చిత్రం - రంగ్ దే
నటీనటులు - నితిన్, కీర్తి సురేష్, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, తదితరులు
సినిమాటోగ్రఫీ - పి.సి.శ్రీరామ్
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్ - నవీన్ నూలి
నిర్మాతలు - సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం - వెంకీ అట్లూరి
విడుదల తేదీ - మార్చి 26, 2021
నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'రంగ్ దే'. తన గత చిత్రం 'చెక్' పరాజయం పొందిన నేపధ్యంలో 'రంగ్ దే' పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు నితిన్. ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా (26.3.2021) ఆ అంచనాలను అందుకునే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
అర్జున్ (నితిన్), అను (కీర్తి సురేష్) ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. అలా చిన్నప్పట్నుంచి ఒకరికొకరు తెలుసు. అయితే అర్జున్ కి అను అంటే ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. అలాంటి ఈ ఇద్దరూ కొన్ని అనుకోని సంఘటనల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. వారు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లయిన తర్వాత వీరి లైఫ్ ఎలా సాగింది... అర్జున్ కి అనుపై ప్రేమ కలుగుతుందా అనేదే ఈ చిత్ర కథ.
నటీనటుల పెర్ ఫామెన్స్
నితిన్ ఈ సినిమాలో ప్రస్టేషన్ హజ్బెండ్ గా నటించాడు. ఇదివరకూ నితిన్ ఇలాంటి పాత్ర చేయలేదు. అర్జున్ పాత్రలో సూపర్బ్ పెర్ ఫామెన్స్ అలరించాడు నితిన్. లుక్స్ పరంగా కూడా చాలా బాగున్నాడు. అనుగా కీర్తి సురేష్ నటన సూపర్బ్. అల్లరి అమ్మాయిలా నటించింది. ఆడియన్స్ కీర్తి సురేష్ నటనకు ఫుల్ ఫిదా అయిపోతారు. గ్లామర్ గా కూడా ఉంది. వెన్నెల కిషోర్ నవ్వులు పూయిస్తాడు. సీనియర్ నటుడు నరేష్, కౌసల్య, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ని చక్కగా ఎలివేట్ అయ్యేలా చేసింది. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. విజువల్ గా సూపర్బ్. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు మంచి బడ్జెట్ పెట్టి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వని వైనం స్ర్కీన్ పై కనిపిస్తుంది. సినిమా చాలా రిచ్ గా ఉంది. డైరెక్టర్ వెంకీ తీసుకున్న స్టోరీ లైన్ పాతదే అయినప్పటికీ, స్ర్కీన్ ప్లే పరంగా కొత్తగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్, కామెడీ మిస్ అవ్వలేదు. దాంతో ఆడియన్స్ సినిమాలో లీనమైపోతారు. ఆ రకంగా డైరెక్టర్ వెంకీకి ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కుతాయి.
విశ్లేషణ
నితిన్, కీర్తి సురేష్ మధ్య సాగే సీన్స్ కామెడీ గా ఉంటాయి. దాంతో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. వెన్నెల కిషోర్ సీన్స్, కాలేజ్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి మంచి ఎంటర్ టైన్ మెంట్ ని ఇస్తాయి. కామెడీ తో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో సినిమాలో లీనమైపోతారు. నితిన్, కీర్తి నటన ఆకట్టుకుంటుంది.ఓవరాల్ గా ... ఈ వీకెండ్ ని ఫ్యామిలీతో కలిసి 'రంగ్ దే' ని ఎంజాయ్ చెయ్యొచ్చు. టైటిల్ కి సరిపడా రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, కామెడీ అన్ని ఉంటాయి. కలర్ ఫుల్లుగా, ఎంజాయ్ బుల్ గా సినిమా ఉంటుంది. సో... డోంట్ మిస్ ఇట్.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5