలో ఉన్న ఈ తండ్రికొడుకు చనిపోవడం పెద్ద దూమారాన్నిరేపుతోంది. తూతుకూరిన్ లోని సాతన్ కులమ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు పెట్టిన టార్చర్ తో కోవైపట్టిలోని హాస్పట్లలో ఈ నెల 23న చనిపోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని కలచివేస్తోంది. పోలీసులు ఈ విధంగా టార్చర్ చేయడం ఏంటీ..వారికి కఠిన శిక్ష పడాలని జనాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. మద్రాస్ హైకోర్టు నుంచి పర్మిషన్ రాగానే ఈ కేసును సిబిఐకి బదలీ చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదిలా ఉంటే...
పోలీసులను చాలా గొప్పగా తన సినిమాల్లో చూపిస్తుంటారు డైరెక్టర్ హరి. ఒకటి, రెండు సినిమాలు కాదు... 5 సినిమాల్లో పోలీసులను చాలా గొప్పగా చూపించిన హరి... ''జైరాజ్, బెనిక్స్ ఘటనపై స్పందిస్తూ - పోలీసులను ఇలా చూపించినందుకు చింతిస్తున్నాను. ఖచ్చితంగా ఈ తండ్రి, కొడుకుకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి. ఆ పోలీసులకు శిక్ష పడాలి'' అని పేర్కొన్నారు.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్, మంచు హీరో మనోజ్ కూడా స్పందిస్తూ... ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
హరి మాత్రమే కాదు... సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు.