'బాహుబలి' చిత్రంలో శివగామి పాత్రకున్న ఇంపార్టెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాత్రను అద్భుతంగా పోషించగల రమ్యకృష్ణను తీసుకుని బోల్డన్ని ప్రశంసలు అందుకున్నారు రాజమౌళి. ఈ పాత్రలో ఒదిగిపోయి రమ్యకృష్ణ సైతం బోల్డన్ని ప్రశంసలు అందుకుంది. కాగా ఈ స్ర్కిఫ్ట్ తో టివి సీరిస్ చేస్తున్నారు. ఈ టివి సిరీస్ కి 'ఆరంభ్' టైటిల్ ని కూడా ఫిక్స్ చేసారు.
కాగా భారీ బడ్జెట్ తో రూపొందతున్న ఈ టివి సిరీస్ కోసం శివగామి పాత్రను ఎవరితో చేయించాలా అనే చర్చ జరిగిందట. ఫైనల్ గా ఈ పాత్ర కోసం 'రోజా' ఫేం మధుబాలను తీసుకున్నారు. ఈ పాత్ర చేసే అవకాశం రావడంపట్ల మధుబాల కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. ''వెండితెరపై 'శివగామి' పాత్రకు ఓ ప్ర్యతేకమైన స్థానం లభించింది. ఇప్పుడీ పాత్రను బుల్లితెరపై చేసే అవకాశం రావడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. రమ్యకృష్ణ నా ఫ్రెండ్. శివగామి పాత్రను అద్భుతంగా పోషించింది'' అని చెప్పింది మధుబాల. ఇక దేవసేన పాత్రను నటి రాధ తనయ కార్తీక చేస్తోంది. మరి మధుబాల, కార్తీక ఏ మేరకు ఈ పాత్రల్లో ఒదిగిపోతారో వేచి చూద్దాం.