View

Rowdy Review

Friday,April04th,2014, 08:30 AM

చిత్రం - రౌడీ
నటీనటులు - డా. మోహన్ బాబు, విష్ణు, జయసుధ, శాన్వీ, తనికెళ్ల భరణి, జీవా తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
మాటలు: గంగోత్రి విశ్వనాథ్
కెమెరా: సతీష్ ముత్యాల
సమర్పణ: యం. మోహన్ బాబు
నిర్మాతలు: ఆర్ విజయ్ కుమార్, పి. గజేంద్ర నాయుడు, ఎం. పార్థసారధి నాయుడు,
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: రాంగోపాల్ వర్మ.

ఎలాంటి కాంబినేషన్ లో సినిమా వస్తే అంచనాలు భారీ స్థాయిలో నెలకొంటాయో మోహన్ బాబు, రాంగోపాల్ వర్మలది అలాంటి కాంబినేషన్. పైగా ఈ కాంబినేషన్ లో విష్ణు కూడా ఉండటం మరింత హైప్ ని క్రియేట్ చేసింది. 'రౌడీ' అని టైటిల్ పెట్టడం మరో ఆకర్షణ. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసినప్పుడు ఇక అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు, విష్ణు లుక్స్ ఆకట్టుకున్నాయి. మరి.. ఈ 'రౌడీ' ఎలా ఉన్నాడో చూద్దాం.

à°•à°¥
రాయలసీమకు చెందిన అన్న (మోహన్ బాబు) ప్రజల మనిషి. అన్యాయం చేసే వారిపై రౌడీయిజం ప్రదర్శిస్తాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మంచి రౌడీ. ప్రజల పాలిట దేవుడు. అన్న భార్య లక్ష్మీ(జయసుధ) ఓ మంచి ఇల్లాలు. ఈ భార్యాభర్తలకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు భూషణ్ (కిశోర్) తన తండ్రి శత్రువులతో చేతులు కలుపుతాడు. చిన్న కొడుకు కృష్ణ (విష్ణు) స్టూడెంట్. తమ ఊరిలో 'నందవరం ప్రాజెక్ట్' వస్తే చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బందుల్లో పడతాయి. అందుకని ఆ ప్రాజెక్ట్ రాకుండా అన్న అడ్డుకుంటాడు. కానీ, ఆ ప్రాజెక్ట్ వస్తే కోట్లు కూడగట్టుకోవచ్చని ఓ ముఠా ప్లాన్ చేస్తుంది. అన్నను అడ్డు తప్పిస్తే తాము అనుకున్నది సాధించొచ్చని అతని మీద హత్యాయత్నం చేస్తుంది ఆ ముఠా. మరి.. అన్న హత్యకు గురవుతాడా? లేక తండ్రిపై పంచ ప్రాణాలు పెట్టుకున్న కష్ణ కాపాడతాడా? పెద్ద కొడుకు చివరి వరకూ శత్రువులతోనే ఉంటాడా? తండ్రికి అండగా నిలబడతాడా? తదితర అంశాలతో ఈ 'రౌడీ' సాగుతుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా గురించి ముందుగా ఏదైనా చెప్పాలంటే అది మోహన్ బాబు నటన గురించే చెప్పాలి. అన్న పాత్రను తనదైన శైలిలో అద్భుతంగా చేశారు. తన శారీరక భాషను మార్చుకుని ఆయన ఒదిగిపోయిన వైనం సుపర్బ్. విగ్ లేకుండా నాచురల్ గా కనిపించారాయన.లెంగ్తీ డైలాగులు కాకుండా చిన్న చిన్న డైలాగులను బ్రహ్మాండంగా చెప్పారు. 'ఓ బుల్లెమ్మో...' పాటకు మోహన్ బాబు, జయసుధ చేసిన డాన్స్ చాలా క్యూట్ గా ఉంది. ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ మోహన్ బాబు. ఇక, విష్ణు పర్ఫార్మెన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. యాక్షన్ సన్నివేశాల్లో తన కళ్లల్లో మంచి ఫైర్ కనబర్చాడు. గత సినిమాలకన్నా విష్ణు ఇందులో ఇంకా బాగున్నాడు. కొంచెం బాడీ బిల్డ్ చేయడంవల్ల యాక్షన్ సన్నివేశాల్లో పవర్ ఫుల్గా కనిపించాడు. నటన పరంగా కూడా మంచి మార్కులు స్కోర్ చేశాడు విష్ణు. సహజనటి అని మరోసారి నిరూపించుకుంది జయసుధ, శాన్వీ, తనికెళ్ల, పరుచూరి గోపాలకష్ణ, రవిబాబు తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
ఇక.. చెప్పాల్సింది టేకింగ్ గురించి. నో డౌట్.. రాంగోపాల్ వర్మ మంచి ఫిలిం మేకర్. మన తెలుగు సినిమా చూసిన ఫీల్ కలిగేలా, లొకేషన్స్ ని ఎంచుకున్నాడు. అలాగే కేరక్టరైజేషన్స్ ని అద్భుతంగా మలిచాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్బ్. 11 నిమిషాల పాటు సాగే ఆ ఎపిసోడ్ ని ప్రేక్షకుడు కన్నార్పకుండా చూస్తాడు. ఫస్టాఫ్ ఎప్పుడు ముగిసిందో తెలియనంత వేగంగా ముగుస్తుంది. సెకండాఫ్ ని కూడా ఓ అంచనాతో చూస్తాడు ప్రేక్షకుడు. సెకండాఫ్ కూడా బాగుంది. కాకపోతే, ఫస్టాఫ్ కన్నా కాదు. 'సర్కార్' చూసినవారికి ఆ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాతో పోల్చుకుంటారు. కానీ, మన తెలుగు నేటివిటీని చక్కగా ఆవిష్కరించడంతో 'అచ్చ తెలుగు' సినిమా అనే భావన కలగజేస్తుంది. పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.

ఫైనల్ గా చెప్పాలంటే.. మోహన్ బాబు, విష్ణుల నటన, రాంగోపాల్ వర్మ టేకింగ్ కోసం ఈ సినిమాని చూడొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !