'సైరా' నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన ఓ సెట్ లో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ నుంచి ఈ చిత్రం యూనిట్ రామోజీ ఫిలింసిటీకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ మెగాస్టార్ చిరంజీవి, నయనతార పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఇదిలా ఉంటే...
త్వరలో మిల్క్ బ్యూటీ తమన్నా ఈ చిత్రం షూటింగ్ లో జాయిన్ కాబోతోందని సమాచారమ్. ఇందులో తమన్నా దేవదాసి టైప్ రోల్ చేయబోతోంది. ముందు 10 నిముషాల నిడివితోనే తమన్నా పాత్రను అనుకున్నారట. కానీ తమన్నాతో లుక్ టెస్ట్ చేసిన తర్వాత అరగంట ఈ పాత్ర నిడివిని పొడిగించారని సమాచారమ్. ఇక మరో విశేషమేంటంటే...
ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని భావిస్తున్నారట. వచ్చే యేడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్స్ కి రానుంది.