View

అసుర మూవీ రివ్య్వూ

Friday,June05th,2015, 08:42 AM

చిత్రం - అసుర
నటీనటులు - నారా రోహిత్, ప్రియా బెనర్జీ, మధు సింగంపల్లి, రవివర్మ, సత్యదేవ్, భాను, రూపాదేవి తదితరులు
సంగీతం - సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ - యస్.వి.విశ్వేశ్వర్
ఎడిటింగ్ - ధర్మేంద్ర కాకరాల
సమర్పణ - నారా రోహిత్
నిర్మాతలు - శ్యామ్ దేవభక్తుని, కృష్ణవిజయ్
రచన, దర్శకత్వం - కృష్ణవిజయ్
విడుదల తేదీ - 5.6.2015

 

మాస్ క్యారెక్టర్స్ చేయడం నారా రోహిత్ కి కొట్టిన పిండి అనే చెప్పాలి. బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్స్ పలికే విధానం వరకూ అన్నింట్లోనూ మాస్ టచ్ కనబర్చగలిగే సత్తా ఉన్న నటుడు. అందుకే 'అసుర' అనే టైటిల్ తో రోహిత్ సినిమా చేస్తున్నాడనగానే మంచి 'మాస్ ఫిల్మ్' అవుతుంది. 'యాక్షన్ ఇరగదీసి ఉంటాడు' అని చాలామంది ఫిక్సయ్యారు. మరి... నారా రోహిత్ ఆ నమ్మకాన్ని నిజం చేశాడా? 'అసుర' విజయపథంలో వెళ్లే విధంగా ఉందా.. చూద్దాం...

 

à°•à°¥
ధర్మతేజ (నారా రోహిత్) జైలర్ గా వర్క్ చేస్తుంటాడు. పని విషయంలో రాక్షసుడు. ధర్మ చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు అన్యాయంగా చంపబడతారు. అప్పట్నుంచి అన్యాయం, మోసం, చెడు చేసేవాళ్లకు సమాజంలో బ్రతికే హక్కులేదు అనే యాటిట్యూడ్ తో ఉంటాడు. తన కాలేజ్ మేట్ అయిన హారిక (ప్రియాజెనర్జి) ని ప్రాణంగా ప్రేమిస్తాడు. ధర్మ జైలర్ గా ఉన్న జైల్లో తన సవితితల్లి పిల్లలను చంపేసిన కారణంగా ఉరిశిక్ష పడ్డ ఖైదీ చార్లి (రవివర్మ) ఉంటాడు. ఉరిశిక్ష పడినప్పటికీ, ఎలాగైనా జైలు నుంచి పారిపోయి బ్రతకాలనే టార్గెట్ తో ఉంటాడు చార్లి. దాంతో జైల్లో ఉన్న ఓ వ్యక్తికి బెయిల్ వచ్చేలా చేసి, అతను తనను జైలు నుంచి బయటికి వచ్చేలా చేస్తే డైమండ్స్ ఇస్తానని చెబుతాడు చార్లి. బయటికి వచ్చిన ఆ వ్యక్తి సుధాకర్ అండ్ గ్యాంగ్ ని కలిసి చార్లిని జైలు నుంచి బయటికి రప్పించి, ఉరిశిక్ష పడకుండా చేయగలిగితే 50కోట్ల విలువ చేసే డైమండ్స్ సొంతమవుతాయని చెప్పి డీల్ కు అంగీకరింపజేస్తాడు. డీల్ కి అంగీకరించిన సుధాకర్ అండ్ గ్యాంగ్ చార్లిని జైలు నుంచి తప్పించడానికి ప్లాన్ చేస్తారు.
అందులో భాగంగా జైలర్ ప్రేయసి హారికను, ఉరితీయబోయే తలారి తల్లిని, జడ్జి మనవడిని కిడ్నాప్ చేస్తాడు సుధాకర్. అయితే తమ సొంత మనుషులు కిడ్నాప్ కి గురైన విషయాన్ని ఈ ముగ్గురూ ఒకరికి ఒకరు చెప్పకోరు. చార్లిని ఉరి తీసే టైమ్ కి ఎవరికివారు తమ బాధను బయటికి చెప్పకుండా కామ్ గా ఉండిపోతారు. మరి చార్లీని ఉరి తీస్తారా? ఉరి తీస్తే సుధాకర్ కిడ్నాప్ చేసిన ముగ్గురి పరిస్థితి ఏంటీ? చెడు బ్రతకకూడదనుకునే ధర్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేదే ఈ చిత్రం సెకండాఫ్.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
జైలర్ ధర్మ పాత్రను నారా రోహిత్ చాలా అద్భుతంగా చేశాడు. బాడీ లాంగ్వే్జ్ చాలా బాగుంది. సంభాషణలు పలికిన తీరు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కవితలు చెప్పినప్పుడు పదాల ఉచ్ఛారణ చాలా స్పష్టంగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా భేష్ అనిపించుకున్నాడు. కథానాయిక ప్రియా బెనర్జీ చూడ చక్కగా ఉంది. ఉన్నంతలో బాగా నటించింది. మెయిన్ విలన్ గా నటించిన రవి వర్మ విలనిజం బాగా పండించాడు. ఇక, ఇతర పాత్రధారులందరూ పాత్రల్లో ఒదిగిపోయారు.

 

సాంకేతిక వర్గం
దర్శకడు కృష్ణ విజయ్ కి ఇది తొలి చిత్రం. ఎంచుకున్న కథను నీట్ గా తెరకెక్కించాడు. స్టార్టింగ్ టు ఎండింగ్ మంచి టెంపో మెయిన్ టైన్ చేయగలిగాడు. డైలాగ్స్ షాట్ అండ్ స్వీట్ గా ఉన్నాయి. కొన్ని సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. సాయి కార్తీక్ మ్యూజిక్ ఓ హైలైట్. పాటలన్నీ కథానుసారం ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ఇతర శాఖల పని తీరు బాగుంది. నిర్మాతగా నారా రోహిత్ కి ఇది తొలి చిత్రం. కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
'అసుర' కథ బాగుంది. స్ర్కీన్ ప్లే బాగుంది. టేకింగ్ పరంగా కూడా డైరెక్టర్ కి ప్లస్ మార్కులు పడతాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ లో ఏది బాగుంది? అనే విషయానికొస్తే.. ఫస్టాఫ్ బాగుంది. అలాగని సెకండాఫ్ ని తక్కువ చేసి చెప్పడానికి లేదు. ఉరి అమలుపరిచే జైలర్, తలారి, జడ్జి ముగ్గురికి సంబంధించిన వ్యక్తులూ కిడ్నాప్ అయినప్పటికీ ఉరిని ఆపేయకుండా చార్లిని ఉరికంబం వరకూ తీసుకెళ్లే సీన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. క్లయిమ్యాక్స్ లో రివీల్ చేసిన ట్విస్ట్ ని ప్రేక్షకులు ఊహించరు. ఇది సినిమాకి చాలా ప్లస్. ఈ రెండు పాయింట్స్ సినిమాని నిలబెడతాయి. నారా రోహిత్ కొంచెం సన్నగా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కలగక మానదు. అది మినహా తన నటన గురించి వంక పెట్టడానికి లేదు. ఓవరాల్ గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చుతుంది.

ఫైనల్ గా చెప్పాలంటే.. 'అసుర' బాగుంది. నారా రోహిత్ ఖాతాలో ఓ కమర్షియల్ హిట్ చేరడం ఖాయమనే చెప్పాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !