View

బాహుబలి మూవీ రివ్య్వూ

Friday,July10th,2015, 07:54 AM

చిత్రం - బాహుబలి
బ్యానర్ - ఆర్కా మీడియా వర్క్స్
నటీనటులు - ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణన్, సత్యరాజ్, నాజర్, సుదీప్, అడవి శేష్, ప్రభాకర్ తదితరులు
సంగీతం - యం.యం.కీరవాణి
సినిమాటోగ్రఫీ - కె.కె.సెంథిల్ కుమార్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్ - సాబు శిరిల్
కథ - వి.విజయేంద్రప్రసాద్
నిర్మాతలు - శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
స్ర్కీన్ ప్లే - యస్.యస్.రాజమౌళి, రాహుల్ కోడా, మదన్ కార్కే, విజయేంద్రప్రసాద్
దర్శకత్వం - యస్.యస్.రాజమౌళి
విడుదల తేదీ - 10.7.2015

 

''ఇలాంటి సినిమా వదులుకుంటే.. భవిష్యత్తులో మళ్లీ వస్తుందో.. రాదో... అందుకే చేశాం'' - 'బాహుబలి' నటీనటులు
''భారతీయ సినిమా స్థాయిని పెంచే చిత్రం ఇది'' - సినీ పండితులు
''ఇది ప్రపంచ స్థాయి సినిమా'' - సినిమా దిగ్గజాలు
''బాహుబలి న భూతో న భవిష్యతి'' - సినిమా పరిశీలకులు
... ఇలా గత మూడేళ్లల్లో ఎక్కడ చూసినా 'బాహుబలి' గురించి అభినందనలే అభినందనలు.


భారీ నిర్మాణ వ్యయంతో రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం నేడు (10.07.) తెరకొచ్చింది. ఈ సినిమా కోసం ప్రభాస్ పూర్తిగా మూడేళ్లు కేటాయించేశాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. రానా బరువు పెరిగాడు. తనూ ఎంతో కష్టపడి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. గులాబీ బాల అనుష్క కూడా పాపం యుద్ధ విద్యలు నేర్చుకుని ఎంతో కష్టపడింది. తమన్నా, రమ్యకృష్ణ.. ఇలా ఎవరికి వాళ్లు తమదైన శైలిలో కష్టపడ్డారు. అసలిలాంటి చిత్రాన్ని ఊహించడమే కష్టం. రాజమౌళి ఊహించి, తెరకెక్కించడం ఓ గొప్ప విషయం. మరి... ఇంతమంది కష్టంతో తయారైన 'బాహుబలి' ఏ విధంగా ఉంది? ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది?... చూద్దాం.


à°•à°¥
మహిష్మతి రాజమాత శివగామి (రమ్యకృష్ణ) రాజ్యం నుంచి తప్పించుకుని పసికందును తీసుకుని వాగులమ్మ నది ఒడ్డుకు చేరుకుంటుంది. సేనలు ఆమెను బంధించడానికి వెనకపడతారు. నది మధ్యలోకి వెళ్లిన శివగామి అరచేతిలో బిడ్డను పట్టుకుని తన ప్రాణం తీసుకుని, బిడ్డను కాపాడమని దేవిమాతను వేడుకుంటుంది. నది మధ్యలో చేతిలోని బిడ్డను చూసిన అంబుల గ్రామం వాళ్లు బిడ్డను కాపాడతారు. బిడ్డను కాపాడి ఎవరో రాజమాత తన ప్రాణాలు విడిచిందని భావిస్తారు. ఆ బిడ్డను సంగ (రోహిణి), ఆమె భర్త తమ బిడ్డలా భావించి శివుడు (ప్రభాస్) అని నామకరణం చేసి పెంచుతారు. చిన్నప్పటి నుంచి కొండపైన ఎదో ఉందని, పైకెక్కాలని ప్రయత్నాలు చేస్తుంటాడు శివుడు. తల్లి అతనిని వారిస్తుంటుంది.


పెరిగి పెద్దవాడైన శివుడు కొండపైన అవంతిక (తమన్నా)ని చూసి, అవలీలగా కొండ ఎక్కేసి ఆమె వెంటపడతాడు. అవంతిక తన వారితో కలిసి ఓ గుహలో ఉందనే విషయం తెలుసుకుంటాడు. ఆమె వెనకాలే పడుతూ ఆమెకు తెలీకుండానే పచ్చ బొట్టు పొడుస్తాడు శివుడు. అవంతిక మహిష్మతి రాజ్యానికి చెందిన అమ్మాయి. ఆ రాజ్యంలో బంధీగా ఉన్న దేవసేనను విడిపించాలనే ధేయ్యంతో ఉంటుంది. ఆమెతో పాటు ఆ రాజ్యానికి చెందిన వారు కూడా ఆ గుహలో ఇదే ధ్యేయంతో ఉంటారు. మహిష్మతి రాజైన భల్లాలదేవ (రానా) పుట్టినరోజునాడు బంధీగా ఉన్న దేవసేనను రాజ్యం నుంచి తప్పించి తీసుకురావాలని తమ నాయకుడు ఇచ్చిన ఆజ్ఞతో అవంతిక మహిష్మతి రాజ్యానికి బయలుదేరుతుంది.


కొండవాగు దాటుతున్నప్పుడు శివుడుని కలుస్తుంది అవంతిక. తన కోసం కొండ ఎక్కి వచ్చాడని తెలుసుకుని అతని ప్రేమలో పడిపోతుంది అవంతిక. ఇద్దరూ ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకున్న అనంతరం దేవసేనను విడిపించాలన్న అవంతిక బాధ్యతను తను తీసుకుంటున్నానని చెప్పి శివుడు మహిష్మతి రాజ్యానికి బయలుదేరతాడు.


మహిష్మతి రాజ్యంలోకి వచ్చిన శివుడని అక్కడ సైన్యం 'బాహుబలి' అని సంభోదిస్తూ, దేవుడిలా చూస్తారు. శివుడుని చూసిన దేవసేన తన కొడుకు వచ్చేసాడు... ఇక మహిష్మతి రాజ్యానికి భల్లాలదేవ నుంచి విముక్తి కలుగుతుందనుకుంటుంది. దేవసేనను రాజ్యం నుంచి తీసుకెళ్లిపోతున్న శివుడిని ఆ రాజ్యంలో బానిసగా ఉంటున్న కట్టప్ప అడ్డుకుంటాడు. కానీ శివుడిని చూసిన తర్వాత తన్మయత్వంతో ఉప్పొంగిపోతాడు.


అసలు బాహుబలి ఎవరు? శివుడ్ని భాహుబలి అని పిలుస్తుంటారు? అసలైన బాహుబలి ఎవరు? అతనేమయ్యాడు? దేవసేనను ఎందుకు భల్లాలదేవ బంధించాడు? శివుడుని ఆ రాజ్యం నుంచి తప్పించి, శివగామి ఎందుకు ప్రాణ త్యాగం చేసింది? శివుడిని మహిష్మతి రాజ్య ప్రజలు ఎందుకు బాహుబలి అని పిలుస్తారు... దేవుడిలా చూస్తారు... కట్టప్ప ద్వారా శివుడు తెలుసుకున్న తన గతం ఏంటీ అనేదే ఈ చిత్రం మిగతా కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
శివుడు, బాహుబలి పాత్రలను ప్రభాస్ బాగా చేశాడు. ముఖ్యంగా శివుడు పాత్రలో శివలింగాన్ని మోసే సన్నివేశంలో ప్రభాస్ నడిచిన తీరు. హావభావాలు బాగున్నాయి. బాహుబలి పాత్రలో భారీకాయుడిగా బాగున్నాడు. యుద్ధ సన్నివేశాల్లో గుర్రం మీద వెళ్లే సన్నివేశాల్లో ప్రభాస్ హావాభావాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భల్లాలదేవ పాత్రను రానా బాగా చేశాడు. దేవసేన పాత్రధారి అనుష్క వైపు చూసే వెటకారపు చూపులు, అధికారం కళ్లుమూసుకుపోయిన వైనాన్ని బాగా ఆవిష్కరించాడు. ఈ రెండు పాత్రల తర్వాత రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాత్రను రమ్యకృష్ణ చేయడంవల్ల కథకు బలం చేకూరింది. రాజమాత పాత్రలో మంచి రాజసం కనబర్చింది. అనుష్క కనిపించేది కొన్ని సన్నివేశాల్లో అయినా.. చక్కని హావభావాలు పలికించింది. అలాగే, కట్టప్పగా సత్యరాజ్ అభినయం సూపర్. కొన్ని సన్నివేశాల్లో తమన్నా డీ-గ్లామరైజ్డ్ గా, కొన్ని సన్నివేశాల్లో గ్లామర్ గా కనిపించి, ఆకట్టుకుంది. కొన్ని పవర్ ఫుల్ సన్నివేశాల్లో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. ఇంకా నాజర్, ప్రభాకర్, రోహిణి, సుదీప్, అడివి శేష్ తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
రాజుల కాలం నాటి కథను ఎంచుకుని, ఈ సినిమా చేశాడు రాజమౌళి. నటీనటుల వేషాలు ఆ కాలానికి తగ్గట్టుగా ఉన్నా, అక్కడక్కడా భాష మాత్రం ఈ కాలాన్ని తలపించింది. అచ్చంగా ఆ కాలాన్ని తలపించేలా కొన్ని సీన్లు లేకపోవడం ఓ మైనస్. సాంకేతికంగా ఈ చిత్రం రాజమౌళికి పెద్ద సవాల్. ముందు బ్లూ మ్యాట్ నేపథ్యంలో చిత్రీకరించి, ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ మిక్స్ చేస్తారు. లేనిది ఉన్నట్లుగా ఊహించుకుని నటీనటులు చేయడం, దర్శకుడు తీయడం.. ఇది సవాలే. ఆ మేరకు టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. కె.కె. సెంథిల్ కుమార్ కెమెరా పనితనం, ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ బాగా కుదిరాయి. విజువల్ గా సినిమా రిచ్ గా ఉంది. వార్ సీక్వెన్స్ లో ప్రభాస్ పాత్ర కనబర్చే టెక్నిక్స్ ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే, ఎక్కువ క్రెడిట్ టెక్నాలజీకి, తక్కువ క్రెడిట్ నటీనటులకు వస్తుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సూపర్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా ఫస్టాఫ్ మామూలుగా సాగుతుంది. ఓస్ ఇంతేనా? అంటూ సెకండాఫ్ చూడ్డానికి ప్రిపేర్ అవుతారు ప్రేక్షకులు. సెకండాఫ్ కొంత భాగం మామూలుగా సాగి, వార్ సీక్వెన్స్ తో ఊపందుకుంటుంది. ఈ యుద్ధ సన్నివేశాలు సినిమాలకి హైలైట్. కేవలం హాలీవుడ్ వాళ్లే ఇలాంటి యుద్ధాలు చూపించగల సమర్థులు అనే అభిప్రాయాన్ని పోగొట్టాగలిగాడు రాజమౌళి. భారతీయ సినిమా స్థాయిని పెంచే చిత్రం అంత సీన్ లేకపోయినా టెక్నాలజీని వాడుకుని, విజువల్ వండర్ తీయగల సత్తా మనవాళ్లకు ఉందని నిరూపించుకున్నాడు. కానీ, కొన్ని సన్నివేశాల్లో కథను టెక్నాలజీ డామినేట్ చేసేసింది. శివుడు పాత్ర కొండలు ఎక్కడం, శివుడు, అవంతిక పాత్రధారి తమన్నా మంచు సునామీ నుంచి తప్పించుకునే సన్నివేశం అసహజంగా ఉన్నాయి. ప్రేక్షకుడికి కలగాల్సినంత ఎమోషన్ కలగదు. ఆ మాటకొస్తే... బ్రతికున్నాడో లేడో తెలియని కొడుకు బ్రతికే ఉంటాడన్న నమ్మకంతో దేవసేన ఎదురు చూస్తుంది. తన నమ్మకం నిజమై, కొడుకు కనబడిన సన్నివేశం ప్రేక్షకులను కదిలించాలి. ఆ సీన్ పేలవంగా ఉండటంతో అంత టచింగ్ అనిపించదు. ఇలా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. దేవసేనను రాజ్యం నుంచి తీసుకెళ్లిపోయే సీన్ కూడా అంత ఎఫిక్టివ్ గా లేదు. దేవసేనను తీసుకువచ్చేసిన తర్వాత కట్టప్ప ఎంట్రీతో ఈ సీన్ ఊపందుకుంది. కట్టప్ప కనబర్చిన ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే, 'ఒళ్లంత.. తుళ్లింత..' ఐటమ్ సాంగ్ వేస్ట్. ఈ కాలానికి సంబంధించిన ఐటమ్ సాంగ్ లానే డ్యాన్సర్ల వేషాలుండటం ఆశ్చర్యంగా ఉంటుంది. 'ఎవ్వడంట... ఎవ్వడంట...' పాట బాగుంది. సెకండాఫ్ లోని వార్ సీన్స్ బాగున్నాయి. సినిమాకి ఈ వార్ సీన్స్ హైలెట్. అయితే కేవలం వార్ సీన్స్ తోనే ప్రేక్షకులు శాటిస్ ఫై అవ్వరు.


ఫైనల్ గా చెప్పాలంటే... రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ మీద బాగా దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఎమోషన్ మిస్సవుతుందేమోనని గ్రహించలేకపోయాడు. వేలమంది కష్టం, కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ 'బాహుబలి' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏదేదో ఊహించుకుని, థియేటర్ కి వెళితే నిరాశ తప్పదు. సినిమా రిలీజ్ కు ముందు విడుదల చేసిన పోస్టర్స్, సినిమాలోని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ప్రేక్షకులను ఊహల్లో వివహరింపజేసాయి. వారి ఊహలకు తగ్గట్టు సినిమా లేకపోవడం నిరాశపరుస్తుంది. ఏమీ ఊహించుకోకుండా జస్ట్ ఓ సినిమా చూడ్డానికి వెళితే... గ్రాండియర్ విజువల్స్ ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. కంటెంట్ పరంగా గొప్పగా లేకపోయినా, విజువల్ పరంగా కొంతవరకూ శాటిస్ పై అవుతారు. ఏదేమైనా ఒకసారి చూడదగ్గ చిత్రమే. మళ్లీ మళ్లీ సినిమాని చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !