తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ, 'మెహబూబా' చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు పూరి జగన్నాధ్. ఈ సినిమా పరాజయం పాలవ్వడంతో ఆకాష్ 2వ సినిమాకి కాస్త గ్యాప్ ఇచ్చాడు పూరి. అయితే ఫస్ట్ సినిమాతోనే నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఆకాష్.
కాగా ఈ రోజు (11.2.2019) ఆకాష్ పూరి రెండవ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. లావణ్య పూరి సమర్పణలో పూరి, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి అసిస్టెంట్ అనిల్ పాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ పూరి అందిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాకి 'రొమాంటిక్' టైటిల్ ని కన్ ఫార్మ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం ఆకాష్ పూరి మేకోవర్ అయ్యాడు. న్యూలుక్ తో స్టైలిష్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు ఆకాష్.