యువ కథానాయకుడు నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై టి.సంతోష్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా నవంబర్ 29న థియేటర్స్ కి వచ్చింది. ఫస్ట్ డే 4.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతున్న సందర్భంగా ఈ చిత్రం యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా...
హీరో నిఖిల్ మాట్లాడుతూ...
అర్జున్ సురవరం సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. మొదటి ఆటనుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మా చిత్ర యూనిట్ అందరూ ఈ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాము. నిర్మాత ఠాగూర్ మధు గారు, రాజ్ కుమార్ గారు రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, సంతోష్ టేకింగ్ ఇలా అందరి ఎఫర్ట్ తో సినిమా అన్ని ఏరియాల్లో బాగా కలెక్ట్ చేస్తోంది. కొంత గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాలో ఉన్న మెసేజ్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యింది. లావణ్య ఈ సినిమాలో మరో మంచి రోల్ చేసింది. ఈ క్యారెక్టర్ ను నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆమెకు థాంక్స్, సినిమా చూడనివారు చూడండి, మిమ్మల్ని అర్జున్ సురవరం తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాడు అన్నారు.