View

అల్లుడు శీను మూవీ రివ్య్వూ

Friday,July25th,2014, 11:51 AM

చిత్రం - అల్లుడు శీను

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సమంత, తమన్నా (స్పెషల్ అపియరెన్స్), ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, తనికెళ్ల భరణి, రఘుబాబు, రవిబాబు తదితరులు

కథ: రవీంద్ర, కోన వెంకట్

మాటలు: కోన వెంకట్, గోపీమోహన్

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

కెమెరా: ఛోటా కె. నాయుడు

ఎడిటింగ్: గౌతంరాజు

సమర్పణ: బెల్లంకొండ సురేష్

నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు.

స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : వి.వి.వినాయక్

చిత్రసీమలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే అరంగేట్రం అత్యంత వైభవంగా ఉంటుంది. అందుకే బ్యాక్ గ్రౌండ్ ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అరంగేట్రం భారీగా జరిగింది. తన తనయుడి చిత్రం ఘనంగా ఉండాలనే ఆకాంక్షతో ఖర్చుకు వెనకాడకుండా బెల్లంకొండ సురేష్ ఈ సినిమా నిర్మించారు. అగ్రదర్శకుడు వి.వి. వినాయక్ ఈ చిత్రాన్ని ఎంతో ఇష్టపడి చేశారు. తనకు 'ఆది'వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం చేసే అవకాశం కల్పించిన బెల్లంకొండకు ఏదైనా చేయాలనే ఆకాంక్షతో ఈ సినిమ చేశారు వినాయక్. భారీ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో బెల్లంకొండ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సాయి శ్రీనివాస్ ఏ మేరకు నిరూపించుకున్నాడు? ఈ లాంచింగ్ చిత్రం తనకు ఎలాంటి పేరు తెస్తుంది? పరిశ్రమకు మరో మంచి మాస్ హీరో దొరికాడు అనిపించుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.

à°•à°¥

అల్లుడు శీను (సాయి శ్రీనివాస్), అతని మామయ్య నరసింహా (ప్రకాష్ రాజ్) చాలా సరదాగా ఉంటారు. నల్గొండ జిల్లలోని ఓ గ్రామానికి చెందిన ఈ ఇద్దరూ తెగ అప్పులు చేస్తారు. బాకీ చెల్లించమంటూ ఊళ్లోవాళ్లు ఒత్తడి చేస్తుంటే అక్కణ్ణుంచి తప్పించుకుందామని, చెన్నయ్ పారిపోవాలనుకుంటారు. దొంగచాటుగా ట్రైన్ ఎక్కేస్తారు. కానీ, అది చెన్నయ్ వెళ్లే ట్రైన్ కాదు.. హైదరాబాద్ వెళుతుంది. భాగ్యనగరంలో అడుగుపెడతారు మామ, అల్లుళ్లు. అక్కడ అల్లుడు శీనుకి అచ్చం తన మేనమామ పోలికలతో ఓ భాయ్ (ప్రకాష్ రాజ్) కనిపిస్తాడు. దాంతో ఓ ప్లాన్ వేస్తాడు. తన మామ భాయ్ లానే ఉండటంతో.. చిన్న చిన్న దందాలు చేసి, డబ్బులు సంపాదించడం మొదలుపెడతాడు. దీనికోసం భాయ్ పీఏ డింఫుల్ (బ్రహ్మానందం)ని వాడుకుంటాడు శీను. అలాగే భాయ్ కుమార్తె అంజలి (సమంత)తో ప్రేమలో పడతాడు. తను కూడా శీనుని ప్రేమిస్తుంది. ఒకవైపు దందాలు, మరోవైపు ప్రేమతో శీను జీవితం జోష్ గా ఉంటుంది. కానీ, తనలానే ఉన్న నరసింహా గురించి భాయ్ కి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అల్లుడు శీను తన ప్రేమను దక్కించుకున్నాడా? భాయ్ పోలికలతో ఉన్న నరసింహా అసలు కథ ఏంటి? తదితర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.

పర్ఫార్మెన్స్

సాయి శ్రీనివాస్ కి ఇది తొలి చిత్రం కాబట్టి, అందరి దృష్టీ అతను ఎలా నటించాడనే విషయంపైనే ఉంటుంది. సాయి చూడచక్కగా ఉన్నాడు. మంచి ఎత్తు. డాన్సులు చాలా బాగా చేశాడు. ఫైట్స్ లో కూడా భేష్ అనిపించుకున్నాడు. తనకు తొలి సినిమా కాబట్టి, గొప్ప నటనను ఎదురుచూడలేం. ఎవరైనాసరే మొదటి సినిమాతో ఆర్టిస్ట్ గా పనికొస్తారు అనిపించుకుంటే చాలు. సాయి శ్రీనివాస్ అలా అనిపించుకునేలా నటించాడు. ఇక, డింపుల్ గా బ్రహ్మానందం ఇరగదీశాడనే చెప్పాలి. రెండు పాత్రల్లో వ్యత్యాసం కనబర్చి తనలో విలక్షణ నటుడు ఉన్నాడని మరోసారి నిరూపించుకున్నాడు ప్రకాశ్ రాజ్. సమంత పాత్ర దాదాపు పాటలకు పరిమితం అయ్యింది. ఒక పాటలో తమన్నా తళుక్కుమంది. తనికెళ్ల, ప్రదీప్ రావత్ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు

ఈ ఛాయలున్న కథలు తెలుగు తెరపై చాలానే వచ్చాయి. స్ర్కీన్ ప్లే యావరేజ్ గా ఉంది. ఓ కొత్త హీరోకి ఏ స్థాయిలో ఉండాలో మాటలు అలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఓ ప్లస్ పాయింట్. కొన్ని చోట్ల మినహా మిగతా సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఛోటా కెమెరా పనితనం ఓ కనువిందు. ఎడిటింగ్ పరంగా గౌతంరాజు మెరుగైన పనితీరు కనబర్చారు. ఇక, వి.వి. వినాయక్ గురించి చెప్పాలంటే.. ఆయన మంచి మాస్ డైరెక్టర్. ఇవాళ మాస్ హీరో అనిపించుకున్నవారికే మనుగడ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సాయి శ్రీనివాస్ ని మంచి మాస్ హీరోగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. బెల్లంకొండ సురేష్ అయితే డబ్బుని మంచినీళ్లలా ఖర్చుపెట్టినట్లు అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ కనువిందుగా, ప్రతి పాట కలర్ ఫుల్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు సూపర్.

ఫిల్మీబజ్ విశ్లేషణ

ఇది ఫక్తు కమర్షియల్ సినిమా. బాక్సాఫీస్ ని సంతృప్తిపరుస్తుంది. యావరేజ్ కథను ఎలివేట్ చేయడానికి వినాయక్ బాగా కమర్షియల్ హంగులు జోడించాడు. తమన్నాతో ఐటమ్ పాట, ఇప్పటివరకూ ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉన్న సమంత ఈ చిత్రంతో ఫుల్లుగా ఎక్స్ పోజింగ్ చేయడంలాంటి అంశాలు ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. కానీ సెకండాఫ్ ఆరంభమైన కాసేపటికే సినిమా సాగదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మళ్లీ ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ఛేజింగ్ సీన్ ఆడియన్స్ ని ఉత్కంఠతకు గురి చేస్తుంది. పక్కాగా ఇది మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా. సో.. కలక్షన్స్ కి ఢోకా ఉండదు. ఫైనల్ గా చెప్పాలంటే... 'అల్లుడు శీను' కమర్షియల్ విజయం సాధిస్తాడు.

Alludu Srinu Movie Review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !