View

1997 తెలుగు మూవీ రివ్యూ

Friday,November26th,2021, 09:30 AM

చిత్రం : 1997బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్
నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : కోటి
కెమెరా : చిట్టి బాబు
నటీనటులు : డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…
జానర్ : క్రైం థ్రిల్లర్
విడుదల : 26-11-2021


డా. మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘1997’. నవీన్‌చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కోటి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజు (26.11.2021) థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.

కథ :
సమాజంలో ఉన్న కులమతాల అసమానతల నేపథ్యంలో తక్కువ కులాలపై, ఆ కులాలలో ఉండే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. నిజాం పేట గ్రామంలో ఓ దొర పైగా ఎమ్మెల్యే చెలాయించే పెత్తనం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతనికి పోలీసుల సపోర్ట్ ఉంటుంది. ఆ గ్రామంలో గంగ అనే అమ్మాయి ఘోరంగా అత్యాచారానికి గురవ్వడంతో పాటు మరణిస్తుంది. ఆమె మరణాన్ని ఈత రాక నీళ్లలో మునిగి చనిపోయిందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అయితే అదే గ్రామానికి ఏ ఎస్ ఐ గా వచ్చిన విక్రమ్ రాధోడ్ ( డా. మోహన్ ) నిజ నిజాలు తెలుసుకుని అసలైన దోషులను శిక్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలో దొర ( రామరాజు ) కు సపోర్ట్ చేస్తూ అయన అన్యాయాలను కప్పిపుచ్చే సి ఐ చారి ( శ్రీకాంత్ అయ్యంగార్ ) కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. అయితే న్యాయం అన్నది తక్కువ కులం , ఎక్కువ కులం అని కాకుండా అందరికి సమానంగా ఉండాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగి గంగ ను మానభంగం చేసి చంపిన దోషులను టార్గెట్ చేస్తాడు విక్రమ్ రాధోడ్. మరి ఈ పరిస్థితుల్లో విక్రమ్ రాథోడ్ కు ఎదురైనా అడ్డంకులు ఏమిటి ? దొర అహంకారానికి, కామానికి బలైన గంగ కు న్యాయం జరిగిందా లేదా అన్నదే  ఈ సినిమా కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
హీరో విక్రమ్ రాధోడ్ పాత్రలో డా. మోహన్ చాలా బాగా పెర్ ఫామ్ చేసాడు. ఏ ఎస్ ఐ గా ఆయన పరిధిలో చాలా చక్కగా నటించాడు. ముఖ్యంగా పోలీస్ అధికారిగా భిన్నమైన షేడ్ లో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్ర శ్రీకాంత్ అయ్యంగార్ ది. నెగిటివ్ షేడ్ ఉన్న సి ఐ చారి పాత్రలో చాలా బాగా నటించాడు శ్రీకాంత్ అయ్యంగార్. ఇక ఎంక్వయిరీ అధికారిగా హీరో నవీన్ చంద్ర పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారిగా న్యాయం పక్కన నిలబడాలని చేసే ప్రయత్నం బాగుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కోటి డి జి పి గా బాగా చేసాడు. అలాగే దొర పాత్రలో రామరాజు నటన హైలెట్. అలాగే దొర కొడుకు రాంబాబు పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి.  మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
ఈ సినిమా విషయంలో టెక్నీకల్ అంశాల్లో ముందుగా చెప్పుకోవలసింది మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి. ఈ సినిమాకు కోటి ఇచ్చిన ఆర్ ఆర్ ప్రధాన ఆకర్షణ. కథను డ్రైవ్ చేయడంలో కోటి ఆర్ ఆర్ సూపర్. అలాగే ఈ సినిమాకు మరో హైలెట్ ఫోటోగ్రఫి. చిట్టిబాబు అందించిన ఫోటోగ్రఫి బాగుంది. ఇక ఈ సినిమా విషయంలో మరో ముఖ్యమైన అంశం ఎడిటింగ్. సీనియర్ ఎడిటర్ నందమూరి హరి ఎడిటింగ్ బాగుంది. చాలా సీన్స్ అలా అలా పాస్ అయిపోతూ ఉంటాయి. ఇక దర్శకుడు , హీరో మోహన్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూని తీసుకుని దర్శకుడు మోహన్ చక్కటి ప్రయత్నం చేసాడు. నేటి సమాజంలో ఉన్న కులమతాల అసమానతలు , మహిళలపై జరుగుతున్నా దారుణాల నేపథ్యంలో ఈ కథను ఎంచుకున్నాడు దర్శకుడు. ఆలోచింప చేసే కథ, కథనంతో చక్కటి ప్రయత్నం చేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెకర్కించారు.


విశ్లేషణ :
చిన్నప్పుడు నేను విన్న ఓ సంఘటన నా మనసులో అలాగే ఉండిపోయింది. అది మాములు సంఘటన కాదు. నేటికీ మన సమాజంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఆ సంఘటన తెరపై చూపించాలనే తాపత్రయంతో చేసిన సినిమా '1997' అని డైరెక్టర్ ఓ సందర్భంలో చెప్పారు. నిజంగా ఇలాంటి సంఘటనలను తెరపై చూపించాల్సిందే. ఓ దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథ ఇది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్ లో తెరకెక్కిన కథ ఇది. సమాజంలో అసమానతలకి అద్దం పట్టేలా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు డైరెక్టర్.  నేటి సమాజంలో జరుగుతున్న సమస్యల నేపథ్యంలో ఎన్ని చిత్రాలు వచ్చినా కూడా ప్రజలు మారతారని చేసే ప్రయత్నాలే. నిజంగా అలాంటి సినిమాలు చూసి జనాలు మారతారా ? అన్నది ఇప్పటికి ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది. మొత్తానికి డా. మోహన్ ఓ సమస్యను అందరికి తెలియచెప్పే గొప్ప ప్రయత్నం చేసాడు. ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన బాధ్యత ఆడియన్స్ పై ఉంది. అప్పుడే ఇలాంటి సినిమాలను తెరకెక్కించడానికి మరింత మంది ముందుకు వస్తారు. 


ఫైనల్ గా చెప్పాలంటే... సినిమా అంటే వినోదం. నో డౌట్. వినోదంతో పాటు సొసైటీకి ఉపయోగపడే అంశంతో తెరకెక్కిన సినిమా అయితే అసలు మిస్ కాకూడదు. సో... డోంట్ మిస్ '1997'. 


ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !