పలు చిత్రాల ద్వారా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్ మనసులను దోచుకున్న ప్రియమణి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బుల్లితెర షోలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు 'విరాటపర్వం', 'నారప్ప' సినిమాల్లో కీలక పాత్రలు చేస్తోంది. వీటితో పాటు 'మైదాన్' హిందీ సినిమాలో కూడా నటిస్తోంది.
కాగా ఇంత బిజీగా ఉంటున్న ప్రియమణి తన డేట్స్ ని చూసుకోవడానికి బయట మేనేజర్స్ ని పెట్టుకోలేదు. స్వయంగా తన భర్త ముస్తఫా రాజ్ కి డేట్స్ చూసుకునే విషయాన్ని అప్పజెప్పిందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియమణి ఓ ఇంటర్య్వూలో చెప్పింది. సో... ఇక ప్రియమణి డేట్స్ గురించి మాట్లాడాలంటే ఆమె భర్తను కాంటాక్ట్ చేయాల్సిందే.