యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి హిట్ చిత్రాలు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందాయి. 'బాహుబలి 2' తర్వాత భారీ బడ్జెట్ తో ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునే చిత్రాన్ని చేయడానికి రాజమౌళి, ఎన్టీఆర్ సమాయత్తమవుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ గురించిగానీ, ఎన్టీఆర్ తో సినిమా చేయడం గురించిగానీ రాజమౌళి ఎక్కడా నోరు విప్పడంలేదు. ఇది ఎన్టీఆర్ అభిమానులను చాలా నిరాశకు గురి చేస్తోంది.
కాగా తాజా వార్తల ప్రకారం ఎన్టీఆర్ కోసం రాజమౌళి ఓ కథ తయారు చేయిస్తున్నాడట. రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ కథ రెడీ చేస్తున్నారని సమాచారమ్. అయితే ఈ విషయంలో చాలా సీక్రెన్సీ మెయింటెన్ చేయాలని తండ్రికి రాజమౌళి చెప్పాడట. అందుకే విజయేంద్రప్రసాద్ కూడా తన టీమ్ లో ముఖ్యమైన వారిని మాత్రమే ఈ స్ర్కిఫ్ట్ కి సంబంధించి ఇన్ వాల్వ్ చేసాడట. వచ్చే యేడాది ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడనే వార్తలు అందుతున్నాయి. సో... ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు.