View

Aaha Kalyanam Review

Friday,February21st,2014, 09:59 AM

చిత్రం  - ఆహా కళ్యాణం
బ్యానర్ - యశ్ రాజ్ ఫిలింస్
నటీనటులుః నాని, వాణీకపూర్, సిమ్రాన్ తదితరులు
సంగీతం: ధరన్ కుమార్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
కెమెరా: లోకనాథన్ శ్రీనివాసన్
ఎడిటింగ్: బవన్ శ్రీకుమార్
దర్శకత్వం: ఎ. గోకుల్ కృష్ణ
నిర్మాత: ఆదిత్య చోప్రా

రణవీర్ సింగ్, అనుష్కశర్మ జంటగా రూపొందిన 'బ్యాండ్ బాజా బరాత్' ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇదే చిత్రాన్ని నాని, వాణీ కపూర్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ నిర్మించింది. దక్షిణాదిన ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం కావడం, ఓ సూపర్ హిట్ కి రీమేక్ కావడంతో 'అహా కళ్యాణం'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి.. 'బ్యాండ్ బాజా...'లా 'అహా కళ్యాణం...' బాక్సాఫీస్ దగ్గర మేజిక్ చేసే విధంగా ఉందో లేదో తెలుసుకుందాం.

à°•à°¥
శక్తి (నాని) సరదా కుర్రాడు. హాస్టల్ భోజనం ఇష్టపడని శక్తి స్నేహితులతో కలిసి ఓ పెద్దింటి పెళ్లిలో విందు భోజనం చేయడానికి వెళతాడు. అదే పెళ్లికి వెడ్డింగ్ కో-ఆర్డినేటర్ అసిస్టెంట్ గా చేస్తున్న శృతి (వాణీకపూర్) పెళ్లి పనులు చూసుకోవడానికి వెళుతుంది. శక్తి ఇటు పెళ్లికూతురు అటు పెళ్లి కొడుకు కుటుంబానికి సంబంధించినవాడు కాదని, బయటివాడని అనుమానిస్తుంది. ఆ అనుమానాన్ని పసిగట్టిన శక్తి పెళ్లింటి వాళ్లతో ఎలాగోలా మాటలు కలిపేసి, తను బయటివాడు కాదని శృతిని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆ పెళ్లిలో శృతి చేసిన డాన్స్ కి ఇంప్రెస్ అవుతాడు శక్తి. తన డాన్స్ ని వీడియోగా తీస్తాడు. ఆ డీవీడీతో శృతిని ఇంప్రెస్ చేయాలన్నది అతని ఆలోచన. కానీ, శృతి అతణ్ణి పట్టించుకోదు. ఈ లోపు శక్తి తండ్రి అతన్ని తమ గ్రామానికి వచ్చి పొలం పనులు చూసుకోమంటాడు. అందుకు ససేమిరా అంటాడు. శృతి మనసుని గెలవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. 'వెడ్డింగ్ ప్లానర్' బిజినెస్ మొదలుపెట్టాలనుకుంటుంది శృతి. అనుభవం కోసం ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ చంద్రలేఖ (సిమ్రాన్) దగ్గర చేరాలనుకుంటుంది. కానీ, శృతిని చేర్చుకోవడానికి ఇష్టపడదు చంద్ర. సరిగ్గా ఇదే సమయంలో అక్కడున్న ఓ ఉద్యోగి మానేయడంతో శక్తిని చేర్చుకోవాలనుకుంటుంది చంద్రలేఖ. శృతిని కూడా చేర్చుకోవాలని కండిషన్ పెడతాడు శక్తి. తీరా చేరిన తర్వాత చంద్రలేఖ కస్టమర్స్ కి న్యాయం చేయడంలేదని గ్రహించి బయటికొచ్చి, ఇద్దరూ ఓ వెడ్డింగ్ ప్లానర్ కంపెనీ పెట్టాలనుకుంటారు. 'గట్టి మేళం' అనే పేరుని నిర్ణయిస్తారు. వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుంది. ఒకానొక బలహీన క్షణంలో శక్తి, శృతి శారీరకంగా ఒకటవుతారు. కానీ, ఇగో వల్ల విడిపోతారు. శక్తి 'హ్యాపీ వెడ్డింగ్' పేరుతో వేరే కంపెనీ పెడతాడు. వ్యాపార పరంగా ఇద్దరూ పోటీపడతారు. ఇలాంటి సమయంలో వేరే కుర్రాడితో శృతి పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లి జరుగుతుందా? శక్తి, శృతి ఇగోని పక్కనపెట్టి పెళ్లి చేసుకుంటారా? అనేది మిగతా కథ.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇది పండగలాంటి సినిమా. సినిమా మొత్తం పెళ్లిళ్ల సందడితో కలర్ ఫుల్ గా సాగుతుంది. శక్తి పాత్రలో నాని ఒదిగిపోయాడు. శృతి పాత్ర చేసిన వాణీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ప్రతి హావభావాన్ని తను పలికించిన తీరు సుపర్బ్. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న వాణీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. ఈ సినిమాకి తనే హైలైట్. అతిథి పాత్రలో సిమ్రాన్ ఓకే అనిపించుకుంది. మిగతా పాత్రలు చేసినవాళ్లు ఎవరో మన తెలుగువారికి తెలియదు. తమిళ నటీనటులే చేశారు. మన తెలుగు మొహాలు కనపడలేదనే కొరత ప్రేక్షకులకు కలగక మానదు. ఇది రీమేక్ సినిమా కాబట్టి, అల్రెడీ ఓ ఫార్మట్ ఉంటుంది. ఆ ఫార్మట్ ని దర్శకుడు యథాతథంగా తెరకెక్కించాడు. డైరెక్టర్ తన క్రియేటివిటీని ఎక్కడా బయటపెట్టలేదు. ఈ సినిమాని తమిళంలో తీసి, తెలుగులోకి అనువదించారు. అందుకని డైలాగ్స్ పరంగా అక్కడక్కడా లిప్ సింక్ కాని విషయం స్పష్టంగా తెలుస్తుంది. డైలాగ్స్ కూడా తమిళ డైలాగులను యథాతథంగా అనువదించినట్లుగా ఉన్నాయి. ఉదా.. 'వాడేం చేస్తున్నాడో చూడు..' అనేది మన రెగ్యుల్యర్ భాష. వాడుక భాషలా సులువుగా ఉంటుంది. కానీ, అనువాదంలో 'చూడు వాడేం చేస్తున్నాడో' అని ఉంటుంది. దాంతో తమిళ వాసన కనిపిస్తుంది. దాని గురించి పెద్దగా పట్టించుకోకపోతే మాత్రం లెంగ్త్ చాలా తక్కువగా ఉండి డైలాగులు బాగున్నాయి. అక్కడక్కడా ఎంజాయిబుల్ గా కూడా ఉన్నాయి. పాటలు, కెమెరా పనితనం తదితర అంశాలన్నీ బాగున్నాయి. యశ్ రాజ్ సంస్థ స్థాయికి తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా చూస్తే సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే, రక్తపాతాలు, మర్డర్ ప్లానులు లాంటివేవీ ఉండవు. హాయిగా సాగిపోతుంది. ఈ సినిమాకి బుర్ర పెట్టి, ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థం కాకుండా జుత్తు పీక్కోవాల్సిన పని లేదు. హాయిగా ఆస్వాదించేయొచ్చు. మనసుని తేలికపరిచే సినిమా.

ఫైనల్ గా చెప్పాలంటే... కుటుంబమంతా ఓసారి ఈ పెళ్లివిందును రుచి చూడొచ్చు.

 

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !