మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గత రెండు, మూడు సినిమాలను గమనిస్తే ఓ విషయం అర్ధమవుతుంది. మెయిన్ హీరోతో పాటు మరో హీరోకి కూడా తన కథల్లో ప్రాముఖ్యత కల్పిస్తున్నారు త్రివిక్రమ్. ఆ పాత్రను ఓ కుర్ర హీరోతో చేయిస్తున్నారు. అలా త్రివిక్రమ్ గత సినిమాల్లో కీలక పాత్రలు చేసిన హీరోలు ఆది పినిశెట్టి. నవీన్ చంద్ర, సుమంత్.
అజ్ఞాతవాసి సినిమాలో ఆది పినిశెట్టిని స్టైలిష్ విలన్ గా ప్రజెంట్ చేసారు త్రివిక్రమ్. 'అరవింద సమేత' సినిమా కోసం సీమ విలన్ గా నవీన్ చంద్రతో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయించారు. ఇక 'అలా వైకుంఠపురంలో' సినిమాలో కుర్ర హీరో సుశాంత్ ని నటింపజేసారు.
తాజాగా మరో కుర్ర హీరోని ఎన్టీఆర్ తో తను చేయబోతున్న #NTR30 కోసం రంగంలోకి దింపబోతున్నారని సమాచారమ్. ఆ కుర్ర హీరో ఎవరనే విషయం బయటికి రాలేదుకానీ... ఓ చక్కటి పాత్రను త్రివిక్రమ్ క్రియేట్ చేసారని తెలుస్తోంది. మరి ఆ పాత్ర చేసే అవకాశం ఏ కుర్ర హీరోకి దక్కనుందో... ఎన్టీఆర్ తో స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్న ఆ హీరో ఎవరో వేచిచూద్దాం.