విశ్వవిఖ్యాత నటసారభౌముడు ఎన్టీఆర్ జీవితచరిత్రను వెండితరపై ఆవిష్కరించడానికి బాలయ్య నడుం బిగించిన సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో 'ఎన్టీఆర్ బయోపిక్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య 67 గెటప్పుల్లో కనిపించబోతున్నారు. అన్న నందమూరి తారకరామారావు చైల్డ్ హుడ్, పర్సనల్ లైఫ్, సినీ రంగప్రవేశం, రాజకీయ రంగప్రవేశం, ఆయన చివరి రోజులు... ఎన్టీఆర్ మిత్రులు, శత్రువులు... ఇలా ఎన్టీఆర్ జీవితంలోని పలు కోణాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మిల్క్ బ్యూటీ తమన్నాని తీసుకున్నారట. ఎన్టీఆర్ తో జయప్రద చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో జయప్రద రోల్ లో తమన్నా కనువిందు చేయనుందట. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సైన్ చేసిన తమన్నా నందమూరి నటసింహం బాలయ్య ప్రతిష్టాత్మక చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్' లో నటించే అవకాశాన్ని కూడా కొట్టేసింది. సో... టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో తమన్నా నటించబోతోంది. ఈ రెండు సినిమాలు తమన్నాకి వచ్చిన మంచి అవకాశాలు అని చెప్పొచ్చు.