View

అమృతంలో చందమామ రివ్వ్యూ

Saturday,May17th,2014, 03:57 AM

చిత్రం - అమృతంలో చందమామ
నటీనటులు: శ్రీనివాస్ అవసరాల, హరీష్, చంద్రమోహన్, శివన్నారాయణ, ఇంటూరి వాసు తదితరులు
సంగీతం: శ్రీ,
కెమెరా: రసూల్ ఎల్లోర్
ఎడిటింగ్: ధర్మేంద్ర
దర్శకత్వం: గుణ్ణం గంగరాజు
నిర్మాత: గుణ్ణం గంగరాజు

అందమైన ఊహలెప్పుడూ బాగుంటాయి. ఆ ఊహను సెల్యులాయిడ్ పై ఆవిష్కరిస్తే.. అంతే అందంగా ఉంటాయా? లేదా అని చెప్పలేం. కాకపోతే, కొన్ని ఊహలు మాత్రం తెరపై కూడా అద్భుతంగా ఉంటాయి. చంద్రమండంలో వ్యాపారం, పెళ్లి చేయడంలాంటివన్నీ అందమైన ఊహలే. ఇలాంటి ఊహల సమాహారంతో గుణ్ణం గంగరాజు రూపొందించిన చిత్రం 'అమృతంలో చందమామ'. జస్ట్ ఎల్లో పతాకంపై డీసెంట్ మూవీస్ అందించి, మంచి ఫిలిం మేకర్ అనిపించుకున్నారు గంగరాజు. సో.. అమృతంలాటి పసందైన సినిమాని అందించి ఉంటారనే అంచనాలున్నాయి. మరి.. ఈ అమృతం ఆస్వాదించడానికి బాగుంటుందా? ఓ లుక్కేద్దాం.

à°•à°¥
అమృతం (అవసరాల శ్రీనివాస్), ఆంజనేయ ప్రసాద్ (హరీష్) ప్రాణ స్నేహితులు. అయితే, ఆంజనేయులకు దూరమైతేనే అమృతం బాగుపడతాడని అతని మామయ్య (చంద్రమోహన్) నమ్మకం. అందుకని, ఈజిప్ట్ పిరమిడ్స్ చెక్కు చెదరకుండా ఉన్నంత కాలం ఆంజనేయులను కలవకూడదని అమృతంతో ఒట్టేయించుకుంటాడు అతని మామ. పిరమిడ్లు శాశ్వతంగా ఉంటాయి కాబట్టే, వాటిని ఉదారణగా చెబుతాడు. విడిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు సంపాదించే అమృతం, ఆంజనేయులు దక్షిణ, ఉత్తరాదిన ఐదు నక్షత్రాల హోటల్స్ నిర్వహిస్తుంటారు. హోటల్ రంగంలో తిరుగులేనివారిగా కొనసాగుతుంటారు. à°ˆ ఇద్దరూ ఏ ఇంటిని అయితే అమ్మి, à°† తర్వాత కోట్లు సంపాదించారో à°† ఇంటిని కొన్న అప్పాజీ  (శివన్నారాయణ) వారి దరిద్రం తనకు తగులుకుందని, అందుకని కొంత డబ్బు రాబట్టాలని ఇద్దర్నీ కలుస్తాడు. à°•à°¥ ఇలా సాగుతుండగా ఈజిప్ట్ పిరమిడ్స్ బాంబు దాడికి గురై, ధ్వంసం అవుతాయి. దాంతో, అమృతం, ఆంజనేయులు మళ్లీ కలుస్తారు. వీళ్లని ఎలాగైనా బోల్తా కొట్టించాలనుకున్నఅప్పాజీ వీళ్లకి  రాకెట్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో పని చేస్తున్న చంద్రమోహన్ (రావు రమేష్)ని పరిచయం చేస్తాడు. చంద్రమండలంలో వ్యాపారం చేస్తే? కోట్లు గడించొచ్చని భావించిన అమృతం, ఆంజనేయులు తమ ఇద్దరి దగ్గర ఉన్న రెండువేల కోట్ల రూపాయలు చంద్రమండలం ప్రయాణానికి ఖర్చుపెడతారు. సతీసమేతంగా ప్రయాణం కావడంతో, పెద్దలు సమ్మతం లభించిన ఇద్దరి ప్రేమికులకు మాటిచ్చిన ప్రకారం పెళ్లి చేయడానికి, వాళ్లని కూడా తమతో చంద్రమండలం తీసుకెళ్లాలనుకుంటారు. కానీ, à°† రాకెట్ బోర్డ్ తిప్పేయడంతో పాటు వీరి ప్రయాణం ఆగుతుంది. ఉన్న ఆస్తి మొత్తం పోవడంతో రోడ్డు పాలవుతారు. వీళ్లని మోసం చేసిన చంద్ర మోహన్, à°ˆ డీల్ ద్వారా 20 కోట్లు లాభం ఆశించిన అప్పాజీ ఏమవుతారు? అమృతం, ఆంజనేయులు à°ˆ ఇద్దరినీ పట్టుకోగలిగారా? తమ ఆస్తిని వెనక్కి తెచ్చుకోగలిగారా? ప్రేమికులను కలపగలిగారా? తదితర అంశాలతో à°ˆ చిత్రం సాగుతుంది

ఫిల్మీబజ్ విశ్లేషణ
నటీనటులు
అమృతంగా అవసరాల శ్రీనివాస్ నటన అద్భుతం. అమాయకత్వం, వినోదం కలగలసిన ఆ పాత్రను చాలా బాగా చేశాడు. ఆంజనేయులుగా హరీష్ కూడా సినిమాకి ఎస్సెట్ అయ్యాడు. ఇక, శివన్నారాయణ, చంద్రమోహన్, రావు రమేష్ తదితరులు పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికి నిపుణులు
కెమెరా పనితనం బాగుంది. చంద్రమండలాన్ని చూపించిన వైనం ఆకట్టుకుంటుంది. పాటలు సందర్భోచితంగా సాగాయి. వినసొంపుగా కూడా ఉన్నాయి. ఎడిటింగ్ వైజ్ గా అక్కడక్కడా కొన్ని సన్నివేశాలను కత్తిరించి ఉంటే, బాగుండేది. ఇక, ఈ సినిమా మేకర్ గుణ్ణం గంగరాజు గురించి చెప్పాలి. ఈ కథకు వంక పెట్టడానికి లేదు. రొటీన్ కి భిన్నంగా ఓ ప్రయత్నం చేయాలనుకున్నారు. వేరే గ్రహంలో సాగే కథకు తెరరూపం ఇవ్వడానికి వ్యయప్రయాసలు ఎదుర్కొన్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది. భారీ తారాగణం లేకపోయినా బడ్జెట్ బాగానే అయ్యుంటుంది. 'అమృతం' బుల్లితెర పై సూపర్ హిట్. ఈ వెండితెర 'అమృతం' కూడా సీరియల్ గా అయితే హిట్టయ్యుండేది. ఎందుకంటే, ఇది సినిమాలా అనిపించదు. కాస్ట్ లీ సీరియల్ లా అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో చంద్రమండలం కనిపించదు. సెకండాఫ్ లో ఆ ఎపిసోడ్ ఉండటంతో ఆసక్తికరంగా ఉంటుంది. కానీ, ఇలాంటి సినిమాలను రెండున్నర గంటలపాటు భరించడం కష్టమే. అయితే, మహిళా ప్రేక్షకులు ఎక్కడా ఇబ్బందిపడని విధంగా ఉన్న క్లీన్ సినిమా ఇది. అందుకే ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే.

ఫైనల్ à°—à°¾ చెప్పాలంటే.. వేసవిలో ఓసారి చంద్రమండలాన్ని చూడాలనే తపన బాగా ఉంటే  à°ˆ సినిమాని చూడొచ్చు. లేకపోతే.. ఎలాగూ బుల్లితెరపై వేరే సీరియల్స్ ఉన్నాయి à°—à°¾.. వాటితో సరిపెట్టుకోవడం బెటర్..



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !