View

కొండవీడు మూవీ రివ్య్వూ

Friday,July08th,2022, 06:15 PM

చిత్రం - కొండవీడు
నటీనటులు - బిగ్ బాస్ ఫేం శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్, నవీన్‌రాజ్ తదితరులు 


సాంకేతిక నిపుణులు 
బ్యానర్ - బి. పి.ఆర్ సినిమా 
నిర్మాతలు - మధుసూధనరాజు, బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి
దర్శకుడు - సిద్ధార్థ్ శ్రీ
డిస్ట్రిబ్యూటర్ - రామకృష్ణ
DOP - రఘు రాయల్
సంగీతం - కనిష్క
ఎడిటర్ - శివ శర్వాణి
పి. ఆర్. ఓ - మధు వి. ఆర్


దసరాజు గంగాభవాని బోధన్ పల్లి అలివేలు సమర్పణలో బి. పి. ఆర్ సినిమా పతాకంపై బిగ్ బాస్ ఫేం శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్, నవీన్‌రాజ్ నటీ నటులుగా సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం 'కొండవీడు'. అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అక్రమ రవాణా నేపథ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన 'కొండవీడు' చిత్రం ఈ నెల 8 న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ని మెప్నించే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


కథ
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ స్టోరీ తో డిఫరెంట్ జోనర్ లో నలుగురు కథల సమ్మేళనమే 'కొండవీడు'. కొండవీడు అటవీ ప్రాతంలో వుండే బాకు బాబ్జి ఆ ఫారెస్ట్ లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తుంటాడు.మానవాళికి ప్రాణవాయువు నిచ్చే చెట్ల జోలికి వెళ్ళద్దు అని అడ్డొచ్చిన ఆఫీసర్స్ ను చంపుతూ కనపడిన ఆడపిల్లలను రేప్ చేస్తూ ఉంటాడు. ఆలా చనిపోయిన వారిలో ఆచార్య యన్. జి. రంగా అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఒంటరివాడైన ప్రొఫెసర్ అడవితొ ఏంతో అటాచ్మెంట్ పెంచుకొని ఆ అటవీ ప్రాంతంలో ఉండే ప్రకృతికి హాని చేసే బాకు బాబ్జి మనుషులను చంపుతూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లి తండ్రులను కోల్పోయి అనాధగా పెరిగిన వంశీ కృష్ణకు కరోనా వచ్చిందని కొండవీడు అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్తారు ఫ్రెండ్స్,కరోనా వచ్చిందని బయపడిన వంశీ అడవిలో చనిపోవాలని నిర్ణయించు కొంటాడు.మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న శాండి (నవీన్) భార్య శ్రావణి చనిపోతే దానికి సామావేద (శ్వేతా వర్మ) కారణమని కిడ్నాప్ చేసి కొండవీడు అడవీ ప్రాంతంలో చంపాలని తీసుకువస్తే వారినుండి తప్పించుకొని ఆ అడవిలోకి పారిపోతుంది. అయితే అనుకోకుండా సామవేద, వంశీ కృష్ణలు ఒకరికి తెలియకుండా ఒకరు కలుసుకుంటారు. చూసిన తొలి చూపులోనే సామవేద ప్రేమలో పడతాడు వంశీ. మరోవైపు చెట్లను నరుకుతున్న ప్రొఫెసర్ ను చంపితే తనకు అడ్డు తొలగిపోతుందని ప్రొఫెసర్ ను చంపాలని అడవికిలొకి వస్తాడు బాకు బాబ్జి. ఇలా ఇలా సాగుతున్న వీరి జర్నీలో వీరు ముగ్గురు బాకు బాబ్జి కు దొరుకుతారు. చివరకు బాకు బాబ్జి వీళ్లను ఎం చేశాడు?, బాకు బాబ్జి నుండి వీరు తప్పించుకున్నారా? వంశీ ప్రేమను సామావేద అంగీకారించిందా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
శ్రీ కృష్ణ హీరోగా ఎంచుకొన్న కథ బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్ పండించే ఆస్కారం దొరికింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అమిత్ అదరగొట్టాడు. శ్వేతా వర్మ గ్లామర్ పరంగా, హావ భావాల పరంగా ఆకట్టుకుంది. కొన్ని సీన్లలో శ్వేతా వర్మ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. పర్యావరణాన్ని కాపాడాలి లేకపోతె ముందు తరాలవారికి భవిష్యత్తు లేకుండా పోతుంది అనే ప్రొఫెసర్ పాత్రలో చాలా చక్కగా నటించాడు. విలన్ గా నటించిన ప్రతాప్ రెడ్డి అద్భుతంగా నటించాడు . మిగతా నటీనటులు అందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.


సాంకేతికవర్గం
డైరెక్టర్ సిద్ధార్ధ్ శ్రీ ఎంచుకున్న స్టోరీ లైన్ కి హ్యాట్సాప్ చెప్పాలి. మంచి మెసేజ్ తో చక్కటి స్ర్కీన్ ప్లే తో థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. కనిష్క సంగీతం చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. "ఎదలో జరిగే ప్రణయాన్ని ఎలా ఆపడం" అనే పాట తెర మీద కూడ అంతే ఎఫెక్టివ్‌గా కనిపించింది. ఆర్ ఆర్ సీన్ లో ఇన్ వాల్వ్ చేయడంతో సినిమాలో ఆడియన్స్ లీనమవుతారు. అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ రఘు రాయల్ తన కెమెరాలో చక్కగా బంధించారు. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. శివ సర్వాణి ఎడిటింగ్  క్రిస్పీగా బాగుంది.


విశ్లేషణ
సొసైటీ లో ఉన్న వారందరిలో ఎవెర్నెస్ రావాలని మంచి కథను సెలెక్ట్ చేసుకొని థ్రిల్లర్ జోనర్ లో సినిమా నిర్మిస్తూ పర్యావరణ లో భాగంగా చెట్లను నరికే వారికి నరికిస్తున్న వారికి గుణపాఠం ఉండేలా చేస్తూ ఒక వైపు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ ను మిస్ కాకుండా సోషల్ అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేయడం గ్రేట్. కరోనా కి సంబంధించి ప్రస్తావించడం కూడా అభినందించదగ్గ విషయం. మనుషుల ప్రాణాలను పదికాలాలపాటు చల్లగా చూసే చెట్లుంటే ముందు తరాలకు బాగుంటుందని పర్యావరణ ప్రేమికులైన మేము చెట్లను నాటుతుంటే మీరంతా కలసి అక్రమంగా అన్యాయంగా ఆ చెట్లను నరికేస్తున్నారు. రాబోవు తరాలకు మనం ఆస్తులు ఇవ్వక పోయినా పరవాలేదు వారి ఆరోగ్యాన్ని ఆయుష్ ని తీసుకోవడం తప్పు. ఇలా చెట్లను నరుకుంటూ పొతే చివరకు న్యాచురల్ గా దొరికే ఆక్సిజన్ డబ్బుపెట్టి కొనుక్కోవలసి వస్తుంది. అలా కొనుక్కోవలసి వస్తే ఒక మనిషికి సుమారు సంవత్సరానికి 13 లక్షల ఖర్చు అవుతుంది. అప్పుడు పేదవాడికి, మధ్య తరగతి వారికి ఊపిరి తీసుకోవడం కూడా కస్టమవుతుంది అంటూ ఎంతో భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం చక్కగా కుదిరింది. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ కలగదు.ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా మంచి ప్రతిభను కనబరిచారు. ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇస్తూ మంచి ఎంటర్‌టైనర్‌ని ఎంచుకుని ఎక్కడా వల్గారిటీకి తావు లేకుండా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తీర్చిదిద్దారు.  ఈ సినిమాలో తెలిసిన ఆర్టిస్టులు ఉంటే ఇంకా పెద్ద సినిమా అయ్యేది.  


ఫైనల్ గా చెప్పాలంటే... మంచి మేసేజ్ తో క్లీన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సో... డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !