View

ఆంధ్రాపోరి మూవీ రివ్య్వూ

Friday,June05th,2015, 09:18 AM

చిత్రం - ఆంధ్రాపోరి
నటీనటులు - ఆకాష్ పూరి, ఉల్కాగుప్తా, పూర్ణిమ, ఈశ్వరీరావు, అరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీతేజ తదితరులు
ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ - ప్రవీణ్ వనమాలి
సంగీతం - జోస్యభట్ల
నిర్మాత - రమేష్ ప్రసాద్
దర్శకత్వం - రాజ్ మాదిరాజ్
విడుదల తేదీ - 5.6.2015

 

ధోని, లోటస్ పాండ్ తదితర చిత్రాల ద్వారా బాల నటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి. హ్యాండ్ సమ్ గా ఉండే ఆకాష్ 'ఆంధ్రా పోరి' చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా చేయనంటే, 'ఇది వదులుకుంటే నువ్వు మంచి సినిమా వదులుకున్నట్లే' అని పూరి అనడం, తండ్ర మాటను కాదనకుండా ఆకాష్ ఈ చిత్రం చేయడం జరిగింది. మంచి మాస్ కమర్షియల్ చిత్రాలను అందించడం, హీరోలను ఫుల్ మాస్ గా చూపించడం.. పూరి స్టయిల్. ఆయనే స్వయంగా తనయుణ్ణి ఈ చిత్రం చేయమన్నారంటే సమ్ థింగ్ ఉండే ఉంటుంది. ఇక, సినిమా చరిత్రలో ఓ అధ్యాయం అయిన ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థపై రమేశ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. మరి.. హీరోగా ఆకాష్ పూరి భేష్ అనిపించుకుంటాడా? 'ఆంధ్రా పోరి' అందర్నీ ఆకట్టుకుంటుందా? చూద్దాం...

 

à°•à°¥
నర్సింగ్ యాదవ్ (ఆకాష్ పూరి) నిజామాబాద్ కి చెందిన టీనేజ్ కుర్రాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. కూతురు, కొడుకును తల్లి యాదమ్మ పనులు చేస్తూ పోషిస్తుంటుంది. కొడుకు నర్సింగ్ టెన్త్ పాస్ అయితే పవర్ హౌస్ లో ఉద్యోగం వస్తుంది, అప్పుడు కుటుంబాన్ని తనే పోషిస్తాడనే ఆశతో ఉంటుంది. కానీ మూడుసార్లు టెన్త్ ఫెయిల్ అవుతాడు నర్సింగ్. తనకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటాడు. ఓ సిట్యువేషన్ లో తల్లి ఇంటి నుంచి గెంటేయడంతో థియేటర్ లో పనికి చేరతాడు నర్సింగ్. ఓ సందర్భంలో ఆంధ్రాపోరి ప్రశాంతి (ఉల్కాగుప్తా)ని చూస్తాడు నర్సింగ్. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఉన్నది ఉన్నట్టు, ఎలాంటి కల్మషం లేకుండా ఉండే నర్సింగ్ అంటే ప్రశాంతి కూడా ఇష్టపడుతుంది. పేద కుర్రాడు అయిన నర్సింగ్, అప్పర్ మిడిల్ క్లాస్ అయిన ప్రశాంతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తి వ్యతిరేకం. నర్సింగ్ తో తన కూతురు ప్రేమలో పడిందన్న విషయం తెలుసుకున్న ప్రశాంతి తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రశాంతి అంటే అమితంగా ఇష్టపడే నర్సింగ్ యాదవ్ ఎలాంటి లక్ష్యాన్ని చేరుకుంటే ప్రశాంతిని తనదానిని చేసుకోగలుగుతాననే విషయం తెలుసుకుని అందుకు ఏం చేస్తాడు అనేదే ఈ చిత్రం సెకండాఫ్. ఈ టీనేజర్స్ ది టైమ్ పాస్ ప్రేమా? లేక నిజమైన ప్రేమా అనేదే ఈ చిత్రం కథాంశం.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
నర్సింగ్ యాదవ్ పాత్ర ఆకాష్ పూరీకి సవాల్ లాంటిది. అలవాటు లేని తెలంగాణ యాస మాట్లాడటం ఓ సవాల్. అందుకు తగ్గట్టుగా నటించడం మరో సవాల్. ఏదేమైనా ఈ పాత్రకు న్యాయం చేశాడు. భవిష్యత్తులో మంచి మాస్ హీరో అయ్యే అవకాశం ఉంది. ఉల్కా గుప్తా చాలా క్యూట్ గా ఉంది. బాగా నటించింది కూడా. అమ్మ పాత్రను ఈశ్వరీ రావ్ చాలా సహజంగా చేసింది. ఉల్కా తండ్రి పాత్రధారి నటన బాగుంది. ఆ పాత్ర కామెడీ, ఎమోషనల్ గా ఉంటుంది. అరవింద్ కృష్ణ, ఉత్తేజ్ తదితరులు బాగా నటించారు.

 

సాంకేతిక వర్గం
మరాఠీలో ఘనవిజయం సాధించిన 'టైమ్ పాస్' చిత్రానికి ఇది రీమేక్. ఈ కథను దర్శకుడు రాజ్ మాదిరాజ్ బాగానే తెరకెక్కించాడు. జోస్యభట్ల స్వరపరచిన పాటలు బాగున్నాయి. ప్రవీణ వనమాలి కెమెరా పనితనం భేష్. సినిమా నిడివి ఎక్కువ ఉన్న ఫీల్ కలగక మానదు. ఎడిటింగ్ పరంగా కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమానే ఊపిరి అనే సిద్ధాంతం ప్రసాద్ ప్రొడక్షన్స్ ది. కథ డిమాండ్ చేసిన మేరకు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు రమేష్ ప్రసాద్.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇలాంటి టీనేజ్ ప్రేమకథలు మనం చాలానే చూశాం. కానీ, కొన్ని కథలు మెచ్యుర్డ్ గా ఉంటాయి. ఈ కథలో అది లోపించింది. టైటిల్ పెట్టాం కదా అని హీరోతో పదే పదే ఆంధ్రా పోరి అని హీరోయిన్ ని పిలిపించడం కొంచెం ఎబ్బెట్టుగా ఉంది.ఏదేమైనా మరాఠీ సినిమా చేసినంత మ్యాజిక్ తెలుగు చిత్రం చేయకపోవచ్చు. నటుడిగా ఆకాష్ పూరి ఫెయిల్ కాలేదు. సినిమా సోసోగా ఉంది కాబట్టి, ఫలితం అలానే ఉంటుందని చెప్పక తప్పదు. కాకపోతే, సినిమా మొత్తం నీట్ గా ఉండటంతో పాటు చిన్నపాటి సందేశం కూడా ఉంది కాబట్టి, టైమ్ పాస్ కోసం ఓసారి చూడొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !