View

'ప్రతినిధి' రివ్వ్యూ

Friday,April25th,2014, 12:42 PM

బ్యానర్ - సుధా సినిమాస్
చిత్రం - ప్రతినిధి
నటీనటులు - నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, పోసాని కృష్ణమురళీ, శ్రీ విష్ణు, కోటా శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి తదితరులు
కెమెరా - చిట్టిబాబు
కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ - ఆనంద్ రవి
సంగీతం - సాయి కార్తీక్
దర్శకత్వం - ప్రశాంత్ మండవ
నిర్మాత - జె.సాంబశివరావు

నారా రోహిత్ 'బాణం' లాంటి హిట్ చిత్రంతో కెరియర్ ఆరంభించి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. పొలిటికల్  బ్యాక్ డ్రాప్ లో నారా రోహిత్ నటించిన 'ప్రతినిధి' చిత్రం à°ˆ రోజు (25.4.2014) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. à°ˆ సినిమా టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రస్తుతం అందరూ ఎలక్షన్స్ మూడ్ లో ఉన్నారు. ఎన్నో పార్టీలు... ఎంతోమంది నాయకులు.... ఎవరని ఎన్నుకుంటే మన భవిష్యత్తుకు మంచిదా అనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓటరు ఓటేసి సరైన ప్రజానాయకుడిని ఎన్నుకోవాలనే కాన్సెఫ్ట్ తో రూపొందిన à°ˆ సినిమా ప్రజల ముందుకు వచ్చింది. మరి à°ˆ సినిమా ద్వారా డైరెక్టర్ నిజంగానే ప్రజలను ఎడ్యుకేట్ చేయగలిగాడా, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు à°ˆ చిత్రం ఉందా అనే విషయాలను తెలుసుకుందాం.

à°•à°¥
మంచోడు శ్రీను (నారా రోహిత్) సి.యం (కోటా శ్రీనివాసరావు)ను కిడ్నాప్ చేస్తాడు. తను ఎటియం నుంచి తీసుకున్న వెయ్యి రూపాయల నోటు దొంగనోటు అని చెప్పి బ్యాంకు వాళ్లు చించేసారని, నాకు కొత్త నోటు కావాలని సి.యం దగ్గర డిమాండ్ చేస్తాడు శ్రీను. ఇక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుంటే తనకు ఇవ్వాల్సిన 84పైసల చిల్లర ఇవ్వలేదని, à°† చిల్లర తనకు కావాలని సి.యం దగ్గర డిమాండ్ చేస్తాడు. కేవలం à°ˆ కారణాలతోనే  సి.యం ని శ్రీను కిడ్నాప్ చేసాడా? లేదా వేరే డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? అసలు అతని గతమేంటీ తదితర అంశాలు తెలుసుకోవాలంటే 'ప్రతినిధి' సినిమా చూడాల్సిందే.

ఫిల్మీబజ్ విశ్లేషణ

నటీనటులు
నారా రోహిత్ సీరియస్ పాత్రలకు చాలా బాగుంటాడు. అతని బాడీ లాంగ్వేజ్ సీరియస్ క్యారెక్టర్స్ కి బాగా సూట్ అవుతుంది. ఆ విషయం 'బాణం' సినిమాతోనే తేలిపోయింది. 'బాణం' సినిమా కథ సామాజిక స్పృహతో కూడుకున్నది. ఆ సినిమా తర్వాత రోహిత్ చేసిన మరో సామాజిక స్పృహ ఉన్న సినిమా ఇది. శ్రీను పాత్రను బాగా చేసాడు. సీరియస్ సన్నివేశాలన్నింటిల్లోనూ నారా రోహిత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాడు. మెయిన్ గా అతని వాయిస్ గురించి చెప్పుకోవాలి. చాలా సన్నివేశాల్లో అతని వాయిస్ కీలక పాత్ర పోషించింది. బేస్ వాయిస్ తో అతను చెప్పిన సీరియస్ డైలాగులు పర్ ఫెక్ట్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా ఉన్నాయి. రోహిత్ ఓ విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలి. సరదాగా సాగే సన్నివేశాల్లో రోహిత్ నటన ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేదు. ఇది అతనికి పెద్ద మైనస్ అవుతుంది. కాబట్టి ఈ విషయంపై అతను శ్రద్ధ పెట్టాల్సిందే. శుభ్ర అయ్యప్ప ఈ సినిమాకి చాలా మైనస్. హీరో ఫ్రెండ్ గా చేసిన శ్రీ విష్ణు తన పాత్రను అద్భుతంగా చెసాడు. కోట శ్రీనివాసరావు ఇలాంటి పాత్రలను చాలానే చేసారు. ఇలాంటి పాత్రలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పోసాని కృష్ణమురళీ నటిస్తున్నాడంటేనే, అతను చేసే పాత్రకు పంచ్ డైలాగులు ఉండాలి. అలాంటిది ఈ సినిమాలో అతని పాత్రకు సరైన పంచ్ డైలాగులు పడలేదు. మిగతా నటీనటులందరూ వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం
డైరెక్టర్ ప్రశాంత్ మండవ మంచి స్టోరీ లైన్ ని ఎన్నుకున్నారు. కానీ à°ˆ లైన్ ని ప్రజెంట్ చేసే విషయంలో అక్కడక్కడా కాస్త తడబాటు కనబడుతుంది. ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసే పాయింట్ చాలా ఇంట్రస్టింగ్ పాయింట్. à°ˆ పాయింట్ ను రెండు à°—à°‚à°Ÿà°² పాటు ఆసక్తికరంగా చెప్పాలంటే బలమైన సన్నివేశాలు ఉండాలి.  ఫస్టాప్ లోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ కానప్పటికీ, ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ కోసం ప్రేక్షకులను కూర్చునేలా చేసింది. ఇక సెకండాఫ్ చాలా గ్రిప్ à°—à°¾ చేసారు దర్శకుడు. సీరియస్ à°—à°¾ సాగే సెకండాఫ్ à°ˆ సినిమాకి చాలా ప్లస్. హీరోకి అన్యాయం జరిగి తిరగబడితే  ప్రేక్షకులు చాలా ఎమోషన్ ఫీలవుతారు. కానీ తన ఫ్రెండ్ కోసం హీరో తిరగబడటం అంటే తొందరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. అయినా సరే సెకండాఫ్ సన్నివేశాల వల్ల ప్రేక్షకులు ఏమోషన్ కు గురవుతారు. చిన్న లోటుపాట్లు ప్రతి సినిమాకి ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఓవరాల్ à°—à°¾ మాత్రం డైరెక్టర్ à°ˆ చిత్రాన్ని బాగా హ్యండిల్ చేసారు. ఆనంద్ రవి డైలాగులు ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. కెమెరా మ్యాన్ చిట్టిబాబు వర్క్ యావరేజ్ à°—à°¾ ఉంది. కీలక సన్నివేశాల్లో వచ్చిన పాటలు బాగున్నాయి. సెకండాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సాయికార్తీక్ à°•à°¿ à°ˆ విషయంలో వంద మార్కులు వెయ్యొచ్చు. సెకంఢాప్ సీన్స్ ని à°°à±€-రికార్డింగ్ ఎలివేట్ చేస్తోంది. సింఫుల్ బడ్జెట్ తో చేసిన సినిమా ఇది. కాబట్టి నిర్మాణపు విలువలు యావరేజ్ à°—à°¾ ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే... కరెక్ట్ టైమ్ లో రిలీజ్ అయిన సినిమా ఇది. ఓటేసి సరైన నాయకుడిని ఎన్నుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపే చిత్రం. మరో 5 రోజుల్లో తెలంగాణాలోనూ, 10రోజుల్లో సీమాంధ్రాలోనూ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సినిమాలు చూడటం వల్ల ఓటు వెయ్యడం ఎంత ముఖ్యం అనే విషయం జనాలకు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిన సినిమా 'ప్రతినిధి'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !