View

'1' Nenokkadinae Review

Friday,January10th,2014, 09:42 AM

నటీనటులు: మహేష్ బాబు, కృతి సనాన్, నాజర్, పోసాని, కెల్లీ డార్జ్, ప్రదీప్ రావత్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, నిర్మాతలు: అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట, దర్శకత్వం: సుకుమార్.


డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఏ సినిమా జయాపజయానికైనా అతనే కారణం అవుతాడు. ముఖ్యంగా స్టార్ హీరోలతో సినిమా చేసేటప్పుడు అదనంగా అందరి దృష్టీ ఆ చిత్రదర్శకుడి మీదే ఉంటుంది. సదరు స్టార్ ని ఆ దర్శకుడు ఎలా మలిచాడో చూడాలనుకుంటారు. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో '1' చిత్రం ప్రారంభమైనప్పడు అలానే భావించారు. మహేష్ మంచి నటుడని ఆల్రెడీ నిరూపించుకున్నాడు. సో.. సుకుమార్ చేయాల్సిందల్లా మంచి కథను ఎన్నుకోవడం, మహేష్ లోని నటుణ్ణి వినూత్న కోణంలో ఆవిష్కరించడం, ఓవరాల్ గా సక్సెస్ ఫుల్ సినిమా చేయడం. పైగా 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ అంటే కథ ఎంత డిమాండ్ చేస్తే అంత ఖర్చు పెడతారు. మరి.. తనకు '1' రూపంలో దక్కిన సువర్ణావకాశాన్ని సుకుమార్ సద్వినియోగం చేసుకున్నాడా? ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకునే విధంగా ఉంది? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ విశ్లేషణ లోకి వెళ్లాల్సిందే.


కథ:గౌతమ్ (మహేష్ బాబు) ఓ రాక్ స్టార్. అతని బాల్యం ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. గౌతమ్ చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు హత్యకు గురవుతారు. దాంతో హంతకులపై పగ పెంచుకునే గౌతమ్ వాళ్లని చంపుతున్నట్లుగా, వాళ్లు తనను చంపుతున్నట్లుగా ఊహించుకుంటాడు. ఇదిలా ఉంటే జర్నలిస్ట్ సమీరా (కృతి సనాన్)తో ప్రేమలో పడతాడు గౌతమ్. అతని ప్రేయసితో సహా ఇతరులు గౌతమ్ కి ఏదో సైకలాజికల్ సమస్య ఉందని భావిస్తారు. మరి.. గౌతమ్ నిజంగానే ఆ సమస్యతొ బాధపడతాడా? తన పేరంట్స్ ని చంపినవాళ్లని నిజంగా చంపుతాడా? ఊహల్లోనే చంపుతాడా? అనేది సినిమాలో చూడాల్సిందే.

ఫిల్మీబజ్ విశ్లేషణ
మహేష్ బాబు అద్భుతమైన నటుడని మరోసారి నిరూపించిన చిత్రం ఇది. రాక్ స్టార్ పాత్రలో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. హ్యాండ్ సమ్ గా కనిపించడంతో పాటు అద్భుతంగా నటించడంతో మహేష్ తెరపై కనిపించినప్ఫుడల్లా ఐఫీస్ట్ అనిపించింది. ఇక, మహేష్ చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు గౌతమ్ సుపర్బ్. తండ్రిలానే అందగాడు. చక్కగా యాక్ట్ చేశాడు కూడా. దర్శకుడు ఏం చెబితే మహేష్ బాబు అది చేసినట్లుగా అనిపిస్తుంది. కథ ఒకింత అయోమయంగా ఉంటుంది. బహుశా ఈ సినిమా చేసేటప్పుడు మహేష్ కి కూడా అలానే ఉండి ఉంటుంది. కానీ, గుడ్డిగా దర్శకుడ్ని నమ్మి సినిమా చేసినట్లుగా అనిపిస్తుంది. కానీ, మహేష్ నమ్మకాన్ని సుకుమార్ పూర్తిగా వమ్ము చేశాడు. కథ ఎన్నుకోవడం నుంచే సుకుమార్ తప్పు మొదలైంది. ఇక, మహేష్ లాంటి స్టార్ ని హ్యాండిల్ చేయడంలో కొంచెం తడబడిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. పైగా, నిర్మాతలు అతన్ని నమ్మి కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటిలోకల్లా ఇదే భారీ బడ్జెట్ చిత్రం. అందుకని, అంత బడ్జెట్ ని డీల్ చేయలేకపోయాడేమో అనిపిస్తోంది. ఫస్టాఫ్ సోసోగా, సెకండాఫ్ యావరేజ్ గా సాగుతుంది. గోవా ఎపిసోడ్ వేస్ట్ అనే చెప్పాలి. హీరో, హీరోయిన్ మధ్య గాఢమైన ప్రేమ కలగడానికి బలమైన కారణం ఉండదు. ఇలా చెప్పాలంటే చాలా మైనస్సులు ఉన్నాయి.
ఇక, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. రత్నవేలు కెమెరా అద్భుతం. ఎడిటింగ్ చెప్పుకోదగ్గ విధంగా లేదు. పైగా సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉండటం ప్రేక్షకుడి సహనానికి పెద్ద పరీక్ష. ఫైనల్ గా చెప్పాలంటే... మహేష్ బాబు అద్భుతమైన నటన, తన లుక్స్ కోసం సినిమా చూడొచ్చు.


ఫైనల్ గా చెప్పాలంటే... నో డౌట్.. నటుడిగా మహేష్ నంబర్ వన్. కానీ, కన్ ఫ్యూజ్డ్ స్టోరీతో చేసిన ఈ సినిమా మాత్రం టైటిల్ కి తగ్గట్టుగా లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !