అఖిల్ అక్కినేని, పూజా హెగ్డె కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రం యూనిట్.
ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ లో అఖిల్ వర్క్ చేసుకుంటుంటే వెనక నుంచి పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ చూస్తే ప్రతి ఒక్కరిలో తెలియని రొమాంటిక్ ఫీల్ వస్తుంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్ తో లవ్ లీగా డిజైన్ చేస్తారు. అందుకే ఆయన చిత్రాలకి ఒ స్పెషాలిటి వుంటుంది. అఖిల్ అక్కినేని, పూజా ల మద్య ఎలాంటి కెమిస్ట్రి ఈ చిత్రంలో వుండబోతుందో ఈ పోస్టర్ డిజైనింగ్ తో చాలా చక్కగా, అందంగా చూపించారు దర్శకుడు భాస్కర్.
ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఈ కరోనా క్రైసిస్ తగ్గిన తర్వాత షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2021 సంక్రాంతి కి విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.