View

'తగ్గేదేలే' మూవీ రివ్యూ

Friday,November04th,2022, 01:42 PM

చిత్రం - తగ్గేదెలె
బ్యానర్ : భ్రద ప్రొడక్షన్స్
నిర్మాత : ప్రేమ్ కుమార్ పాండే, పి. వి.సుబ్బారావు రెడ్డి
దర్శకత్వం : శ్రీనివాస్ రాజు
నటీనటులు :నవీన్ చంద్ర దివ్యా పిళ్లై, అన‌న్య సేన్ గుప్తా నాగ‌బాబు, డానీ కుట్ట‌ప్ప‌, ర‌వి కాలే, మ‌క‌రంద్ దేశ్ పాండే, అయ్య‌ప్ప పి.శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌, పూజా గాంధీ, రాజా ర‌వీంద్ర‌, ర‌వి శంక‌ర్
కెమెరా : వెంకట్ ప్రసాద్
ఎడిటింగ్ : గ్యారీ బి. హెచ్


దండుపాళ్యం సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ రాజు ఆ సినిమాకు సీక్వెల్ గా రెండు భాగాలు తెరకెక్కించాడు. తాజాగా దండుపాళ్యం సినిమాలోని నటులను తీసుకొని ఒక ఫ్యామిలీ, మర్డర్, మిస్టరీ తో రోపొందించిన చిత్రమే " తగ్గేదే లే". ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా నవీన్ చంద్ర దివ్యా పిళ్లై, అన‌న్య సేన్ గుప్తా లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై తెరాకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ పాండే, పి. వి. సుబ్బారావు రెడ్డి లు నిర్మించారు. ఈ చిత్రం నుండి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌, ట్రైలర్‌తో సినిమాపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. నవంబర్ 4న సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసిందో చూద్దాం పదండీ..


కథ
ఈ సినిమా మర్డర్ మిస్ట్రీ, డ్రగ్స్, లవ్ వంటి మూడు కథలతో సాగుతుంది. ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత తాను ఈశ్వర్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న లిజి ఈశ్వర్ ఇంట్లో ఉంటూ... అంతకుముందు తనతో దిగిన ఫొటోలతో ఈశ్వర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు లిజి తో ఈశ్వర్ కు ఎలా పరిచయం ఏర్పడింది,,వారిద్దరి మధ్య ఉన్న కథ ఏమిటి? ఈశ్వర్ సంబందించిన వీడియోస్ లిజి దగ్గరకు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్న ఈశ్వర్ కు తన ఇంటిలో లభించిన మహిళ శవం దొరుకుతుంది. అప్పటివరకు దండుపాళ్యం బ్యాచ్ తో సంబంధం ఉందని అనుమానం పడుతున్న పోలీసులకు ఈశ్వర్ ఇంట్లో అమ్మాయి శవం దొరకడం తో ఆ అమ్మాయిని ఈశ్వర్ చంపాడనే అనుమానంతో పోలీస్ ఆఫీసర్ చలపతి(రవి శంకర్), రాజా రవీంద్ర ఇంటరాగేషన్ చెయ్యాలని అరెస్ట్ చేస్తారు.ఈ ఇంటరాగేషన్ లో ద్వారా ఈశ్వర్ ద్వారా తెలుసుకున్న నిజాలు ఏమిటి?ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? ఆ హత్య నుండి తను ఎలా బయట పడ్డాడు? ఈశ్వర్ జీవితానికి, దండుపాళ్యం గ్యాంగుకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) దండుపాళ్యం గ్యాంగ్ ను, డ్రగ్ మాఫియాను ఏం చేశాడు ? అనేది తెలుసు కోవాలంటే తగ్గేదేలే సినిమా తప్పక చూడాల్సిందే..


*నటీ నటుల పనితీరు*
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో నవీన్ చంద్ర .నవీన్ చంద్ర భార్య గా దివ్యా పిళ్ళై ట్రెడిషనల్ వైఫ్‌ పాత్రలో చక్కగా నటించింది. నవీన్ చంద్ర ప్రియురాలు గా అనన్యా సేన్ గుప్తా గ్లామర్ డాల్‌గా కనిపించారు. భార్యకు, ప్రియురాలు మధ్య నలిగిపోయే ఎమోషన్ పాత్రలో నవీన్ చంద్ర ఆకట్టు కున్నాడు. సినిమా ఎక్కువ భాగం నవీన్ చంద్ర చుట్టూ తిరుగుతుంది.చలపతి పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా రవిశంకర్ కూడా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. 'పోలీస్‌గా రాజా రవీంద్ర,. 'దండుపాళ్యం' గ్యాంగ్ సభ్యులుగా మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, రవి కాలె మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.హీరో స్నేహితులు గా 'గెటప్' శీను, 'ఆటో' రామ్ ప్రసాద్ లు తమ కామెడీ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.సమరం లాంటి డాక్టర్ సమరం గా '30 ఇయర్స్' పృథ్వీ. చాలా బాగా నటించాడు. ఇలా ఈసినిమాకు పని చేసిన వారందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు


*సాంకేతిక నిపుణులు పనితీరు*
ఈ కథ కొత్తది కాకపోయినా కూడా .కొంత డిఫరెంట్ గా మర్డర్ మిస్ట్రీ, డ్రగ్స్, లవ్ ఉండే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ను సెలెక్ట్ చేసుకొని , ట్విస్ట్స్& టర్న్స్ తో . స్క్రీన్ మీదకు తీసుకు రావడంలో దర్శకుడు శ్రీనివాస్ రాజు సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు .క్లెమాక్స్ లో దండుపాళ్యం గ్యాంగ్, నవీన్ చంద్ర, రవి శంకర్, అయ్యప్ప, పూజా గాంధీ లపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బమ్స్ కలిగించడమే కాకుండా ప్రేక్షకులకు ఉత్కంఠ కు గురి చేస్తాయి. ఇందులోని యాక్షన్ సీన్స్, చూస్తుంటే దండుపాళ్యం సినిమాకు మించిన యాక్షన్ సీన్స్ తో మాస్ డైరెక్టర్ గా దర్శకుడు శ్రీనివాస్ రాజు తనదైన ముద్ర వేసుకున్నాడని చెప్పవచ్చు.ఈ సినిమా నేపథ్య సంగీతం, బాగుంది. చరణ్ అర్జున్ చేసిన ఇళయరాజా - భారతిరాజా ల 'మాటే మంత్రము' సాంగ్ రీమిక్స్, చేసి దానిని తెరకెక్కించిన తీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ అందించిన విజువల్స్ బాగున్నాయి. గ్యారీ బి. హెచ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. వెంకట్ ఆరే ఫైట్స్ బాగున్నాయి. భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌ ప్రేమ్ కుమార్ పాండే, పి. వి.సుబ్బారావు రెడ్డి లు ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు..మర్డర్ మిస్ట్రీ, లవ్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ‘దండు పాళ్యం' సినిమా కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !