View

షాదీ ముబారక్ మూవీ రివ్య్వూ

Friday,March05th,2021, 02:58 PM

చిత్రం - షాదీ ముబారక్

నటీనటులు - సాగర్ ఆర్.కె.నాయుడు, దృశ్య రఘునాథ్, రాహుల్ రామకృష్ణ, హేమ, బెనర్జీ తదితరులు

సంగీతం - సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫీ - శ్రీకాంత్ నారోజ్

నిర్మాతలు - రాజు, శిరీష్

రచన, దర్శకత్వం - పద్మశ్రీ


చక్రవాకం', 'మొగలి రేకులు' సీరియల్స్ తో ప్రతి తెలుగువారి ఇంటిలోనూ ఓ సభ్యుడిగా మారిపోయాడు ఆర్.కె. నాయుడు ఉరఫ్ సాగర్. టీవీ నటుడిగా లభించిన ఆదరణతో 'సిద్ధార్థ' అనే చిత్రంలో సోలో హీరోగా నటించాడు. ఆశించిన  విజయం లభించలేదు. మరోసారి తన అదృష్టాన్ని 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌' మూవీతో పరీక్షించుకున్నాడు. అదీ గొప్ప ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా పట్టు వదలకుండా ఇప్పుడు 'షాదీ ముబారక్‌' అంటూ జనం ముందుకు వచ్చాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితం లభించింది!?


కథ 
మాధవ్ సున్నిపెంట (వీర సాగర్‌) జాతకంలో అతని కంటే కాస్తంత వయసు పెద్ద అమ్మాయితో వివాహం జరుగుతుందని ఉంటుంది. ఆ విషయంలో కొంత కలత చెందిన ఆమె తల్లిదండ్రులు (హేమ, బెనర్జీ)  తమ కొడుకుకు సంబంధాలు చూసిపెట్టమని ఓ మ్యారేజ్ బ్యూరో ను ఆశ్రయిస్తారు. ఆ సంస్థ నిర్వాహకురాలు (రాజశ్రీ నాయర్‌) అందుకు అంగీకరిస్తుంది. ఒకే రోజు మూడు పెళ్ళిచూపులు అరేంజ్ చేస్తుంది. కానీ చిన్న సమస్య వచ్చి మాధవ్ తో పాటు... ఈ పెళ్ళి చూపులకు తన కుమార్తె సత్యభామ తుపాకుల (దృశ్య రఘునాథ్)ను తోడుగా పంపుతుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అంతలోనే ఎలాంటి అపార్థాలు చోటు చేసుకున్నాయి? చివరికి వీరు ఒకటి అయ్యారా... లేదా అనేదే కథ!


నటీనటుల పెర్ ఫామెన్స్
వీర సాగర్ చక్కగా నటించాడు. సీరియల్స్ లో మాదిరి మనసుల్ని పిండేసే భారీ సెంటిమెంట్స్ సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. తన వరకూ తన పాత్రను చక్కగా పోట్రేట్ చేశాడు. మలయాళీ అమ్మాయి దృశ్య రఘునాథ్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పేరుకు తగ్గట్టే సత్యభామ పాత్రను చక్కగా పోషించింది. ఆమె తల్లిదండ్రులుగా ప్రియదర్శిని రామ్, రాజశ్రీ నాయర్ నటించారు. రాజశ్రీ నాయర్‌ ఓన్ డబ్బింగ్  చెప్పినట్టుగా అనిపిస్తోంది. తెలుగు పదాలు పలకడానికి కాస్తంత ఇబ్బంది పడ్డారామె. ఇక హీరో తల్లిదండ్రులుగా హేమ, బెనర్జీ నటించారు. ఎన్నారై పెళ్లికొడుకుగా మిర్చి హేమంత్ అదరగొట్టాడు. భద్రం కామెడీ కూడా సూపర్... వీళ్ళిద్దరూ కనిపించేది రెండు మూడు సీన్స్ లోనే అయినా... సినిమాలో వాళ్ళ ప్రెజెన్స్ చాలా కీలకం. ఇక రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో నవ్వించేశాడు. మధునందన్ కనిపించేది ఒకే ఒక్క సీన్ లో! అతని పాత్ర నుండి పెద్దగా వినోదాన్ని ఆశించవచ్చు, ఇతర ప్రధాన పాత్రలను అదితి, అజయ్‌ ఘోష్‌, శత్రు, ఝాన్సీ తదితరులు బాగా చేశారు.


సాంకేతిక వర్గం
సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్‌  నేపథ్య సంగీతం బాగుంది.  శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిజానికి ఓ సింపుల్ పాయింట్ ను తీసుకుని, డైవర్షన్స్ కు పోకుండా, అనవసరమైన యాక్షన్ సీన్స్ ను యాడ్ చేయకుండా,  రెండు గంటల సినిమాగా తీయడం సామాన్య విషయం కాదు. అందుకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసుకుని దర్శకత్వం వహించిన పద్మశ్రీని మొదట అభినందించాలి. అలానే వీర్ సాగర్ తన స్నేహితులతో కలిసి మొదలు పెట్టిన ఈ సినిమా కథ నచ్చి, దానిని టేకోవర్ చేసిన నిర్మాతలు దిల్ రాజు - శిరీశ్‌ లనూ అప్రిషియేట్ చేయాలి. రెగ్యులర్ కమర్షియల్‌ హంగుల్ని ఆశించకుండా, హాయిగా వీకెండ్ లో చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రం 'షాదీ ముబారక్'!  

 

విశ్లేషణ
తొలి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రొటీన్‌ యాక్షన్‌ డ్రామాల జోలుకు పోకుండా సాగర్ మంచి పని చేశాడు. ఓ కూల్ బ్రీజ్ లవ్ స్టోరీ ని ఎంపిక చేసుకున్నాడు. కథలో పెద్ద పాయింట్ లేకపోయినా... సినిమా ఆద్యంతం ఆహ్లాదరకంగా, వినోదాత్మకంగా సాగిపోయే జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా ప్రధామార్థం హీరో పెళ్ళిచూపుల చుట్టు సాగితే, ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. తనను అపార్థం చేసుకున్న వారికి వివరణ ఇవ్వడం, తన లవ్ స్టోరీని సక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రథమార్థంతో పోల్చితే సినిమా ద్వితీయార్ధం కాస్తంత వేగం తగ్గింది. సినిమా సాగేదంతా పెళ్ళిచూపుల నేపథ్యంలో కాబట్టి... గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'పెళ్లిచూపులు' కూడా అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటుంది. నిజానికి ఈ రెండు కథలకూ ఎలాంటి పోలికా లేదు. కాకపోతే... ఈ సినిమా ఫ్రెష్ ఫీల్ ను ఇస్తుంది. అలానే చాలా పాత్రలకు సరైన ఎండింగ్ ఇవ్వలేదు. దాంతో అబ్రాప్ట్ గా సినిమాను దర్శకుడు ముగించేశాడనిపిస్తుంది. అయితే ఓవర్ ఆల్ గా చూసినప్పుడు చాలా రోజుల తర్వాత ఓ ఫన్నీ ఎంటర్ టైనర్ ను చూసామనే భావన కలుగుతుంది. గడిచిన రెండు నెలల్లో ఇంత లైటర్ వీన్ కామెడీ మూవీ రాలేదనే చెప్పాలి.


ఫైనల్ గా చెప్పాలంటే...
ఈ సినిమాకి  నటీనటుల నటన, ఆకట్టుకునే హాస్య సన్నివేశాలు, దర్శకుడు పద్మశ్రీ కథ, కథనాలు ప్లస్ పాయింట్స్. సో... ఈ వీకెండ్ ని ఈ సినిమాతో ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యొచ్చు. డోంట్ మిస్ ది మూవీ.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !