చిత్రం - దొరకునా ఇటువంటి సేవ
నటీనటులు - సందీప్ పగడాల, నవ్యరాజ్, వెంకీ, టి.ఎస్.ఆర్, నక్షత్ర, రవి వర్మ తదితరులు
సంగీతం - యస్ యస్ ఫ్యాక్టరీ
సినిమాటోగ్రఫీ - రామ్ పండుగల
ఎడిటింగ్ - చోటా కె ప్రసాద్
నిర్మాత - దేవ్ మహేశ్వరం
దర్శకత్వం - రామచంద్ర రాగిపిండి
విడుదల తేదీ - ఫిబ్రవరి 11, 2022
సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై దేవ్ మహేశ్వరం నిర్మించిన చిత్రం 'దొరకునా ఇటువంటి సేవ'. ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్, పోస్టర్స్ కి మంచి స్పందన లభించింది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకునే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
స్టోరీ
క్రైమ్ బ్రాంచ్ ఎస్సై అర్జున్ (అర్జున్ పగడాల), బ్యూటీషియన్ నవ్య (నవ్య రాజ్) భార్యభర్తలు. ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ కి సంబంధించిన క్రైమ్ విభాగంలో కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అలా ఓ కేసులో తన భార్య కూడా రెడ్ హ్యాండెడ్ గా బాయ్ ఫ్రెండ్ తో కలిసి దొరికిపోతుంది. ప్రియుడితో పాటు నవ్య కూడా చంపబడుతుంది. అర్జున్ క్షణికావేశంలో ప్రవర్తించిన తీరుకి తన భార్య ఆమె ప్రియుడు చేతిలో చంపబడతాడు అని హెచ్చరిక అందినా... క్షణికావేశం ఆపుకోలేక ఉక్రోషంగా ప్రవర్తిస్తాడు. భార్య భర్తల ఇద్దరికీ ఒకరి చేతిలో ఒకరు చనిపోతారనే, హెచ్చరికలు ముందుగా అందినా... క్షణికానందం మరియు క్షణికావేశం ఆపుకోలేని భార్య భర్తల మధ్య ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ నేపథ్యంలో ఏం జరిగిందనేది ఈ సినిమా కథ.
నటీనటుల పెర్ ఫామెన్స్
సందీప్ పగడాల.. మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో ఎక్స్ పీరియన్స్ నటుడులాగా పాత్రకు తగ్గట్టు వేరియేషన్స్ లో చక్కగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో, కొన్ని ఎమోషన్ సీక్వెన్స్ స్ లో మరియు తన డైలాగ్ డెలివరీతో సందీప్ చాలా బాగా నటించాడు. తన నటనతోనే కాకుండా తన లుక్ తో కూడా మంచి మార్కులు కొట్టేశాడు. హీరోయిన్ గా నటించిన నవ్య రాజ్ అందంతో పాటు .. తన నటనతో కూడా ఆకట్టుకుంది. అలాగే టి ఎన్ ఆర్, నక్షత్ర, రవి వర్మ, అపూర్వ మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం
సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి, రియలిస్టిక్ గా సినిమా ఉంటుంది. ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా, చక్కటి స్ర్కీన్ ప్లేతో తెరకెక్కించిన విధానం దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. దర్శకుడు రామచంద్ర రాగి పిండి కొత్త నటీనటులు అయినప్పటికీ ఎక్కడా కూడా కొత్త నటీనటులు అనే ఫీలింగ్ రాకుండా పాత్రలకు తగినట్లుగా నటనను రాబట్టగలిగారు. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అదే విధంగా రామ్ పండుగల సినిమాటోగ్రఫీ తో కథకు తగిన మూడ్ ని క్రియేట్ చేశారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చాలా బాగుంది. ఇక నిర్మాతగా దేవ్ మహేశ్వరం మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో కథకి ఎంత ఖర్చు అవసరమో అంతే ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఆసక్తిగా ఉంటుంది. కొన్ని సీన్స్ చాలా థ్రిల్లింగా తెరకెక్కించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ డ్రామాలో సందీప్ పగడాల నటన, నవ్య రాజ్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా కూడా సస్పెన్స్ అండ్ ఎమోషనల్ గా సాగుతూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అక్రమ సంబంధంలో ఉన్న వాళ్ళు కానీ అక్రమ సంబంధం పెట్టుకోవాలనే ఆలోచనలతో ఉన్నవాళ్లు గాని ఈ సినిమా చూస్తే. జీవితంలో అక్రమ సంబంధాల జోలికి వెళ్లడం గాని, ఆ ఆలోచన చేయడానికి గాని భయపడతారు. మాస్ ఆడియన్స్ ను ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది.
ఫైనల్ గా చెప్పాలంటే - అక్రమ సంబంధాలు జీవితాలను ఎలా నాశనం చెస్తాయో అనే మెసేజ్ ఈ సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. సో... డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5