తెలుగు జాతి గర్వించదగ్గ యుగపురుషుడు నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి రంగం సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను నందమూరి నటసింహం బాలకృష్ణ చేయబోతున్నారు. దాంతో బాలయ్య పాత్రను ఎవరు చేస్తారనే ఆసక్తికరమైన చర్చ నందమూరి అభిమానుల్లో సాగుతోంది. తాజా వార్తల ప్రకారం బాలయ్య పాత్రను మోక్షజ్ఞ తో చేయించాలని బాలయ్య ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. బాలయ్య టీనేజ్ లో ఉన్నప్పటి ప్రస్తావన ఈ సినిమాలో తేవడం జరుగుతుంది కాబట్టి మోక్షజ్ఞ ఆ పాత్ర చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారట. పైగా తాతయ్య బయోపిక్ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే, ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా ప్లాన్ చేసి ఉంటారు. ఇదిలా ఉంటే...
కొత్త బ్యానర్ స్థాపించి, ఆ బ్యానర్ లో ఎన్టీఆర్ బయోపిక్ ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు బాలయ్య. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే ఫుల్ డిటైయిల్స్ తో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఈ బయోపిక్ తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించడం ఖాయం. వెండితెరపై ఎన్టీఆర్ జీవిత చరిత్రను చూడటం తెలుగు ప్రజలకు ఓ పండగలా ఉంటుంది.