ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిసెంబర్ 17న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా 'తగ్గెదెలె..' అన్నట్టుగా దుమ్ము దులిపేస్తోంది. ఇప్పటివరకూ 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే లభిస్తున్నాయి. చూసిన ప్రతీ ఒక్కరూ సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సౌత్ టూ నార్త్ వరకు బన్నీ సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది. పుష్ప సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది పుష్ప సినిమా చూసారు. ఈ మధ్యే సినిమా చూసిన మహేష్ బాబు... సూపర్ ఎగ్జైట్ అయిపోయారు. అల్లు అర్జున్ నటనను ఆకాశానికి ఎత్తేసారు.
ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. పుష్పలో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్ యూ ట్యూబ్‌లో విడుదలై మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకున్నాయి. ఇప్పుడు థియేటర్స్‌లోనే పుష్ప అద్భుతమైన వసూళ్లు తీసుకురావడం అక్కడి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ పుష్ప సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆర్య నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం.. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసాడు అర్జున్ కపూర్. పుష్ప సినిమా అనేది ఓ ఎక్స్పీరియన్స్ అని.. అది సినిమా కాదంటూ ప్రశంసించారు. కరణ్ జోహార్ సైతం పుష్ప సినిమాను చూసి మెచ్చుకున్నారు. అద్భుతమైన సినిమా.. అద్భుతమైన స్టార్ డమ్.. సూపర్ పర్ఫార్మెన్స్ అంటూ పోస్ట్ చేసాడు. జాన్వీ కపూర్ కూడా ఈ సినిమా చూసి అద్భుతం అంటూ రాసుకొచ్చారు. మరోవైపు ఖష్బూ సుందర్ పుష్ప సినిమాను చూసారు. చూసి ఫిదా అయిపోయారు. ఈ సినిమా కోసం బన్నీ పడిన కష్టాన్ని మెచ్చుకున్నారు. ప్రతీ సింగిల్ ఫ్రేమ్‌లో కూడా అల్లు అర్జున్ కష్టం కనిపించిందని.. అద్భుతమైన సినిమా అంటూ పోస్ట్ చేసారు. దర్శకుడు సుకుమార్ కూడా ఒక్కొక్క ఫ్రేమ్ అద్భుతంగా డిజైన్ చేసాడంటూ చెప్పుకొచ్చారు. టీమిండియా మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా కూడా పుష్ప సినిమాను చూసారు. ఆయన కూడా అల్లు అర్జున్ నటనను చాలా మెచ్చుకున్నారు. అద్భుతమైన సినిమా అంటూ పోస్ట్ చేసారు. అలాగే ఈ మధ్యే టీమిండియా క్రికెటర్స్ అంతా కలిసి పుష్ప సినిమాను చూసారు. వాళ్లకు కూడా సినిమా చాలా బాగా నచ్చింది. ఇలా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో కూడా పుష్ప హవా కనిపిస్తోంది. ఓటిటిలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు ప్రశంసలు మరింత పెరిగాయి.