యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ విషయంలో ఒప్పించేసి, తన మాట నెగ్గేలా చేసుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఎన్టీఆర్ ని ఏ విషయంలో త్రివిక్రమ్ ఒప్పించాడు అనే వివరాల్లోకి వెళితే...
ఎన్టీఆర్ తో తను చేయబోతున్న సినిమా కోసం అనిరుధ్ రవిచంద్రన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు త్రివిక్రమ్. 'అజ్ఞాతవాసి' చిత్రానికి అనిరుధ్ సంగీతమందించాడు. ఇదే అతని తొలి తెలుగు సినిమా. కాగా 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ అవ్వడంతో అనిరుధ్ ని తీసుకోవడం పట్ల ఎన్టీఆర్ అంత సుముఖంగాలేడట. దేవిశ్రీప్రసాద్ ని తీసుకుందామని చెప్పాడట. అయితే 'అజ్ఞాతవాసి' పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అనిరుధ్ కి ప్లస్ మార్కులు పడ్డాయని చెప్పి ఎన్టీఆర్ ని కన్వీన్స్ చేసాడట త్రివిక్రమ్. దీంతో ఎన్టీఆర్ కన్వీన్స్ అయిపోయి అనిరుధ్ ని తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. మార్చిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి అద్భుతమైన స్టోరీ లైన్ కుదిరినట్టు సమాచారమ్.