View

Yevadu Review

Sunday,January12th,2014, 08:38 AM

నటీనటులుః రామ్ చరణ్, అల్లు అర్జున్, శృతిహాసన్, కాజల్ అగర్వాల్, ఎమీ జాక్సన్, సాయికుమార్, కోట, బ్రహ్మానందం, జయసుధ తదితరులు.

సాంకేతిక నిపుణులుః సంగీతం: దేవిశ్రీప్రసాద్, మాటలు: అబ్బూరి రవి కెమెరా: రామ్ ప్రసాద్ కథ: వక్కంతం వంశీ, వంశీ పైడిపల్లి స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వంశీ పైడిపల్లి నిర్మాత: 'దిల్' రాజు.

హాలీవుడ్ సినిమా 'ఫేస్ ఆఫ్' వచ్చి దాదాపు పదిహేడేళ్లయ్యింది. జాన్ ట్రవోల్టా, నికొలస్ కేజ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని 'ఎవడు' సినిమా రూపొందిస్తున్నారని ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ఓ వార్త వచ్చింది. ఆ కథని అటూ ఇటూ మార్చారని కూడా చెప్పుకున్నారు. అదెంతవరకు నిజం? తెలంగాణ ఉద్యమం కారణంగా విడుదలలో జాప్యం జరుగుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ పండగకి విడుదలైంది. 'తుఫాన్' ఘోరపరాజయంతో నిరుత్సాహంలో ఉన్న చరణ్ ని 'ఎవడు' ఉత్సాహపరుస్తుందా? హాలీవుడ్ 'ఫేస్ ఆఫ్'ని తెలుగుకి అనుగుణంగా వంశీ పైడిపల్లి మార్చగలిగాడా? తదితర విషయాలు తెలుసుకోవాలంటే 'ఎవడు' రివ్యూలోకి వెళ్లాల్సిందే.

à°•à°¥:

సత్య (అల్లు అర్జున్), దీప్తి (కాజల్ అగర్వాల్) ప్రేమికులు. ఇది వీరు భాయ్ (రాహుల్ దేవ్)కి నచ్చదు. ఎందుకంటే, దీప్తి మీద మనసు పడతాడు వీరూ భాయ్. అందుకని, ఈ ఇద్దర్నీ చంపడానికి ప్లాన్ చేస్తాడు. వైజాగ్ నుంచి హైదరాబాద్ పారిపోవడానికి దీప్తి, సత్య బస్సెక్కుతారు. ఈ ఇద్దరిని పొడిచేసి, ఎక్కిన బస్సుని తగలబెడతాడు వీరూ భాయ్. మంటల్లో దీప్తి చనిపోతుంది. సత్య మొహం పూర్తిగా కాలిపోతుంది. దాంతో డాక్టర్ (జయసుధ) ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అతని మొహం మార్చేస్తుంది. అలా సత్యకి చరణ్ (రామ్ చరణ్) మొహం వస్తుంది. కొత్త మొహంతో వీరూ భాయ్, అతని అనుచరులను అంతమొందిస్తాడు సత్య. ఇక శత్రువులు లేరని భావిస్తున్న సమయంలో సత్య ని కొంతమంది రౌడీలు వెంటాడతారు. ఆ రౌడీలెవరు? వారు చరణ్ కి సంబంధించిన వ్యక్తులా, సత్యకు సంబంధించిన వ్యక్తులా, చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటీ? చరణ్కి డాక్టర్ (జయసుధ)కి సంబంధం ఏంటీ అనేది మిగతా కథాంశం.

ఫిల్మీబజ్ విశ్లేషణః

రామ్ చరణ్ తన గత చిత్రాల్లోలా డాన్సులు, ఫైటులు బాగా చేశాడు. కానీ, ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం అతని నటన పేలవంగా ఉంది. కామెడీ సన్నివేశాల్లో కూడా అంతే. ఈ రెండు రసాల్లోనూ డెవలప్ అయితేనే చరణ్ మున్ముందు ప్రయోగాత్మక పాత్రలు చేయగలుగుతాడు. లేకపోతే, డాన్సులు, ఫైట్స్ తోనే నెట్టుకు రావడం కఫ్టం. ఇక, సత్య పాత్రను అల్లు అర్జున్ బాగా చేశాడు. ఎమోషన్ ని బాగా పండించాడు. కథానాయికలు శృతి, కాజల్, ఎమీల పాత్రలకు అంతగా ప్రాధాన్యం లేదు. సాయికుమార్ పాత్ర బాగుంది. బ్రహ్మానందం నవ్వించడానికి ట్రై చేశాడు. టెక్నికల్ గా చెప్పాలంటే.. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటలకన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా పనితనం, డైలాగ్స్ బాగున్నాయి. 'దిల్' రాజు బాగానే ఖర్చుపెట్టి సినిమాని రిచ్ గా తీశాడు. పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే రొటీన్ కమర్షియల్ సినిమా ఇది. ఇలాంటి సినిమాల్లో లాజిక్కులు వెతక్కూడదు. ఉదాహరణకు... ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మొహం మారుతుంది కానీ, గొంతు మారదు కదా. ఈ సినిమా ఫస్టాఫ్ లో ఓ కథ, సెకండాఫ్ లో ఓ కథ ఉంటుంది. రెండూ కూడా రొటీన్ గా ఉంటాయి. కాకపోతే వంశీ పైడిపల్లి టేకింగ్, స్ర్కీన్ ప్లే బాగుంది. ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్ అవే. ఒకవేళ స్ర్కీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోతే ఈ సినిమా అంత ఆసక్తికరంగా ఉండేది కాదు.

ఫైనల్ గా చెప్పాలంటే..

ఆరు పాటలు, నాలుగు ఫైట్స్, కొన్ని కామెడీ సీన్స్... ఇలా రొటీన్ ఫార్మట్లో సాగే మాస్ మసాలా మూవీ ఇది. ఇప్పుడు విభిన్న చిత్రాలకన్నా మసాలా సినిమాలకే టైమ్ బాగుంది, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి 'ఎవడు' ఆడుతుంది. ఆ క్రెడిట్ బాగా తీసిన వంశీ పైడిపల్లి, బాగా ఖర్చుపెట్టిన 'దిల్' రాజుకి దక్కుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !