క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి 'రంగస్థలం' భారీ విజయాన్ని చేకూర్చింది. ఇప్పటిదాకా సుకుమార్ చేసిన సినిమాల్లో భారీ వసూళ్లను కురిపించి కమర్షియల్ గా వర్కవుట్ అయిన సినిమా 'రంగస్థలం'. దాంతో సుకుమార్ తదుపరి సినిమా హీరో ఎవరు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజా వార్తల ప్రకారం 'రంగస్థలం' చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ మరో సినిమాని సుకుమార్ దర్శకత్వంలో నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. హీరో కూడా కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది.
'1 నేనొక్కడినే' చిత్రం ప్రిన్స్ మహేష్ బాబు, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అప్పట్నుంచి మహేష్ బాబుతో ఓ సక్సెస్ ఫుల్ సినిమా చేయాలని సుకుమార్ చెబుతూ వస్తున్నాడు. ఇటీవల ఇంటర్య్వూలో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానని చెప్పేసాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందట. మంచి ముహూర్తం చూసుకుని ఈ సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నారట.
కాగా ఈసారి టోటల్ క్లాస్ ఎలిమెంట్స్ తో సినిమా చేయాలని సుకుమార్ అనుకోవడంలేదట. క్లాస్, మాస్ ని టార్గెట్ చేస్తూ, పక్కా కమర్షియల్ సినిమా మహేష్ బాబుతో చేయాలని ఫిక్స్ అయ్యాడట సుకుమార్. ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లబోతున్నాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత మహేష్ బాబు కోసం అనుకున్న స్టోరీ లైన్ కి తుదిమెరుగులుదిద్ది మహేష్ కి వినిపించాలని భావిస్తున్నాడట సుకుమార్. సో... మహేష్ బాబు 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుంది. అన్నీ కుదిరితే మహేష్ 26వ సినిమా చేసే అవకాశం సుకుమార్ కి దక్కుతుంది. ఈ యేడాది చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారమ్.