View

నేను c/o నువ్వు మూవీ రివ్యూ

Friday,September30th,2022, 01:54 PM

చిత్రం - నేను c/o నువ్వు
నటీ నటులు - రత్న కిషోర్, సన్య సిన్హా, సత్య, ధన, గౌతమ్ రాజ్, సాగారెడ్డి, తదితరులు
బ్యానర్ - అగపే అకాడమీ
కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- దర్శక, నిర్మాత - సాగా రెడ్డి తుమ్మ
సహ నిర్మాతలు - అత్తావలి, శేష్ రెడ్డి, పోలిష్ వెంకట్ రెడ్డి, కె. జోషఫ్
డిఓపి - జి.కృష్ణ ప్రసాద్
లిరిక్స్ - ప్రణవం, కొరియోగ్రాఫర్: నరేష్
మ్యూజిక్ - ఎన్.ఆర్.రఘునందన్
ఎడిటర్ - ప్రవీణ్ పూడి
ఆర్ట్ - పి.ఎస్.వర్మ
యాక్షన్ - షొలిన్ మల్లేష్
పి. ఆర్. ఓ - మధు వి. ఆర్


ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'నేను c/o నువ్వు’'.ఈ చిత్రానికి అత్తావలి , శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు సహ నిర్మాతలు.ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్ పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 30 న గ్రాండ్ గా విడుదల అవుతున్న 'నేను c/o నువ్వు' సినిమా ఎలా ఉందో రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


కథ
1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరులో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన కథ ఇది.గోపాలపురం అనే ఊరికి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉన్న టైమ్ లో కులాల మధ్య విపరీతమైన వర్గపోరు నడుస్తూ ఆధిపత్య పోరులో నలిగిపోతూ ఉంటున్న ఆ ఊరిలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మారుతి (రత్న కిషోర్) ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి చెల్లెలు దీపిక (సన్య సిన్హా) ను గుడిలో చూసిన మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి మాత్రం తన కులం అమ్మాయిలను ప్రేమించినా.. ప్రేమిస్తున్నానని వెంట పడినా... రాజకీయంగా ఎదగాలని చూసినా వారిని చంపేస్తుంటాడు. రోజూ దీపిక వెంట పడుతున్న మారుతీని మొదట దీపిక పట్టించుకోక పోయినా.. ఎగ్జామ్స్ టైమ్ లో మారుతి చేసిన హెల్ప్ తో ఇష్టపడుతుంది. ఒకానొక సందర్బంలో దీపిక చేతిని మారుతి పట్టుకోవడం చూసిన ప్రతాప్ రెడ్డి తక్కువ కులపోడని మారుతిని చితగ్గొడతాడు. ఆ తర్వాత దీపిక మారుతి పై మరింత ప్రేమను పెంచుకుంటుంది. దీంతో ప్రతాప్ రెడ్డి తన కులం అబ్బాయి కార్తీక్ తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు.ఆ తరువాత జరిగిన సంఘటనలు ఆ ఊరిని ఎటువైపు తీసుకెళ్లాయి.వీరిద్దరి ప్రేమకథ ఎటువైపుకు దారి తీసింది, దీపిక ఇష్టపడే విదంగా మారుతి ఎం హెల్ప్ చేశాడు? కార్తీక్ తో దీపికకు పెళ్లి జరిగిందా ? లేక ప్రతాప్ రెడ్డి ని ఎదిరించి దీపిక, మారుతిలు పెళ్లి కున్నారా? లేదా? అనేది తెలుసుకువాలంటే 'నేను c/o నువ్వు' సినిమా కచ్చితంగా చూడాల్సిందే..


నటీనటుల పెర్ ఫామెన్స్
రత్న కిషోర్ కొత్తవాడైనా తన పరిధిలో చాలా చక్కగా నటించాడు . సన్య సిన్హా తన నటనతో ఆకట్టుకుంది. గౌతమ్ రాజ్, ధనరాజ్ లు కీలక పాత్రలలో నటించారు.మారుతి కి ఫ్రెండ్స్ గా నటించిన సత్య, రాధాకృష్ణ , బాషా తదితరులు అందరూ చాలా చక్కగా నటించారు. దర్శకుడిగా, నటుడుగా సాగారెడ్డి తుమ్మ ప్రతాప్ రెడ్డి పాత్రలో చక్కటి విలనిజం చూయించాడు.చెల్లెలు దీపికను ప్రేమగా చూసుకొనే అన్నయ్యగా అద్భుతంగా నటించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఒక కొత్త విలన్ వచ్చాడా అని అబ్బుర పరచే విధంగా అతని యొక్క నటన ప్రతిభ పాఠవాలు ఉన్నాయి.ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక వర్గం
చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ ఈ చిత్రానికి సున్నితమైన పదజాలంతో కఠినమైన వాస్తవాలను ప్రతిబింభించేలా విభిన్న మైన కోణంలో, విభిన్న మైన స్క్రీన్ ప్లే తో, దర్శకత్వం అన్నీ తన బుజాలమీద వేసుకుని కులం పేరుతో పరువు హత్యలు వంటి మంచి కథను సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా జనరంజికంగా చిత్రీకరించడం జరిగింది. ఎన్.ఆర్.రఘునందన్ గారు అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. ఇందులో ఉన్న ఒక్క క్షణం.. లోన చేరే.. ఒక్క సా..రి జీవితమూ.. పాట, హే బేబీ మై బేబీ పాట, లుక్ అట్ మై హార్ట్ పాట, ప్రేమను లోకంలో కుడి కాలే మోపాను వంటి నాలుగు పాటలు కూడా సందర్భాను సారం వస్తాయి. డి ఓ పి జి.కృష్ణ ప్రసాద్ తీసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పని తీరు బాగుంది. ఫైట్స్ బాగా ఉన్నాయి.ఈ చిత్రం చూస్తుంటే టెక్నిసియన్స్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది.ఆగాపే అకాడమీ పతాకంపై సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రానికి అత్తావలి, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు సహ నిర్మాతలు అందరూ కలసి ఖర్చుకు వెనుకాడకుండా చాలా చక్కగా నిర్మించారు.మనం ఈ మధ్య కులం పేరుతో పరువు హత్యలు చూస్తున్నాము అలాంటి మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “నేను c/o నువ్వు’’ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.


మైనస్ లు - ఇందులో హీరో ఉన్నంతలో బాగా చేశాడు. కానీ ఆ పాత్రకు ఎవరైనా ఎలివెటెడ్ ఆర్టిస్ట్ ఉండి ఇంకా మంచి ఆర్టిస్టులు నటించి ఉంటే మరో RX100 సినిమా అయ్యేది. పెద్ద ఆర్టిస్టులు లేకపోవడం కొంత డ్రా బ్యాక్ అని చెప్పవచ్చు.


ఫైనల్ గా చెప్పాలంటే... దర్శకుడు చక్కటి కథను ఎన్నుకొని చాలా బాగా తెరాకెక్కించాడు..ప్రెసిడెంట్ పాత్రలో చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ ఈ చిత్రం ద్వారా సరికొత్త విలనిజం చూపించాడు. తెలుగు ఇండస్ట్రీ కి మరో కొత్త విలన్ వచ్చాడు అనేలా అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశాడు.సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.కెమెరామెన్ అందించిన విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. హీరోయిన్ సినిమాలో చూడడానికి సైలెంట్ గా ఉన్నా చాలా చక్కటి పెర్ఫార్మన్స్ కనపరచింది. సో.... డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !