చిత్రం - విక్రమ్
నటీనటులు - నాగవర్మ, దివ్య రావు, సూర్య, పృద్వి, వైజాగ్ ప్రసాద్,ఖయ్యుమ్, తాగుబోతు రమేష్, జ్యోతి, సురేష్,నట కుమారి, ఆదిత్య ఓం తదితరులు
బ్యానర్ - ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్
సినిమాటోగ్రఫీ - వేణు మురళీధర్ వదనాల
సంగీతం - సురేష్ ప్రసాద్
ఎడిటింగ్ - మెనగా శ్రీను
నిర్మాత - నాగవర్మ బైర్రాజు
కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం - హరి చందన్
కథ
హీరో విక్రమ్ (నాగ వర్మ) లైఫ్ లో సెటిల్ అవ్వాలని విక్రమ్ తండ్రి సూర్య కోరుకుంటుంటాడు. కానీ సినిమా మీద ఉన్న ప్యాషన్ తో కథలు రాసుకుంటూ ఓ నిర్మాత దగ్గర పని చేస్తుంటాడు విక్రమ్. తన ఫ్రెండ్ హర్ష, తండ్రి సూర్య మాత్రమే తన ప్రపంచం అని లైఫ్ లీడ్ చేస్తుంటాడు విక్రమ్. అనుకోకుండా మొదటి చూపులోనే మహాలక్ష్మి తో ప్రేమ లో పడతాడు విక్రమ్. ఆ ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఇద్దరి మధ్య బ్రేకప్ అవుతుంది. ఈ ఇద్దరి మధ్యలోకి ఆదిత్య ఎంటరవుతాడు. అలాగే జగ్గు భాయ్, జగ్గు భాయ్ దగ్గర ఉండే శాంభవికి ఈ స్టోరీకి సంబంధం ఏంటీ... ఫైనల్ గా అన్ని అడ్డంకులను దాటుకుని విక్రమ్ తన ప్రేమను గెలుచుకున్నాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
సినిమా మీద ప్యాషన్ ఉన్న కుర్రాడిగా విక్రమ్ పాత్రతో అలరించాడు హీరో నాగవర్మ.ప చక్కటి నటనతో విక్రమ్ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసాడు. హీరోయిన్ దివ్యరావు కూడా మహాలక్ష్మి క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. ఆమెకు ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడతాయి. ఆదిత్య ఓం చాలా గ్యాప్ తరువాత గ్రేట్ ఆదిత్య క్యారెక్టర్ లో బిజినెస్ మెన్ క్యారక్టర్ లో కధ కి కీలక మలుపు తిరిగే చాలా మంచి క్యారక్టర్ చేసాడు. సీనియర్ నటుడు సురేష్ మరియు నట కుమారి హీరోయిన్ తల్లి తండ్రులు గా ప్రేమ పెళ్లిని వ్యతిరేకించే పాత్రలు బాగా పండించారు. అలాగే హీరో ఫ్రెండ్స్ క్యారక్టర్స్ లో నటించిన ఖయ్యుమ్, తాగుబోతు రమేష్ లు సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. కధ లో ఒక ట్విస్ట్ లాగా వచ్చే ఒక పాయింట్ దగ్గర వచ్చే పృథ్వి, జ్యోతి లు జగ్గు భాయ్, శాంభవి ల మధ్య హీరో తో వచ్చే సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
హీరోగా నటించిన నాగవర్మ ఈ సినిమాని నిర్మించారు. అటు నిర్మాతగా, ఇటు హీరోగా ఏ మాత్రం తగ్గకుండా తన మొదటి ప్రయత్నంతోనే సూపర్ అనిపించుకున్నారు నాగవర్మ. బడ్జెట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ ప్రసాద్ ఈ సినిమాకి మరో హైలైట్ అని చెప్పాలి. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. ప్రతి సీన్ ని చక్కగా ఎలివేట్ చేసే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. విజువల్ గా కూడా సినిమా బాగుంది. సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ విజువల్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ఇక డైరెక్టర్ హరిచందన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని తనే సమకూర్చుకున్నారు డైరెక్టర్. చక్కటి స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్. తడబాటు లేకుండా కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. నటీనటుల దగ్గరనుంచి, సాంకేతిక వర్గం వరకూ అందరినీ ఒక తాటిపై నడిపించి తనకు కావాల్సిన అవుట్ ఫుట్ రాబట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.
ఫిల్మ్ బజ్ విశ్లేషణ
హీరోయిన్ దివ్యారావు పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగుంది. అనాధ పిల్లల పట్ల ఆమె చూపే ఆదరణ, రోడ్డు మీద వదిలేసే పిల్లలు పట్ల శ్రద్ధ, తనకు కుదిరినంతవరకూ సహాయం చేయాలనే మంచితనంతో కలబోసిన పాత్ర స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే పెళ్లి పట్ల తన నిర్ణయం తన పేరెంట్స్ నిర్ణయం ఒకటే అనే విధంగా హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని డైలాగ్స్, సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ మధ్య లో వచ్చే లవ్ సాంగ్స్ అలాగే బ్రేక్ అప్ సాంగ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతాయి. లవ్, బ్రేకప్ కాన్సెఫ్ట్ లకు యూత్ ఎప్పుడూ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమ, సెంటిమెంట్... ఇలా అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఓవరాల్ గా సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ఆస్వాదించవచ్చు. సో... డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3.5/5