కరోనా కారణంగా చిత్రపరిశ్రమ ఎంత నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్ లు ఆగిపోయి, సినిమాలు విడుదలవ్వక వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది సినిమా ఇండస్ట్రీ. 2020 లో కళతప్పిన బాక్సాఫీస్ 2021 లో అయినా కోలుకుంటుందని, బాక్సాఫీస్ కి పూర్వ వైభవం రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ యేడాది ఫస్ట్ విడుదలైన 'క్రాక్' సినిమా హిట్ అవ్వడంతో సినీ జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అవ్వడం పాజిటివ్ సైన్ గా భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలకాబోతున్న 'రెడ్', 'అల్లుడు అదుర్స్', 'మాస్టర్' చిత్రాలు కూడా హిట్ టాక్ సొంతం చేసుకుని... వసూళ్ల పరంగా కూడా ఆశాజనకంగా ఉంటే బాక్సాఫీస్ పుంజుకుంటుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా వరుసగా సినిమాలు విడుదలకానున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి. ఇక వరుసగా విడుదలకానున్న సినిమాల వివరాల్లోకి వెళితే...
ఉప్పెన - ఫిబ్రవరి 5
జాంబిరెడ్డి - ఫిబ్రవరి 5
రంగ్ దే - మార్చి 11
లవ్ స్టోరీ - మార్చి 26
వకీల్ సాబ్ - ఏప్రిల్ 9
టక్ జగదీష్ - ఏప్రిల్ 16
కెజిఎఫ్ చాప్టర్ 2 - ఏప్రిల్ 23
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ - మే 7
ఈ సినిమాల విడుదలతో సినిమా ఇండస్ట్రీ మెల్లిగా మెల్లిగా గాడిన పడుతుందనే ఆశాభావంతో సినీవర్గాలు ఉన్నాయి. సో... 2020లో విలవిలలాడిన బాక్సాఫీస్ మళ్లీ 2021లో పూర్వ వైభవంతో కళకళలాడిపోవాలని ఆశిద్దాం.