View

వేర్ ఈజ్ విద్యాబాలన్ మూవీ రివ్య్వూ

Thursday,June25th,2015, 06:25 PM

చిత్రం - వేర్ ఈజ్ విద్యాబాలన్
నటీనటులు - ప్రిన్స్, జ్యోతిసేథ్, సంపూర్నేష్ బాబు, రావు రమేష్, జయప్రకాష్ రెడ్డి, ఆశిష్ విద్యార్ధి, సప్తగిరి, తాగుబోతు రమేష్, మధునందన్, రవిప్రకాష్, రవివర్మ, ప్రభాస్ శ్రీను, జెన్నిఫర్ (ఐటెం సాంగ్)...
కెమెరా - చిట్టిబాబు
ఎడిటింగ్ - మధు
సంగీతం - కామ్రాన్
మాటలు - సాయి, వెంకీ డీ పాటి
సమర్పణ - కృష్ణ బద్రి, శ్రీధర్ రెడ్డి
సహ నిర్మాత - హేమ వెంకట్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు - అక్కినేని శ్రీనివాస రావు, బాలాజీ శ్రీను
బ్యానర్ - శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్
నిర్మాతలు - వేణు గోపాల్ రెడ్డి, లక్ష్మి నరసింహ రెడ్డి, ఆలూరి చిరంజీవి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - శ్రీనివాస్
విడుదల తేదీ - 26.6.2015


'వేర్ ఈజ్ విద్యాబాలన్'... అనే టైటిల్ తో సినిమా తీస్తే 'సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి' అనే క్యూరియాసిటీ అందరిలో కలగడం ఖాయం. ఆ విధంగా చిత్రదర్శకుడు శ్రీనివాస్ రాగ అందరి దృష్టీ తమ సినిమా వైపు పడేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. లవర్ బోయ్ ప్రిన్స్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అసలు విద్యాబాలన్ ఎవరు? సినిమాలో కథానాయిక విద్యాబాలన్ ప్రస్తావన ఏమైనా ఉంటుందా? అనే అంచనాలతో థియేటర్ కి వస్తారు. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ అని ముందు నుంచీ శ్రీనివాస రాగ చెప్పుకుంటూ వచ్చారు. మరి.. ఈ చిత్రం ఏ మేరకు ఎంటర్ టైన్ చేస్తుంది? మంచి టైమ్ పాస్ మూవీ అవుతుందా?.... తెలుసుకుందాం...

 

à°•à°¥
కిరణ్ (ప్రిన్స్) పిజ్జా డెలివరీ బోయ్. ఓ సందర్భంలో స్వాతి (జ్యోతిసేథీ) ని చూసి ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. సూర్య హాస్పటల్స్ లో స్వాతి డాక్టర్ గా వర్క్ చేస్తుంటుంది. స్వాతి బావ వాల్తేరు వాసు (మధునందన్) కు స్వాతి అంటే చాలా ఇష్టం. ప్రేమిస్తున్నానని స్వాతి వెంటపడుతున్న కిరణ్ ని ఎలాగైనా కట్ చేయాలని ప్రయత్నాలు చేస్తాడు వాల్తేరు వాసు. స్వాతికి కిరణ్ ని చెడ్డవాడుగా చూపించడానికి కిక్వర్ డాట్ కామ్ లో స్వాతి, ఆమె ఫ్రెండ్స్ ఫోటోలను అప్ లోడ్ చేసి... వారి కోసం కావాలంటే కిరణ్ ని కాంటాక్ట్ చేయాల్సిందిగా మెసేజ్ పెట్టి కిరణ్ ఫోన్ నెంబర్ ఇస్తాడు వాసు. తనను, తన ఫ్రెండ్స్ ని ఇంత చీప్ చేసిన కిరణ్ మీద అసహ్యం, కోపం తెచ్చుకున్న స్వాతి ఇంకెప్పుడూ తనకు ఎదురుపడవద్దని చెప్పి, అతనికి దూరమవుతుంది. తన ప్రేమను చెడగొట్టిన వాసును కొట్టడానికి పబ్ కి వెళతాడు కిరణ్. అక్కడ ఓ వైపు కిరణ్, వాసుకు మధ్య గొడవ జరుగుతోంటే, మరోవైపు ఓ కిల్లర్ డాక్టర్ హర్ష (రవిప్రకాష్)ను ఛేజ్ చేస్తుంటాడు. హర్ష దగ్గర ఉన్న ఫోన్ కోసం అతనిని వెంటాడతాడు ఆ కిల్లర్. ఆ ఛేజింగ్ లో హర్షను కిల్లర్ షూట్ చేస్తాడు. గాయపడ్డ హర్ష తనను హాస్పటల్ కి తీసుకెళ్లమని కిరణ్, వాసును బతిమాలుకుంటాడు. హర్షను కారులో కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి బయల్దేరతారు కిరణ్, వాసు. కానీ, కారులోనే చనిపోతాడు హర్ష. దాంతో పోలీసులు ఇంటరాగేషన్ ఆరంభమవుతుంది. సి.సి కెమెరా ఫుటేజ్ ద్వారా హర్షతో ఉన్నది కిరణ్, వాసు అని పోలీసులకు తెలుస్తుంది. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు మొదలుపెడతారు.
అసలు హర్ష దగ్గర ఫోన్ తీసుకోవడానికి కిల్లర్ ఎందుకు వెంటపడతాడు? తమ మీద పడిన మర్డర్ కేసు నుంచి కిరణ్, వాసు ఎలా తప్పించుకుంటారు? ఆ ఫోన్ లో ఏముంది... విద్యాబాలన్ కి ఈ సినిమాతో సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

 

 

 

నటీనటులు
ప్రిన్స్ హ్యాండ్ సమ్ గా ఉంటాడు. ఈ చిత్రంలో ఇంకా బాగున్నాడు. దానికి కారణం ఫిజికల్ ఫిట్ నెస్. చాలా ఫిట్ గా ఉన్నాడు. కిరణ్ పాత్రను బాగా చేశాడు. ముందు హ్యాపీ గో గై గా కనిపించి, ఆ తర్వాత ఓ క్రిటికల్ సిట్యువేషన్ లో ఇరుక్కునే కుర్రాడిగా బాగా ఒదిగిపోయాడు. జ్యోతీ సేథ్ గొప్ప అందగత్తె కాకపోయినా బాగుంది. స్వాతి పాత్రను బాగానే చేసింది. ఇక, జయప్రకాశ్ రెడ్డి గురించి చెప్పక్కర్లేదు. పులినాయుడుగా ఫుల్ గా రెచ్చిపోయారు. ఓ రేంజ్ లో నవ్వించారు. మధు నందన్, సప్తగిరి, తాగుబోతు రమేష్ అయితే చెప్పక్కర్లేదు. బాగా ఎంటర్ టైన్ చేశారు. విలనీ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో రావు రమేష్, రవిప్రకాశ్, పాజిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఆశిష్ విద్యార్థి పూర్తి న్యాయం చేశారు. డాన్ ఘంటాగా సంపూర్నేశ్ బాబు సూపర్.

 

సాంకేతిక వర్గం
స్టోరీ లైన్ చాలా చిన్నది. చక్కటి స్ర్కీన్ ప్లే తో ఆ లైన్ ని చివరి వరకూ ఆసక్తికరంగా చూపించడంలో శ్రీనివాస్ రాగ సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులు ఎంజాయ్ చేయని సన్నివేశాలు చాలా తక్కువ. సంభాషణలు బాగున్నాయి. పాటలు మామూలుగా ఉన్నాయి. రీ-రికార్డింగ్ కథానుసారం ఉంది. ఎడిటింగ్ బాగుంది. వేస్ట్ సీన్ ఒక్కటి కూడా కనిపించదు. ఓవరాల్ గా కథ, బడ్జెట్ పరిధి మేరకు టెక్నికల్ గా సినిమా బాగుంది.

 

ఫిల్మీ బజ్ విశ్లేషణ
ప్రతి ఒక్కరికీ ఎంటర్ టైన్ మెంట్ చాలా అవసరం. అందరికీ అందుబాటులో ఉండే ఎంటర్ టైన్ మెంట్ 'సినిమా'. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లు టిక్కెట్ కొనుక్కుని థియేటర్ కి వస్తారు. అలా వచ్చేవారిని కాసేపు ఎంటర్ టైన్ చేసిన ఏ సినిమా అయినా మంచిదే. ఆ విధంగా చెప్పాలంటే 'వేర్ ఈజ్ విద్యాబాలన్' మంచి ఎంటర్ టైనర్. సస్పెన్స్ మూవీ అయినా, ప్రేక్షకులను అడుగడుగునా టెన్షన్ పెట్టకుండా, ఫన్నీ వేలో కథను చూపించడం ఓ రిలీఫ్. సినిమా చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్ బాగుంది. ఓవరాల్ గా లైటర్ వీన్ గా సాగే సినిమా. ముఖ్యంగా సంపూర్నేష్ రేచీకటి సన్నివేశాలు, అతని బారి నుంచి తప్పించుకోవడానికి జయప్రకాష్ రెడ్డిలాంటి విలన్ విజిల్ కోసం అందరినీ బ్రతిమలాడుకోవడం, తాగుబోతు రమేష్ క్వార్టర్ కోసం డిమాండ్ చేసే సీన్స్, షాపింగ్ మాల్ లో సప్తగిరి రెచ్చిపోయిన వైనం, బాత్రూమ్ లో దాక్కున్న మధునందన్ ని చూడకుండా బుడ్డోడు బాత్రూమ్ కి వెళ్లే సీన్... ఇలా ఈ చిత్రంలో నవ్వుకోవడానికి బోల్డన్ని సీన్స్ ఉన్నాయి. ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే సినిమా ఇవ్వాలన్నదే మా ప్రయత్నం అని ఈ చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చింది. ఆ మాటను నిజం చేసింది.


ఫైనల్ గా చెప్పాలంటే... టెన్షన్స్ అన్నీ మర్చిపోయి కాసేపు నవ్వుకోవాలనుకుంటే.. 'వేర్ ఈజ్ విద్యాబాలన్'ని చూసేయండి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !