View

'దోస్తాన్' మూవీ రివ్యూ

Friday,January06th,2023, 01:48 PM

చిత్రం : దోస్తాన్
నటీ నటులు - సిద్ స్వరూప్ , ఆర్. కార్తికేయ, రియా , నిత్య, చంద్రసే గౌడ, రమణ మహర్షి, మూస ఆలీ ఖాన్ తదితరులు 
బ్యానర్ : శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ 
నిర్మాత : సూర్యనారాయణ అక్కమ్మ
దర్శకత్వం - సూర్యనారాయణ అక్కమ్మ
మ్యూజిక్ : ఏలెందర్ మహావీర్ 
డి. ఓ. పి : వెంకటేష్ కర్రి, రవి కుమార్ 
ఎడిటర్ : ప్రదీప్ చంద్ర
పి.ఆర్ ఓ : మధు వి. ఆర్
ఫైట్ మాస్టర్ : విక్కీ, అజయ్ 


శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దోస్తాన్'. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ రోజు (జనవరి 6) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది... ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం.


కథ 
వైజాగ్ సిటీలో భాయ్ (చంద్రసే గౌడ) అనే వ్యక్తి డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ వంటి అక్రమ బిజీనెస్ లు చేస్తూ చలామణి అవుతుంటాడు. అతను గతంలో చెట్టు కింద పాలిస్తున్న నిస్సహాయరాలైన ఓ తల్లిని తన గ్యాంగ్ తో రేప్ చేసి చంపేస్తాడు. అక్కడే ఉన్న మరో అనాద జై (కార్తికేయ) ఆ చంటి బిడ్డ ఏడుపు వినిపించి చూడగా అక్కడ ఆ పిల్లాడి తల్లి చనిపోయి ఉంటుంది.. తన లాగే అనాధగా ఉన్న పిల్లాడిని చేరదీస్తాడు. ఏడుస్తున్న పిల్లాడి పాలకోసం వీధిలో ఆడుక్కంటున్న జై ను చూసి మెకానిక్ సెడ్ ఓనర్ అయిన బాబా (రమణ మహర్షి ) చేరదీసి షెడ్లో మెకానిక్ పని నేర్చుకోమని చెపుతాడు. అలాగే పెద్దోడికి జై( కార్తికేయ ), చిన్నోడికి రామ్ (సిద్ స్వరూప్) గా నామకారణం చేస్తాడు. వీరు పెద్ద అయిన తరువాత ఆ పెద్దాయన చనిపోవడంతో జై ను చదువుకోమని చెప్పి రామ్ మెకానిక్ గా మారతాడు. ఈ క్రమంలో జై కు నిత్య (ప్రియ వల్లబి) పరిచయం అవ్వగా, రామ్ (సిద్ స్వరూప్) కు రియా (ఇందు ప్రియ) పరిచయం ఆవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇలా వీరి లైఫ్ హ్యాపీ గా సాగిపోతున్న వీరి జీవితంలోకి మళ్ళీ భాయ్ ప్రవేశిస్తాడు. ఆ భాయ్ వల్ల జై, రామ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరికి భాయ్ పై వీరిద్దరూ ఎలాంటి రివేంజ్ తీర్చుకొన్నారు? అనేది తెలుసుకోవాలంటే "దోస్తాన్" సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పెర్ ఫామెన్స్
జై పాత్రలో కార్తికేయ , రామ్ పాత్రలో సిద్ స్వరూప్ లు హీరోగా నటించిన వీరిద్దరూ కొత్త వారైనా ఎమోషన్, లవ్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని రకాలుగా చక్కటి పెర్ఫార్మన్స్ చూపిస్తూ త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. హీరోయిన్స్ గా నటించిన నిత్య, రియా పాత్రలలో నటించిన ఇందు ప్రియ, ప్రియ వల్లబి తమ లిద్దరూ గ్లామర్స్ లుక్స్ తోపాటు నటనపరంగా బాగా నటించారు. ఇందులో వీరిద్దరి జోడీలు చాలా క్యూట్ గా ఉన్నాయి .  బాయ్ పాత్రలో నటించిన చంద్రసే గౌడ నెగటివ్‌ షేడ్‌ పాత్రలో ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. నిత్య తండ్రి పాత్రలో నటించిన మూస ఆలీ ఖాన్ తో పాటు ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.


సాంకేతికవర్గం
డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ అంశాలను సెలెక్ట్ చేసుకొని వాటికి చక్కటి ఎంటర్టైన్మెంట్ ను జోడిస్తూ లవ్, ఎమోషన్స్ ను జోడించి ప్రేక్షకులకు బోర్‌ ఫీలింగ్‌ లేకుండా  అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా తెరకెక్కించాడు. అలాగే అన్న , తమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు దర్శకుడు సూర్యనారాయణ అక్కమ్మ. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేసిన వెంకటేష్ కర్రి, రవికుమార్ ల కెమెరామెన్‌ పనితనం బాగుంది. ఏలెందర్ మహావీర్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌. చల్ చల్ ఇది హీరోయిజం చల్ చల్ ఇది నాలో నిజం, కురిసే మేఘం, ఓ పిల్లా పాటలు బాగున్నాయి. ప్రదీప్ చంద్ర ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఇందులోని ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత సూర్య నారాయణ అక్కమ్మ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.


విశ్లేషణ
మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాను అందరూ ఫ్యామిలీ తో కలసి చూడొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు, లవ్, ఫ్రెండ్షిప్ ఇలా మూడు జోనర్స్ మీద తీసిన 'దోస్తాన్' సినిమా అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంది.


ఫైనల్ గా చెప్పాలంటే ... అన్నదమ్ముల మధ్య బంధాన్ని తెలియజేసే సినిమా దోస్తాన్. అందరికీ కనెక్ట్ అవుతుంది. సో.. డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !