పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శీనివాస్, ప్రముఖ పంపిణిదారుడు, నిర్మాత, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కలిసి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి మూల కధను త్రివిక్రమ్ సమకూర్చారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 26 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుందని తెలుస్తోంది.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి హీరోయిన్ ని ఖరారు చేసారని తెలుస్తోంది. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'లై' చిత్రం ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్న మేఘా ఆకాష్ మరో కుర్ర హీరో రామ్ సరసన కూడా ఓ సినిమా చేస్తోంది. తాజాగా నితిన్ తో రెండోసారి జత కట్టడానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కున్న చిత్రానికి మేఘా ఆకాష్ ని హీరోయిన్ గా తీసుకున్నారట.
పవన్ కళ్యాణ్ నిర్మాత, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాల కథ ఇవ్వడం, నితిన్ హీరో కావడం ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో నటించే అవకాశమంటే మేఘా ఆకాష్ కి బంపర్ ఆఫర్ తగిలినట్టే కదా..!