View

'చందమామ కథలు' రివ్వ్యూ

Friday,April25th,2014, 03:55 PM

చిత్రం - చందమామ కథలు

నటీనటులు - నరేష్, ఆమని, లక్ష్మీ మంచు, కిషోర్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజీత్, నాగశౌర్య, వెన్నెల కిషోర్, అమితా రావ్, రిచా పనాయ్, షామిలి అగర్వాల్, కృష్ణేశ్వరరావు, పృధ్వీ, కొండవలస, సురేఖా వాణి తదితరులు

సంగీతం - మిక్కి.జె.మేయర్

సినిమాటోగ్రఫీ - సురేష్ రగుతు

ఎడిటింగ్ - ధర్మేంద్ర కాకరాల

నిర్మాత - చాణుక్య బూనేటి

రచన, దర్శకత్వం - ప్రవీణ్ సత్తారు

విడుదల తేదీ - ఏప్రిల్ 25, 2014

8 కథలతో రూపొందిన చిత్రం 'చందమామ కథలు'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన అతని గత చిత్రాలు 'ఎల్ బి డబ్ల్యూ', 'రొటీన్ లవ్ స్టోరీ'. ఈ రెండు చిత్రాలు అతనికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇక 'చందమామ కథలు' టైటిల్, ఈ సినిమా ట్రైలర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రానికి మంచి పబ్లిసిటీ కూడా ఇచ్చారు. మరి.. 8 కథలతో ప్రవీణ్ సత్తారు చేసిన ఈ ప్రయోగం ఎలా ఉందో తెలుసుకుందాం.

à°•à°¥

డే టుడే లైఫ్ లో తనకు ఎదురుపడే వారి గురించి రైటర్ కిషోర్ à°•à°¥ రాయడం మొదలుపెట్టడంతో సినిమా ఆరంభమవుతుంది. 

తన ఒకానొక కూతురికి లుకేమియా వ్యాధి బయటపడుతుంది. ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. దాంతో తను రాస్తున్న కథను త్వరతగతిన పూర్తి చేసి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంటాడు రైటర్ కిషోర్. 

బిచ్చగాడు (కృష్ణేశ్వరరావు)కు ఓ కల ఉంటుంది. సొంతంగా తన కోసం ఓ ఇల్లు కొనుక్కోవాలనేది అతని కల. ఇందుకోసం తను బిచ్చం ఎత్తుకుని సంపాదించే డబ్బులను దాచుకుంటుంటాడు. 10లక్షలు మొత్తం కూడబెట్టిన తర్వాత అతని కల నేరవేరిందా?

30యేళ్ల క్రితం ప్రేమించుకుని విడిపోయిన లవర్స్ (నరేష్, ఆమని) తిరిగి కలుసుకుంటారు. నరేష్, ఆమని ఇద్దరూ మళ్లీ కలిసి జీవితం కొనసాగించాలనుకుంటారు. దానికి కారణాలేంటి? 

తన షాప్ à°•à°¿ వచ్చే హసీనా (à°°à°¿à°šà°¾ పనాయ్) తో ప్రేమలో పడతాడు అష్రఫ్ (అభిజీత్). హసీనా  à°•à±‚à°¡à°¾ అతన్ని ప్రేమిస్తుంది. కానీ దుబాయ్ నుంచి వచ్చిన సంబంధంపై మొగ్గు చూపుతుంది. à°ˆ తర్వాత ఏం జరిగింది?

ధనవంతురాలైన (షామిలి అగర్వాల్)ని  à°•à°¾à°²à±‡à°œà± కుర్రాడు (చైతన్య కృష్ణ)  à°¡à°¬à±à°¬à± కోసం ట్రాప్ చేస్తాడు. à°ˆ ఇద్దరూ లేచిపోవాలనుకుంటుఆరు. అది నేరవేరుతుందా?

సూపర్ మోడల్ లిసా స్మిత్ (లక్ష్మీప్రసన్న) తగ్గిపోతున్న తన ఇమేజ్ ని తలుచుకుని బాధపడిపోతుంది. అలాంటి సమయంలో ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి?

నాగశౌరి, అమృతరావ్ మధ్య సాగే à°“ లవ్ స్టోరీ, వారి పెళ్లి. ఇద్దరికీ à°“ కూతురు.. తర్వాత వారి  à°œà±€à°µà°¿à°¤à°‚ ఎలాంటి మలుపు తీసుకుంటుంది?

30యేళ్లు దాటక ముందే పెళ్లి చేసుకోవాలని తాపత్రయపడే సాఫ్ట్ వేర్ కుర్రాడు వెంకటేశ్ (కృష్ణుడు) .. తన కోరికను నెరవేర్చుకోగలిగాడా? అతని కథ ఏంటి?

 

à°“ రచయిత. అతను రాసే కథలో పై కథలన్నీ ఉంటాయి. కానీ, à°ˆ రచయతది à°“ à°•à°¥. అనారోగ్యం బారిన పడిన కూతుర్ని కాపాడుకోవడానికి ఐదు లక్షలు కావాలి అతనికి. ఏం చేశాడు? 

నటీనటులు

8కథల్లో నటించిన నటీనటుల్లో ఎక్కువగా ఆకట్టుకునేది బిచ్చగాడుగా నటించిన కృష్ణేశ్వరరావు. అతను నటించినట్లుగా లేదు. జీవించినట్లుగా ఉంటుంది. అతని పాత్ర ప్రేక్షకుల మనసుని తాకుతుంది. మోడల్  à°²à°¿à°¸à°¾ స్మిత్ à°—à°¾ లక్ష్మీప్రసన్న అద్భుతంగా నటించింది. చాలా స్టైలిష్ à°—à°¾ తన పాత్రను చేసింది లక్ష్మీ. కిషోర్ కూడా రైటర్ à°—à°¾, తండ్రిగా తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. ఇక నరేష్, ఆమని 'జంబలకడి పంబ' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న జంట. చాలా యేళ్ల తర్వాత తిరిగి à°ˆ ఇద్దరూ నటించారు. వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకుని, విడిపోయిన  à°ˆ ఇద్దరూ వయసు మీదపడిన తర్వాత కలుసుకుంటారు.  à°‡à°¦à±à°¦à°°à±‚ ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకుని కలిసి జీవించాలనుకుంటారు. à°ˆ పాత్రలకు à°ˆ ఇద్దరూ పర్ ఫెక్ట్ à°—à°¾ సూట్ అయ్యారు. ఇలాంటి పాత్రలు చేయాలంటే అనుభవం ఉన్న ఆర్టిస్ట్ à°² వల్లే అవుతుందని à°ˆ ఇద్దరూ నిరూపించారు. ఇక à°°à°¿à°šà°¾ పనాయ్, షామిలి అగర్వాల్, అభిజీత్, కృష్ణుడు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. à°ˆ సినిమాకి నటీనటులందరూ ప్లస్సే. 

సాంకేతిక వర్గం

మిక్కి అందించిన పాటల్లో టైటిల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  à°ˆ పాట ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. కెమెరామేన్ సురేష్ హైదరాబాద్ ని డిఫరెంట్ లైటింగ్ తో అందంగా చూపించాడు. విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటర్ ధర్మేంద్ర వంద శాతం à°ˆ సినిమాకి న్యాయం చేసాడు. ఫస్టాప్ లో కొన్ని సీన్స్ ని ఎడిట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.  à°°à°šà°¯à°¿à°¤, దర్శకుడు ప్రవీణ్ సత్తారు డిఫరెంట్ à°—à°¾ సినిమా చేయడానికి ప్రయత్నించాడు. చాలా సీన్స్ లో అతని మార్క్ కనిపించింది. అతి సాధారణమైన కథలను తెరపై బాగా ప్రెజెంట్ చేశాడు.

ఫిల్మీబజ్ విశ్లేషణ

తీసుకున్న 8 కథల్లో అంతర్లీనంగా పాత్రలకు సంబంధించి స్ట్రగుల్ ఉన్నప్పటికీ, తెరపై ఆ స్ట్రగుల్ ఇంకా డీప్ గా కనిపించకపోవడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాని లైట్ తీసుకునే అవకాశం ఉంది. ఏడ్చే సీన్లు వస్తే... కళ్లు తుడుచుకోవడం, నవ్వే సీన్లు వస్తే... పగలబడి నవ్వడం, రొమాంటిక్ లవ్ స్లీన్స్ ను ఆస్వాదించి చూడటం, యాక్షన్ సన్నివేశాల్లో మనమే ఫైట్ చేస్తున్నంతగా ఫీలవ్వడం... పక్కా మాస్ బీట్ సాంగ్ వస్తే... చిందేయడం, ఇలా నరనరాల్లో ప్రతి విషయానికి ఎమోషన్ ఫీలయ్యే సంస్కృతి మనది. అది మిస్ అయితే ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవ్వరు. సినిమానే కదా అని హుందాగా కూర్చుని సినిమాని చూసేయడం ఇంకా మన ప్రేక్షకులకు అలవాటు అవ్వలేదు. కాబట్టి చాలా డీసెంట్ గా ఉన్న ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ అవ్వదు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం మెండుగా ఉంది. కమర్షియల్ సినిమాకు దూరంగా ఉన్న ఈ సినిమా కాసుల వర్షం అయితే కురిపించడం కష్టం. మంచి ప్రయత్నం చేసినందుకు దర్శకుడికి అభినందనలు మాత్రం మిగులుతాయి.

ఫైనల్ à°—à°¾ చెప్పాలంటే... చందమామ కథలను ఒకసారి చూడొచ్చు. 

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !