View

Preminchali review

Thursday,February27th,2014, 04:26 PM

చిత్రం - ప్రేమించాలి
బ్యానర్ - యస్.కె.పిక్చర్స్
నటీనటులు - సంతోష్, మనీషా యాదవ్, తులసి, పూర్ణిమా జయరామ్, జయప్రకాశ్, రామనాథ్ షెట్టీ తదితరులు
సంగీతం - యువన్ శంకర్ రాజా
కెమెరా - సూర్య ఎ.ఆర్
ఎడిటింగ్ - ఆంటోని
నిర్మాత - సురేష్ కొండేటి
దర్శకత్వం - సుశీంద్రన్.
'ప్రేమిస్తే'లాంటి విజయవంతమైన చిత్రం ద్వారా నిర్మాతగా మారి, ఇప్పటివరకు తొమ్మిది చిత్రాలను అందించారు సురేష్ కొండేటి. ఎస్.కె. పిక్చర్స్ ద్వారా ఆయన విడుదల చేసేవన్నీ ఉత్తమాభిరుచి గలవే. ఆ విధంగా ఆ బేనర్ కి ఓ మంచి ఇమేజ్ ఏర్పడింది. పదో చిత్రం 'ప్రేమించాలి' ఆ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటుందని సురేష్ చెబుతూ వచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను గెల్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయి? 'ప్రేమించాలి' అందరి ప్రేమను పొందే విధంగా ఉందా? అనే విషయం తెలుసుకుందాం.


à°•à°¥
కార్తీక్ (సంతోష్), శ్వేత (మనీషా యాదవ్) ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటారు. ప్రేమ మత్తులో మునిగి తేలుతున్న సమయంలో ఈ ఇద్దరూ శారీరకంగా ఒకటవుతారు. దాంతో శ్వేత గర్భవతి అవుతుంది. పెళ్లి అవ్వకుండానే కూతురు గర్భవతి అయ్యిందనే విషయం తెలుసుకుని శ్వేత తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతారు. కూతురు భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. కార్తీక్ తల్లిదండ్రులు సైతం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. కార్తీక్, శ్వేత పెళ్లి చేసుకున్నారా? గర్భం దాల్చిన శ్వేత పరిస్థితి ఏంటీ? ఈ ఇద్దరి తప్పిదం, మెచ్యుర్టీ లేని కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే ఈ చిత్ర కథాంశం.


ఫిల్మీబజ్ విశ్లేషణ
కార్తీక్ గా సంతోష్, శ్వేతగా మనీషా తమ పాత్రల్లో పూర్తిగా లీనమై నటించారు. మనీషా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. కార్తీక్, మనీషా తల్లిదండ్రులుగా జయప్రకాశ్, తులసి, రామనాథ్ షెట్టీ, పూర్ణిమ జయరామ్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కార్తీక్ స్నేహితుడిగా జై నటించాడు.
డైరెక్టర్ సుశీంద్రన్ ఫస్టాఫ్ లో సంతోష్, శ్వేత మధ్య మంచి ప్రేమ సన్నివేశాలు వర్కవుట్ చేసారు. ఈ సన్నివేశాలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. తమను ఐడెంటిఫై చేసుకునే విధంగా ఉంటాయి. ఇక సెకండాఫ్ లో డైరెక్టర్ విజృంభించేసాడు. గర్భవతి అయిన తర్వాత శ్వేత మనస్థితిని, ఆమె పడిన మానసిక క్షోభను అద్భుతంగా చిత్రీకరించాడు. ఇక తల్లిదండ్రులు తమకు తెలీకుండా తమ పిల్లలు సాగించిన ప్రేమాయణం, వారు చేసిన తప్పులు తెలుసుకున్నప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు. శ్వేత ఓ బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఆ బాబును అనాధాశ్రమానికి అప్పజెప్పడం, ఆ తర్వాత ఆ బాబు ఎదుర్కొన్న కష్టాలు ప్రేక్షకుల గుండెను పిండేసే విధంగా ఉన్నాయి. ప్రతి ఎమోషన్ ని చాలా బాగా తెరకెక్కించడంలో పూర్తిగా సఫలమయ్యాడు డైరెక్టర్. ప్రేమించుకోవడంలో తప్పేమీ లేదుగానీ, మెచ్యుర్టీ లేకుండా ప్రేమించుకుని తప్పు చేస్తే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయని చెప్పడంలో డైరెక్టర్ పూర్తిగా సఫలీకృతులయ్యారు. చివరిలో ఈ మెసేజ్ కు నిర్మాత సురేష్ కొండేటి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా బాగుంది. ఇక ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ లో యువన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు ఆ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. క్లయిమాక్స్ లో యస్.పి.బాలసుబ్రమణ్యం పాడిన పాట ఈ  చిత్రానికి అదనపు ఆకర్షణ. డబ్బింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. డైలాగులు నాన్ సింక్ అవ్వడంలాంటివి ఎక్కడా కనిపించలేదు. తెలుగు డైలాగులను కూడా బాగా రాసారు. యస్.కె.బ్యానర్ విలువను పెంచే విధంగానే ఈ సినిమా ఉంది.


ఫైనల్ గా చెప్పాలంటే... యువతకు ఓ కనువిప్పులాంటి సినిమా. తల్లిదండ్రులు, పిల్లలు తప్పక చూడాల్సిన అర్థవంతమైన చిత్రం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !