కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు శ్యామ్ చెన్నయ్ లోని కోడంబాక్కమ్ లో పోకర్ క్లబ్ నడుపుతున్నాడట. పేకాట బెట్టింగ్ లు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణ చేసుకున్న పోలీసులు శ్యామ్ ని అరెస్ట్ చేసారు. శ్యామ్ అరెస్ట్ అవ్వడం తమిళ చిత్రపరిశ్రమను దిగ్ర్బాంతికి గురి చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా పేకాట బెట్టింగ్ లు నిర్వహించడం, అవకతవకలకు పాల్పడం శ్యామ్ పై మోపబడిన నేరాలుగా తెలుస్తోంది.
'కిక్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు శ్యామ్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ 'కత్తి', 'ఊసరవెల్లి' తదితర చిత్రాల్లో నటించాడు. అల్లు అర్జున్ అన్నయ్యగా, పోలీసాఫీసర్ గా 'రేసు గుర్రం' చిత్రంలో నటించిన శ్యామ్ తెలుగు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. తర్వాత 'కిక్ 2' లో కూడా నటించాడు. వరుసగా సినిమాలు చేస్తున్న శ్యామ్ ఇలాంటి పనులు చేయడమేంటో తెలియాల్సి ఉంది. మరి పోలీసుల కస్టడీలో ఉన్న శ్యామ్ ఎలా బయటపడతాడో వేచిచూడాల్సిందే.