View

తిరిగిరాని లోకాలకు విజయనిర్మల.. శోకసముద్రంలో చిత్రపరిశ్రమ!

Thursday,June27th,2019, 04:06 AM

ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల ఆరోగ్యం విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పటల్ కు తరలించారు. హాస్పటల్ కి వెళ్లిన కాసేపటికే ఆమె తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. రేపు (28.6.2019) ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయి.


1946, ఫిబ్రవరి20న తమిళనాడులో జన్మించారు విజయనిర్మల. తండ్రిది చెన్నయ్. తల్లిది నరసరావుపేట. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబం. తమిళ చిత్రం 'మత్య్సరేఖ' ద్వారా 7 యేళ్ల వయసులో బాలనటిగా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు విజయనిర్మల. ఆ తర్వాత 11 యేళ్ల వయసులో 'పాండురంగ మహత్యం' చిత్రంలో నటించారు. అనంతరం 'రంగులరాట్నం' సినిమాతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన విజయనిర్మల 200పై చిలుకు చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ చిత్రాల్లో ఆమె నట ప్రస్థావన కొనసాగింది. 'పెళ్లికానుక' సీరియల్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ని కూడా అలరించారు విజయనిర్మల.


ఇక దర్శకురాలిగా విజయనిర్మలది ప్రత్యేక ప్రస్థానం. 1971లో రిలీజ్ అయిన 'మీనా' చిత్రం ద్వారా దర్శకురాలిగా ఆమె ప్రయాణం ఆరంభమయ్యింది. 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదయ్యింది.


మొదటి భర్త కృష్ణమూర్తితో విడాకులు తీసుకున్న తర్వాత సూపర్ స్టార్ కృష్ణను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమె నరేష్ కి జన్మనిచ్చారు. విజయకృష్ణా బ్యానర్ ఆరంభించి నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు విజయనిర్మల. రఘుపతి వెంకయ్య పురస్కారం, నంది అవార్డ్ తో పాటు పలు అవార్డులు ఆమెను వరించాయి. ఆమె మరణవార్త చిత్ర పరిశ్రమను దిగ్ర్బాంతికి గురి చేసింది. పలువురు ప్రముఖులు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, విజయనిర్మల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.


నటిగా, దర్శకురాలిగా, భార్యగా, తల్లిగా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన విజయనిర్మల ఆత్మకు శాంతిచేకూరాలని ఫిల్మీబజ్ టీం కోరుకుంటోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !