View

రాణి మూవీ రివ్య్వూ

Wednesday,February10th,2021, 02:23 PM

చిత్రం - రాణి
నటీనటులు - శ్వేతా వర్మ, ప్రవీణ్ యండమూరి, కిషోర్ మారిసెట్టి, అప్పాజీ అంబరిష ధర్మ, మేక రామకృష్ణ, రాజశేఖర్ అన్నింగి, సురభి శ్రావణి, సుజాత, తదితరులు
మ్యూజిక్ - శాండీ అడ్డంకి
సినిమాటోగ్రఫీ - రామా మారుతి యం
ఎడిటర్ - జెస్విన్ ప్రబు  
బ్యానర్ - మనోహరి ఆర్ట్స్ మరియు నజియా షేక్ ప్రొడక్షన్స్
స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డైరెక్షన్ - రాఘవేంద్ర కటారి  


శ్వేత వర్మ, ప్రవీణ్ యండమూరి, కిషోర్ మారిశెట్టి నటీనటులుగా మనోహరి ఆర్ట్స్ & నజియా షేక్ ప్రొడక్షన్స్ పతాకంపై రాఘవేంద్ర దర్శకత్వంలో కిషోర్ మారిశెట్టి  మరియు నజియా షేక్ లు నిర్మించిన ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం 'రాణి' అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫాంలలో తెలుగు,హిందీ బాషల్లో  ఈ నెల 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా తెలుసుకుందాం. 


కథ
కూతురు రాణి (శ్వేతావర్మ) ను కష్టపడి చదివించి  కలెక్టర్ ని చేయాలనుకుంటాడు పోలీస్ అయిన తండ్రి విక్రమ్. తండ్రి కోరికను నెరవేర్చాలనే పట్టుదలతో రాణి కూడా బాగా చదువుకుంటుంది. విక్రమ్ అన్యాయాన్ని ఎదుర్కొనే సాధారణ పోలీస్. శివ (ప్రవీణ్ )అమ్మాయిలు వీక్ నెస్ తెలుసుకొని వారిని ప్రాస్టిట్యూట్ గా మారుస్తూ సుమారు 200 మంది అమ్మాయిలను తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తూ... తన మాట వినని వారిని చంపేస్తుంటాడు. ఈ క్రమంలో శివ చూపు రాణిపై పడుతుంది. రాణిని  ప్రాస్టిట్యూట్ గా దింపాలనే విషయంలో ఇద్దరికీ గొడవ జరిగి శివ ను రాణి దాడి చేస్తుంది. పోలీస్ స్టేషన్ కెళ్ళి శివపై కంఫ్లైంట్ రాసి విక్రమ్ కు ఇస్తుంది. కొంతమంది సహాయంతో శివను జైల్లో పెట్టిస్తుంది. రాణి పై కక్ష్య పెంచుకొన్న శివ, జైలు నుండి బయటకు వచ్చి డాక్టర్ సహాయంతో రాణిపై ఒక కొత్త ప్రయోగం తో రాణి ని ప్రాస్టిట్యూట్ గా ఎలా మార్చాడు? శివ ట్రాప్ నుండి రాణి ఎవరి సహాయంతో బయట పడింది. తను ఇలా మారడానికి కారణమైన వారిపై రాణి  రివెంజ్ తీర్చుకుందా? రాణిని కలెక్టర్ గా చూడాలనే తన తండ్రి కోరికను నెరవేర్చిందా?  లేదా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటులు
రాణిగా శ్వేతావర్మ చాలా అద్భుతంగా నటించింది. తనది రివేంజ్ తీర్చుకునే పాత్ర. ఆ పాత్రకు కావాల్సిన హావాభావాలతో ఆడియన్స్ ని మెప్పించింది. పోలీస్ పాత్రలో విక్రమ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. శివ పాత్రలో ప్రవీణ్ చాలా బాగా నటించాడు. అమ్మాయిలను ట్రాప్ చేసే పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


సాంకేతిక వర్గం
ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే హైలైట్. సినిమా ఆరంభమైనప్పట్నుంచే ఆడియన్స్ కథలో లీనమయ్యేలా చేయడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. మంచి టెంపోను మెయింటైన్ చేసాడు. కథ, స్ర్కీన్ ప్లే బాగున్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ విషయంలో సరైన కేర్ తీసుకోకపోవడం సినిమాకి మైనస్ అయ్యింది. ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. ఫస్ట్ సినిమా అయినప్పటికీ, నిర్మాతలు కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చి క్వాలీటీగా సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు లేకపోవడం. ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు ఉండి ఉంటే సినిమా ఎక్కువమంది ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉండేది. డిజిటల్ ప్లాట్ ఫాం లలో అమెజాన్, ఎం.ఎక్స్ ప్లేయర్ లలో విడుదలైన ఈ సినిమాను ఇంట్లో కుటుంబంతో కలసి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.


విశ్లేషణ
5,10 క్యారెక్టర్స్ ఉన్న ఈ సినిమా కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. ఫ్లాష్ బ్యాక్ లో డాక్టర్ తో రాణి పై చేసే  ప్రయోగం, మనిషిని ఎలా అడిక్ట్ అయ్యేలా చెయ్యొచ్చో దర్శకుడు చాలా చక్కగా తెరపై చూపించారు. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ ని ఆలోచింపచేస్తాయి. ముఖ్యంగా... ''దాని చావు ఎంత దారుణంగా ఉండాలంటే... ఎండలో భగభగ మండుతున్న నాపరాతి బండి మీద చిన్న పురుగును పడవేస్తే అది ఎలా కొట్టుకుంటూ చస్తుందో రాణి కూడా అలా చచ్చేటప్పుడు చూడాలి'' అనే డైలాగ్ బాగా పండింది. అలాగే ''పగ తీర్చుకోవడం అంటే శత్రువుని చంపడం కాదు మనకు నచ్చినట్టుగా మార్చుకోవడం'' వంటి డైలాగులు గుర్తిండి పోతాయి. యూత్ ఈ సినిమాని తప్పకుండా చూడాలి. నేటి సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ని చాలా చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. 


ఫైనల్ గా ... ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా బాగ్ కనెక్ట్ అవుతుంది. సో... ఎంజాయ్ ది మూవీ విత్ ఫ్యామిలీ.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !