సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న'సర్కారు వారి పాట' సినిమా కోసం కీర్తిసురేష్ ఓ హీరోయిన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. స్వయంగా కీర్తి ఈ విషయాన్ని స్ఫష్టం చేసింది. తాజా వార్తల ప్రకారం సెకండ్ హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తను ఎవరో కాదు...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' సినిమా కోసం జత కట్టింది నివేదా థామస్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తోంది. తాజాగా మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' కోసం జత కట్టే అవకాశం నివేదాను వరించిందని తెలుస్తోంది. ఇది బంపర్ ఆఫర్ గా భావిస్తున్న నివేదా ఈ సినిమా చేయడానికి అంగీకరించిందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.