View

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ రివ్య్వూ

Thursday,March14th,2019, 12:03 PM

చిత్రం - బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్
నిర్మాణ సంస్థ - ఎంఎస్ క్రియేషన్స్
నటీనటులు - మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, గోరటి వెంకన్న, ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు
సాంకేతిక వర్గం - సినిమాటోగ్రఫీ - తోట వి రమణ, ఎడిటింగ్ - ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం - సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ - జీబూ, డీటీఎస్ - రాజశేఖర్, పాటలు - గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్, నీల నర్సింహా,
కథా, నిర్మాత - మహంకాళి శ్రీనివాస్,
రచన, దర్శకత్వం - నాగసాయి మాకం.


ఎంత పెద్ద నగరాల్లో నివసిస్తున్నా...మన మూలాలన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. అందుకే పల్లెటూరి సంగతులు, అక్కడి కథలు, సన్నివేశాలు మన మనసులకు హత్తుకుంటాయి. గత జ్ఞాపకాలు గుర్తుకుతెస్తాయి. సినిమాల్లో ఇలాంటి కథలు తక్కువ. గతేడాది రంగస్థలం గ్రామీణ నేపథ్య చిత్రంగా ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా అలాంటి అనుభూతినే అందిస్తోంది.


కథ విషయానికి వస్తే..
బిలాల్ పూర్ అనే ఊరికి కొత్తగా యువ పోలీసు అధికారి సూర్య (మాగంటి శ్రీనాథ్) వస్తాడు. పోలీసు వృత్తిలో మంచి పేరు తెచ్చుకోవాలన్నది అతని కోరిక. సంఘ విద్రోహుల ఆనవాళ్లు లేకుండా చేయాలని అనుకుంటాడు. ఇలాంటి ఆశయాలతో బిలాల్ పూర్ వచ్చిన సూర్యకు అక్కడ స్థానికంగా జరిగే గొడవలు చికాకు కలిగిస్తుంటాయి. కోడి పోయిందని, విందులో మాంసం వడ్డించలేదని, దూడ పొడిచిందనే కేసులు స్టేషన్ కు వస్తుంటాయి. ఈ చిన్న చిన్న కేసులను చట్టప్రకారం ఎలా పరిష్కరించాలో అర్థం కాక అసహనానికి గురవుతుంటాడు సూర్య. సూర్య పనిచేసే స్టేషన్ లోనే సురేందర్ (గోరటి వెంకన్న) అనే హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తుంటారు. ఊరిలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి సురేందర్ ను అంతా తమ మనిషిగానే భావిస్తుంటారు. వృత్తిపరంగా పోలీస్ అయినా...అంతా బావా, అన్నా, బాబాయ్ అంటూ కలుపుగోలుగా ఉంటారు. ఈ క్రమంలో ఊరి వాళ్ల అతి చనువు పోలీసులకు ఇబ్బందిగా మారుతుంది. సురేందర్ మంచితనం సూర్యకు నచ్చదు. కఠినంగా ఉంటాలని సూచిస్తాడు. అయినా పరిస్థితి మారదు. సురేందర్ కూతురు శ్రీలత (శాన్వీ మేఘన) పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంటుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు సూర్య. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. మరోవైపు ఊరిలో కొందరు కుర్రాళ్లు చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడుతుంటారు. వీళ్లను పట్టుకునేందుకు సూర్య ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో ఊరిలో జరిగిన ఓ ఘోర ఘటన పోలీసులకు సవాలులా మారుతుంది. ఆ సంఘటన ఏంటి? దాన్ని పోలీసు అధికారి సూర్య ఎలా మార్చాడన్నది ఆసక్తికరంగా సాగే ముగింపు.


నటీనటుల ప్రతిభ..
బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రానికి మూల స్తంభంలా నిలిచారు గాయకుడు గోరటి వెంకన్న. హెడ్ కానిస్టేబుల్ సురేందర్ పాత్రలో ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. మన ఊరిలో చూసే పోలీసు బాబాయ్ లా సహజంగా నటించారు వెంకన్న. వినోద సన్నివేశాల్లో వెంకన్న నటన ఎంతగా నవ్విస్తుందో...పోలీసు వృత్తిలో బాధలను వివరించే క్రమంలో అంత భావోద్వేగాలతో సాగుతుంది. యువ పోలీసు అధికారి సూర్యగా మాగంటి శ్రీనాథ్ పాత్రోచితంగా నటించారు. యువ అధికారికి ఉండాల్సిన లక్షణాలు ఆయన నటనలో కనిపించాయి. శాన్వీ మేఘన అందమే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది. గ్రామంలో మనకు తెలిసిన అందమైన అమ్మాయిని గుర్తుకుతెస్తుంది. ఆర్ ఎస్ నందా ఉన్న సన్నివేశాలన్నీ నవ్వులు పూయించాయి. వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణుల పనితనం...
బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని ఆద్యంతం సహజంగా, వినోదాత్మకంగా మలచడంలో యువ దర్శకుడు నాగసాయి మాకం విజయం సాధించారు. కొత్త దర్శకుడైనా ఎక్కడా తడబడకుండా వాణిజ్య అంశాలతో మేళవించి సినిమాను రూపొందించారు. మన చుట్టూ జరుగుతున్న కథలాగే బిలాల్ పూర్ సాగేలా చేశారు. తోట వి రమణ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. పల్లె అందాలను తెరకెక్కించడంలో ఆయన కెమెరా కన్ను కొత్త పుంతలు తొక్కింది. పోలీస్ గొప్పదనం చెబుతూ సుద్దాల అశోక్ తేజ రాసిన నిద్దుర లేని కళ్లకు అడ్రస్, అలసట లేని కాళ్లకు సిలబస్ అనే పాట ఆయన సాహిత్య స్థాయిని చూపించింది. గోరటి వెంకన్న, మౌనశ్రీ మల్లిక్ పాటలు సాహిత్య విలువలతో సాగాయి. సాబూ వర్గీస్ సంగీతం కథకు మరింత బలాన్నిచ్చింది. ఎంఎస్ క్రియేషన్స్ సంస్థ ఉన్నత నిర్మాణ విలువలు ఉన్నాయి. నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ కు తొలి చిత్రమైనా మంచి సినిమా చేయాలనుకునే తన అభిరుచి చూపించారు.


విశ్లేషణ..
అర్థవంతమైన సినిమా కావాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి ఎంపిక బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ఒక విధంగా చెప్పాలంటే ఇది మన ప్రజా జీవనానికి అద్దం పట్టే సినిమా. మరో రంగస్థలం కాగల సత్తా ఉన్న చిత్రం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !