'భరత్ అనే నేను' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ స్ర్కిఫ్ట్ కూడా రెడీ చేసాడని, హీరోయిన్ల ఎంపిక జరుగుతోందని, వచ్చే యేడాది ఫస్టాఫ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమై పోతుందని వార్తలు హల్ చల్ చేసాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరో వార్త వినబడుతోంది. అదేంటంటే...
చిరు 'సైరా నరసింహారెడ్డి' చిత్రం పూర్తవ్వడానికి ఇంకా సమయం పడుతుందట. ఈ సినిమా విడుదల వచ్చే యేడాది కాకుండా, 2020 లో ఉంటుందని తెలుస్తోంది. 'సైరా' నరసింహారెడ్డిని విజువల్ వండర్ లా తీర్చిదిద్దాలని పిక్స్ అయ్యారట. యుద్ధ సన్నివేశాలకు సి.జి, విజువల్ ఎఫెక్ట్స్ చేయడం చాలా లేట్ అవుతుందట. అందుకే 2020 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా విడుదల తర్వాతే తదుపరి సినిమా చేయాలని భావిస్తున్నారట చిరు. ఈ నేపధ్యంలో చిరుతో సినిమా లేట్ అవుతుందని భావిస్తున్న కొరటాల మరో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. చిరు సినిమా కంటే ముందు మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడట కొరటాల. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరికల్లా పూర్తయిపోతుందట. ఆ వెంటనే కొరటాలతో సినిమా చేయడానికి మహేష్ బాబు సుముఖంగానే ఉన్నాడని సమాచారమ్. ఎందుకంటే డైరెక్టర్ సుకుమార్ ఇంతవరకూ మహేష్ బాబును ఇంప్రెస్ చేసే స్టోరీ లైన్ చెప్పలేకపోయాడట. దాంతో సుకుమార్ కి స్టోరీ లైన్ కుదరకపోతే, కొరటాల శివ సినిమాతో ముందుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడట మహేష్ బాబు. మరి ఈ మార్పులు జరిగితే చిరుతో కాకుండా మహేష్ తో కొరటాల తదుపరి సినిమా ఆరంభమవుతుంది. అప్పుడు సుకుమార్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.