చిత్రం - ఐరావతం
నటీనటులు - అమర్ దీప్, అరుణ్, తన్వి, ఎస్తేర్, సప్తగిరి, జయవాణి, సంజయ్ నాయర్, రవీంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ - ఆర్.కె వల్లెపు
సంగీతం - సత్య కశ్యప్
ఎడిటింగ్ - సురేష్ దుర్గం
సమర్పణ - రేఖ పలగాని
నిర్మాతలు - రాంకి పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరి చల్లా
దర్శకత్వం - సుహాస్ మీరా
థ్రిల్లర్ సినిమాలకు కమర్షియల్ టచ్ ఇస్తే... ఇక ఆ సినిమాకి తిరుగే ఉండదు. అన్ని వర్గాల ఆడియన్స్ ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేస్తారు. యూత్ అయితే ఇలాంటి సినిమాలను ఎప్పటికీ ఆదిరిస్తూనే ఉంటారు. సరిగ్గా ఇలాంటి జానర్ లో తెరకెక్కిన సినిమా 'ఐరావతం'. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది... సక్సెస్ ఫుల్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
స్టోరీ
శ్లోక (తన్వీ నేగి), చిక్కు (అమరదీప్) లవర్స్. తన లవర్ శ్లోకకు పుట్టినరోజు కానుకగా వైట్ కెమెరా ను గిఫ్ట్ గా ఇస్తాడు చిక్కు. ఈ కెమెరా కి ఓ స్పెషాల్టీ ఉంది. అదేంటంటే... శ్లోక తన వీడియో తీసుకుంటే, తనను పోలిన మరో అమమ్మాయి ప్రిన్సీ వీడియో ప్లే అవుతుంది. ప్రతిసారి ఓ ఇంట్రస్టింగ్ క్రైం థ్రిల్లర్ స్టోరీ ప్లే అవుతుంది. దీనివల్ల శ్లోక, ప్రిన్సీ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఈ విషయాన్ని తన ఫ్రెండ్ మాయ (ఎస్తర్) కి చెబుతుంది శ్లోక. మోడల్ గా వర్క్ చేస్తున్న ప్రిన్సీ కి సన్నీ బాయ్ ఫ్రెండ్.అతను ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. కాగా శ్లోక, ప్రిన్సీ లలో ఎవరో ఒకరు చనిపోతారనే నమ్మకంతో ఉంటుంది మాయ. మరోవైపు సీరియల్ మర్డర్లతో పోలీసులకు సవాల్ గా మారతాడు ఓ సైకో కిల్లర్. అసలు ఈ సైకో కిల్లర్ ఎవరు? శ్లోక, ప్రిన్సీ లలో ఎవరు చనిపోతారు? ఆ వైట్ కెమెరా కథ ఏంటీ తదితర అంశాలతో ఇంట్రస్టింగ్ గా తెరకెక్కింది ఈ సినిమా. ఈ థ్రిల్లర్ ని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి.
నటీనటుల పెర్ ఫామెన్స్
హీరో చిక్కు పాత్ర పోషించిన అమరదీప్ ఆల్ రెడీ టివి సీరియల్స్ ద్వారా చాలా పాపులర్. ఇక ఈ సినిమా ద్వారా మరింత మందికి దగ్గరయ్యాడు. పక్కంటి అబ్బాయిలా చిక్కు పాత్రలో అలరించాడు అమరదీప్. మోడల్ గా, బ్యూటీషియన్ గా శ్లోక, ప్రిన్సీ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయింది తన్వీ. ఈ రెండు పాత్రలను బ్యాలెన్స్ డ్ గా చేసి మెప్పించింది. సన్నీ, ఎస్తర్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. చర్చి ఫాదర్ క్యారెక్టర్ సప్తగిరి నవ్వులు పూయించాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల్లో అలరించారు.
సాంకేతిక వర్గం
డైరెక్టర్ సుహాస్ మంచి ఎంగేజింగ్ ధ్రిల్లర్ స్టోరీని ఎంచుకోవడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ట్విస్ట్ లతో స్ర్కీన్ ప్లే ని చాలా ఇంట్రస్టింగ్ గా సమకూర్చడం డైరెక్టర్ టాలెంట్ ని ఆవిష్కరించింది. పెద్దగా బోర్ కొట్టే సీన్లు ఉండవు. దాంతో ఆడియన్స్ సినిమాలో లీనమై చూస్తారు. సత్య కశ్యప్ అందించిన రెండు పాటలు బాగున్నాయి. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో కార్తీక్ కడగండ్ల ఫుల్ గా సక్సెస్ అయ్యారు. ప్రతి సీన్ ఎలివేట్ చేసే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. ఆర్.కె.వల్లెపు సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఆర్టిస్టుల ను చాలా అందగా చూపించారు. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా వుంది. ఎడిటర్ సురేష్ దుర్గం సీన్స్ ని... ఏర్చి కూర్చడంలో తన ప్రతిభను చూపించారు. నిర్మాతలు రాంకీ పలగని, లలిత కుమారి, బాలయ్య చౌదరి సినిమాను మంచి అత్యుత్తమ నిర్మాణ విలువలతో నిర్మించారు. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు.
విశ్లేషణ
ట్విస్ట్ లు ఈ సినిమాకి బలం. చివరి వరకూ సస్పెన్స్ కొనసాగుతూ ఉండటంతో ఆడియన్స్ బోర్ ఫీలవ్వకుండా సినిమాలో లీనమవుతారు. క్లయిమ్యాక్స్ లో ఫుల్ క్లారటీ గా సస్పెన్స్ లకు తెర పడటం అలరిస్తుంది. అక్రమ సంబంధాలతో నిర్లక్ష్యానికి గురైన ఓ అబ్బాయి, జీవితం ఎలా మారింది అనే మెసేజ్ ని చక్కగా ఆవిష్కరించడం జరిగింది. తాను బాగా ఇష్టపడే అమ్మాయి ఇతరులతో చనువుగా వుండటం భరించలేక... హంతకుడిగా మారడం ఈ సినిమాలో మెయిన్ పాయింట్. ఓవరాల్ గా ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లను ఇష్టపడేవారికి బాగా కనెక్ట్ అవుతుంది. సో... డోంట్ మిస్ ఇట్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5