View

లడ్డు బాబు రివ్వ్యూ

Friday,April18th,2014, 11:24 AM

చిత్రం - లడ్డు బాబు
బ్యానర్ - మహారథి ఫిలింస్
నటీనటులు: 'అల్లరి' నరేష్, భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు తదితరులు
మాటలు - నివాస్
సంగీతం: చ్రకి
కెమెరా: బి. వాసు
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాత: రాజేంద్ర త్రిపురనేని
రచన, దర్శకత్వం: రవిబాబు
విడుదల తేదీ - ఏప్రిల్ 18, 2014

విభిన్న తరహా చిత్రాల దర్శకుడిగా రవిబాబుకి పేరుంది. మంచి కామెడీ హీరోగా 'అల్లరి' నరేష్ అందరికీ దగ్గరయ్యాడు. నరేష్ ని 'అల్లరి' ద్వారా హీరోని చేసింది రవిబాబే. à°† చిత్ర విజయంతో à°ˆ ఇద్దరిదీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయ్యింది. చాలా విరామం తర్వాత 'లడ్డూబాబు'తో à°ˆ కాంబినేషన్ రిపీట్ అయ్యింది. పైగా బక్కగా ఉండే నరేష్ తో 200 కేజీల బరువున్న భారీకాయుడి పాత్రను  చేయించడంతో à°ˆ  చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. మరి.. à°ˆ లడ్డూబాబు అందర్నీ ఆకట్టుకుంటాడా? తన సైజుకి తగ్గట్టే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడా..? à°“ లుక్కేద్దాం.

à°•à°¥
ఆఫ్రికాకి చెందిన దోమ కాటు వల్ల సన్నగా ఉండే లడ్డు బాబు (అల్లరి నరేష్) ఒక్కసారిగా 280కేజీల బరువు పెరిగిపోయి భారీ ఊబకాయుడు అవుతాడు. అతనిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి, అతని పేరు మీదున్న ఆస్తిని తన సొంతం చేసుకోవాలని లడ్డు బాబు తండ్రి ముష్టి కిష్టయ్య(కోట శ్రీనివాసరావు) ప్లాన్ చేస్తుంటాడు. కానీ ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది లడ్డు బాబు కల. కొడుకుకి పెళ్లి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన కిష్టయ్య, ఆ ప్రయత్నాలు విఫలమవ్వడంతో లడ్డు బాబుని ఇంటి నుంచి తరిమేస్తాడు.
ఇంటి నుంచి బయటికి వచ్చిన లడ్డు బాబుకి మూర్తి (అతుల్) అనే కుర్రాడు పరిచయం అవుతాడు. తన అమ్మ మాధురి (భూమిక)ని ఒప్పించి లడ్డు బాబును తన ఇంట్లోనే ఉండేలా చేస్తాడు మూర్తి. à°“ సందర్భంలో తన తల్లిని పెళ్లి చేసుకోవాల్సిందిగా లడ్డు బాబును కోరతాడు మూర్తి. కానీ మాయ (పూర్ణ)ను  ప్రేమిస్తాడు లడ్డు బాబు . మరి తను ప్రేమించిన మాయను లడ్డు బాబు పెళ్లి చేసుకుంటాడా? మూర్తి తల్లి మాధురిని పెళ్లి చేసుకుంటాడా? లడ్డు బాబును పెళ్లి చేసుకోవడానికి మాధురి అంగీకరిస్తుందా? మూర్తి ఎందుకు లడ్డుబాబును తన తల్లికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఫిల్మీబజ్ విశ్లేషణ

నటీనటుల పెర్ ఫామెన్స్
అల్లరి నరేష్ నటన పరంగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. తన తొలి సినిమా నుంచే నరేష్ తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా మంచి కామెడీ ఎంటర్ టైనర్స్ చేస్తున్నాడు. కానీ ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో నటన పరంగా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఓ మంచి నటుడు నటన పరంగా ఫెయిల్ అయ్యాడంటే దానికి ఏదో పెద్ద కారణమే ఉండాలి. ఈ సినిమాలో ఆ కారణం మేకప్. డైరెక్టర్. భారీకాయుడి గెటప్ కోసం అల్లరి నరేష్ మేకప్ కే రెండు గంటలు సమయం పట్టేది. ఆ మేకప్ వేసుకున్న తర్వాత అల్లరి నరేష్ ఏం చేయాలన్నా కష్టమే. మేకప్ మీద కాన్ సెన్ ట్రేట్ చేయాల్సి రావడంతో అల్లరి నరేష్ నటన మీద దృష్టి పెట్టలేకపోయిన విధం స్ఫష్టంగా అర్ధమవుతోంది. ఒకవేళ నరేష్ నటించినా, మేకప్ మాటున దాగిపోయిందే తప్ప... ఎక్స్ ప్రెషన్స్ బయటికి రాలేదు. ఇది దర్శకుడి ఫెయిల్యూర్ అనే చెప్పాలి. నరేష్ భారీకాయుడిగా కనిపించడానికి పడిన కష్టాన్ని మెచ్చుకోవాల్సిందే తప్ప... అతని కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం దక్కే అవకాశం లేదు. కోట శ్రీనివాసరావు చేసిన ముష్టి కిష్టయ్య పాత్ర అహ నా పెళ్లంట చిత్రంలోని పిసినారిగా కోట శ్రీనివాసరావు చేసిన పాత్రను గుర్తుకు తెస్తుంది. భూమిక తన వయసుకు తగ్గ పాత్ర చేసింది. మాధురి పాత్రలో ఒదిగిపోయింది. మాయ పాత్రలో పూర్ణ అందంగా ఉంది. కానీ నటించడానికి ఆమె పాత్రకు స్కోప్ లేదు. ఈ పాత్రలు తప్ప.. ఈ సినిమాలోని మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

టెక్నికల్ డిపార్ట్ మెంట్
రవిబాబు à°•à°¥ ఎన్నుకోవడంలోనే ఫెయిల్ అయ్యాడు. à°•à°¥ పెద్ద ఇంట్రస్టింగ్ à°—à°¾ లేకపోయినా, ఆసక్తికరమైన  స్క్రీన్ ప్లే అయితే à°•à°¥ గురించి మర్చిపోయి సినిమాని చూస్తారు ప్రేక్షకులు. à°ˆ సినిమా విషయంలో à°•à°¥, స్క్రీన్ ప్లే రెండూ మైనస్సే. అల్లరి నరేష్ లాంటి మంచి కామెడీ హీరోతో సింఫుల్ లైన్ తో సినిమా చేసినా, ప్రేక్షకులను నవ్వించగల సత్తా సీన్స్ à°•à°¿ ఉంటే ఖచ్చితంగా గ్యారంటీ హిట్ సినిమా అవుతుంది. అలాంటిది బక్కగా ఉండే అల్లరి నరేష్ ని భారీకాయుడిగా చూపిస్తున్నాడంటే ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉంటాయి. à°ˆ అంచనాలను చేరుకోలేకపోయాడు రవిబాబు. పైగా లడ్డుబాబును చీటిమాటికి కొట్టించడం విసుగు తెప్పించింది. à°Žà°‚à°¤ భారీకాయుడు అయితే మాత్రం అందరూ అంతలా కొడతారా అనిపించింది. ఇక పూర్ణ లవ్ ట్రాక్ అసందర్భంగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్ ని ఏడిపించడం కోసం లడ్డుబాబును సెలక్ట్ చేసుకుని అతనికి ముద్దులు పెట్టడం వింతగా ఉంటుంది. ఎందుకంటే ఒకరు చూసి అసూయపడేంత అందగాడు కాదు లడ్డుబాబు. ఇక చక్రి ఇచ్చిన పాటల్లో ఒక్క పాట మినహా మిగతా పాటలు ఆకట్టుకునే విధంగా లేవు. చక్రి పాడిన పాట ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. 'సిరిమల్లె....' పాట పిక్చరైజేషన్ బాగుంది. కెమెరా వర్క్ ఫర్వాలేదు. ఎడిటింగ్ విషయాని కొస్తే, చాలా వేస్ట్ సీన్స్ ని ఎడిట్ చేసి ఉంటే, ప్రేక్షకులను కాపాడిన వారయ్యే వారు. మొహమాటం లేకుండా సినిమాని ఎడిట్ చేసి ఉంటే ఎన్ని వేస్ట్ సీన్లు ఉన్నాయో డైరెక్టర్ à°•à°¿ అర్ధమయ్యుండేది. అల్లరి నరేష్‌ మేకప్‌à°•à°¿ కష్టపడ్డ మేకప్ నిపుణులను మెచ్చుకోవాలి. నరేష్‌లాంటి స్లిమ్‌ హీరోని నమ్మశక్యం కానంత లావుగా తీర్చిదిద్దారు.

ఫైనల్ గా చెప్పాలంటే... ఇప్పటివరకూ ఏ పాత్రకు పడనంత కష్టం లడ్డు బాబుకు పడ్డాడు నరేష్. ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఈ లడ్డు ని అస్వాదించి తినలేము. టేస్ట్ కుదరలేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !